For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్రస్థానంలో శర్వను చూసినప్పుడు అలా.. అందరికి నచ్చేలా రణరంగం: త్రివిక్రమ్

|

శర్వానంద్, కాజల్, కళ్యాణి ప్రియదర్శిని హీరోహీరోయిన్లుగా.. ప్రముఖ దర్శకుడు సుధీర్ వర్మ దర్శకత్వంలో,ప్రముఖ చలన చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న చిత్రం 'రణరంగం'. ఈ చిత్రం ఆగస్టు 15న విడుదల కానుంది. ఈ సందర్బంగా ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్ ఆవిష్కరణ వేడుక కాకినాడలో అశేష అభిమానుల సమక్షంలో వైభవంగా జరిగింది. సుప్రసిద్ధ సినీ దర్శకుడు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కథానాయకుడు శర్వానంద్,నాయిక కల్యాణి ప్రియదర్శిని లతోపాటు రణరంగం చిత్రంలోని ఇతర నటులు,సాంకేతికనిపుణులు,యూనిట్ సభ్యులు ఈ ఫంక్షన్ లో పాల్గొనడం జరిగింది.

Trivikram Srinivas: Sharwanands Ranarangam attracts everyone

*దర్శకుడు త్రివిక్రమ్ మాట్లాడుతూ...*కాకినాడకు రావడం ఆనందంగా ఉంది. ట్రైలర్ చూడగానే కొత్తగా ఉంది. ఈ సినిమాకు అదే ఫస్ట్ సక్సెస్ అనుకున్నాను. చిత్ర యూనిట్ అందరికి అభినందనలు తెలుపుతున్నాను. దర్శకుడు సుధీర్ వర్మ ఈ సినిమాను బాగా తీసాడు. చాలా టైం తీసుకొని రీసెర్చ్ చెయ్యడం జరిగింది. ప్రస్థానం సినిమా చూసినప్పుడు శర్వలో ఆర్టిస్ట్ కనిపించాడు. ఈ సినిమాలో మరింత బాగా నటించాడు. హీరోయిన్స్ ఇద్దరూ బాగా కనిపిస్తున్నారు. రణరంగం మీ అందరికి నచ్చే సినిమా అవుతుందని ఆశిస్తున్నాను' అన్నారు.

Trivikram Srinivas: Sharwanands Ranarangam attracts everyone

*ఈ సందర్బంగా హీరోయిన్ కల్యాణి ప్రియదర్శిని మాట్లాడుతూ...*తెలుగు ప్రేక్షకులకు నమస్కారం. కాకినాడలో ఈ చిత్ర షూటింగ్ కోసం వచ్చాను. మళ్లీ ఇప్పుడు రావడం సంతోషంగా ఉంది. కెమెరామెన్ దివాకర్ వర్క్ బ్యూటిఫుల్ గా ఉంటుంది. నేను త్రివిక్రమ్ గారికి ఫ్యాన్ ని ఆయన ఈ చిత్ర ట్రైలర్ రేలీస్ చెయ్యడం ఆనందంగా ఉంది. శర్వాతో వర్క్ చెయ్యడం మర్చిపోలేని అనుభూతి.

*దర్శకుడు సుధీర్ వర్మ మాట్లాడుతూ...*సినిమా అందరికి నచ్చుతుందని భావిస్తున్న. శర్వా ఈ సినిమాను మంచి ఎనిర్జీ తో చేసాడు. త్రివిక్రమ్ గారికి థాంక్స్ మాకు సపోర్ట్ చేస్తునందుకు. నేను చెప్పదలుచుకున్న విషయాలు సినిమాలో చెప్పాను. రణరంగం మీ అందరిని అలరిస్తుంది భావిస్తున్న'అన్నారు.

*హీరో శర్వానంద్ మాట్లాడుతూ...*'కాకినాడలో కొన్ని రోజులు ఈ సినిమా షూటింగ్ చేసాను, మర్చిపోలేని అనుభూతి నాకు. నేను ఈరోజు ఉదయం పవన్ కళ్యాణ్ గారిని ఎయిర్ పోర్ట్ లో కలిశాను. చాలా ప్రేమగా పలకరించారు. ఆయన సింప్లిసిటిని చూసి మనం చాలా నేర్చుకోవాలి. త్రివిక్రమ్ గారు నన్ను హీరోగా పెట్టి సినిమా చేస్తానని చెప్పిన మాటలు నాకు ఇప్పటికీ గుర్తు ఉన్నాయి. సినిమా అందరికి నచ్చుతుందని భావిస్తున్న. ఆగస్ట్ 15న ప్రేక్షకుల ముందుకు వస్తున్న మా సినిమా చూసి ఎంజాయ్ చెయ్యండి' అన్నారు.

ఈ చిత్రానికి మాటలు: అర్జున్ - కార్తీక్, సంగీతం : ప్రశాంత్ పిళ్ళై , ఛాయాగ్రహణం :దివాకర్ మణి, పాటలు: రామజోగయ్య శాస్త్రి, కృష్ణ చైతన్య,ఎడిటర్: నవీన్ నూలి, ప్రొడక్షన్ డిజైనర్: రవీందర్, పోరాటాలు:వెంకట్, నృత్యాలు: బృంద, శోభి,శేఖర్, ప్రొడక్షన్ కంట్రోలర్: సి.హెచ్. రామకృష్ణారెడ్డి.

English summary
Starring Sharwanand and Kalyani Priyadarshan in the lead roles, Ranarangam is gearing up for a worldwide release on August 15th. The trailer of the film was launched by Trivikram Srinivas today. Speaking at the event, Trivikram said that he got a distinctive vibe as soon as he saw the trailer of Ranarangam. I wish that the film turns out to be a good hit. The director Sudheer Varma put in a lot of hard work for the film. Sharwanand came up with a very good performance. Even the heroines performed really well, I hope, said Trivikram.
 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more