Just In
- just now
‘సర్కారు వారి పాట’ నుంచి స్పెషల్ వీడియో: మహేశ్ మూవీపై కీర్తీ సురేష్ పోస్ట్
- 44 min ago
టాలీవుడ్లో మరో భారీ మల్టీస్టారర్: బన్నీ, విజయ్ కాంబోలో మూవీ.. చిన్న డైరెక్టర్.. పెద్ద నిర్మాత ప్లాన్!
- 1 hr ago
భర్త చేసిన పనికి అప్పుడే కన్నీళ్లు పెట్టుకున్న నిహారిక.. ఏకంగా వీడియో రిలీజ్ చేసి..
- 1 hr ago
మళ్లీ ప్రేమలో పడ్డ శృతి హాసన్: అతడితో అయిపోయిందంటూ.. పుసుక్కున నోరు జారి బుక్కైంది
Don't Miss!
- Sports
పుజారా.. బ్యాటింగ్ చేస్తుంటే నీకు బోర్ కొట్టదా?! వెలుగులోకి మరో ఆసీస్ ప్లేయర్ స్లెడ్జింగ్!
- Automobiles
డీలర్‌షిప్‌లో ప్రత్యక్షమైన టాటా సఫారీ; ఇంటీరియర్ ఫొటోలు లీక్
- News
అప్పుడెందుకు వాయిదా వేశారు ? జగన్ కు మద్దతుగా పంచాయితీ పోరుపై నటుడు సుమన్ కీలక వ్యాఖ్యలు
- Finance
సెన్సెక్స్ దిద్దుబాటు! నిర్మల ప్రకటన అంచనాలు అందుకోకుంటే.. మార్కెట్ పతనం?
- Lifestyle
Zodiac signs: మీ రాశిని బట్టి మీకు ఎలాంటి మిత్రులు ఉంటారో తెలుసా...!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
భీష్మలో ఆ రెండు ఇష్టం.. రష్మిక అలానే కంటిన్యూ చేయాలి.. త్రివిక్రమ్ కామెంట్స్
యంగ్ హీరో నితిన్-రష్మిక మందాన్న కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం భీష్మ. ఛలో వంటి సూపర్ హిట్ చిత్రాన్ని తీసిన వెంకీ కుడుముల దర్శకత్వంలో రాబోతోన్న ఈ మూవీ టీజర్, పాటలు ,ట్రైలర్ ఓ రేంజ్‌లో వైరల్ అయ్యాయి. సోమవారం (ఫిబ్రవరి 17) భీష్మ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్‌లో త్రివిక్రమ్ ప్రత్యేక అతిథిగా మెరిసాడు.

నమ్మకంగా చెబుతున్నాను..
ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో త్రివిక్రమ్ మాట్లాడుతూ.. ముందుగా ఈ చిత్ర హీరో నితిన్‌కు వాళ్ల అన్నయ్య పవన్ కళ్యాణ్ ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయని మొదలు పెట్టాడు. ఆయన తరుపున, ఆయన అభిమానులందరి తరుపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని పేర్కొన్నాడు. ఈ సినిమాకు పనిచేసిన ప్రతి ఒక్కరికీ అభినందనలు తెలియజేస్తున్నానని, ఎందుకంటే ఈ సినిమా అల్రెడీ తాను చూసినట్టు తెలిపాడు. సినిమా చాలా బాగుందని, 21న అందరూ చాలా బాగా ఎంజాయ్ చేస్తారని నమ్మకంగా చెబుతున్నానని అన్నాడు.

అలానే కంటిన్యూ చేయాలి..
హీరోయిన్ రష్మిక మంచి సక్సెస్ వేవ్‌లో ఉందని.. ‘సరిలేరు నీకెవ్వరు' ఆ తర్వాత ‘భీష్మ'.. అదే సక్సెస్ కంటిన్యూ చేయాలని కోరుకున్నాడు. తనకు మరెన్నో విజయాలు రావాలని అన్నాడు. బెంగళూరు నుంచి ఇక్కడకు 50 నిమిషాలే ప్రయాణమని సో.. వర్రీ అవ్వవద్దని సలహా ఇచ్చాడు. మీరెప్పుడు మాకు దగ్గరగానే ఉంటారని.. రష్మికకు ఆల్ ద బెస్ట్ చెప్పాడు.

ఆ రెండు ఇష్టం..
భీష్మ సినిమాలో తనకు బాగా నచ్చిన అంశాలు సెకండాఫ్‌లో రెండున్నాయని చెప్పుకొచ్చాడు. అందులో ఒకటి వెంకట్ మాస్టర్ చేసిన ఫైట్ అని, రెండోది సినిమాలోని చివరి పాట అని.. జానీ మాస్టర్ చాలా బాగా కంపోజ్ చేశారని తెలిపాడు.


వారు నా పంచ ప్రాణాలు..
భీష్మ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో నితిన్ ఆసక్తికరమైన కామెంట్స్ చేశాడు. అమ్మ, నాన్న, అక్క, త్రివిక్రమ్, పవన్ కళ్యాణ్ తన పంచ ప్రాణాలని, ఈ జాబితాలోకి తన భార్య షాలిని కూడా చేరబోతోందని చెప్పుకొచ్చాడు. ఈ చిత్రం ఫిబ్రవరి 21న విడుదలకు సిద్దంగా ఉంది.