twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    దర్శకుడు శ్రవణ్‌కి గుండెపోటు కాదు… కరోనా వలన బ్రీత్ అందకే.. అసలు విషయం బయటపెట్టిన స్నేహితుడు!

    |

    తెలుగు సినిమా ఇండస్ట్రీని వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. ఈరోజు వరుణ్ సందేశ్ తో ప్రియుడు అనే సినిమాని తెరకెక్కించిన దర్శకుడు శ్రవణ్ మరణించారనే సంగతి వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆయన గుండెపోటుతో మరణించారు అనే విషయం వెలుగులోకి వచ్చింది. అయితే ఆయనకు ఎలా గుండెపోటు వచ్చింది ? ఎప్పుడు మరణించారు ? అనే విషయాలు మాత్రం వెలుగులోకి రాలేదు. ఈ అంశాల మీద కొన్ని వివరాలు వెల్లడయ్యాయి. ఆయన స్నేహితుడు యూట్యూబ్ యాంకర్, ఇప్పుడు కొన్ని సినిమాల్లో నటుడిగా కనిపిస్తున్న తుమ్మల నరసింహారెడ్డి ఈ వివరాలు వెల్లడించారు. ఆ వివరాల్లోకి వెళితే

     మొదటి సినిమా కలిసి రాకపోవడంతో

    మొదటి సినిమా కలిసి రాకపోవడంతో


    కెరీర్ మొదట్లో రచయిత, నటుడు ఎల్.బి.శ్రీరామ్ దగ్గర స్క్రిప్ట్ అసిస్టెంట్‌గా జీవితం ప్రారంభించిన శ్రవణ్ తర్వాతి కాలంలో కొందరు దర్శకుల దగ్గర అసోసియేట్ గా పని చేసి వరుణ్ సందేశ్ హీరోగా ప్రియుడు అనే సినిమా తెరకెక్కించారు. ఆ సినిమా అనుకున్నంత సక్సెస్ సాధించలేదు. దీంతో ఆయన దర్శకత్వం పక్కన పెట్టి కొన్ని సినిమాలకు కూడా కో డైరెక్టర్గా వ్యవహరిస్తున్నారు.

    ఆ రోజుల నుంచి స్నేహం

    ఆ రోజుల నుంచి స్నేహం

    అయితే తాజాగా ఆయన మరణానికి సంబంధించి ఒక నిజం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం యూట్యూబ్ యాంకర్ గా పని చేస్తూ కొన్ని సినిమాల్లో నటిస్తున్న తుమ్మల నాగేశ్వర రెడ్డి అలియాస్ టీఎన్ఆర్ శ్రవణ్ మరణానికి సంబంధించిన కొన్ని వివరాలు వెల్లడించారు. ఇండస్ట్రీలో తనకు ఉన్న అతి కొద్ది మంచి ఫ్రెండ్స్ లో శ్రవణ్ ఒకరు టీఎన్ఆర్ పేర్కొన్నారు. మా ఇద్దరి కెరిర్ కొంచెం అటూ ఇటుగా దాదాపు ఒకేసారి ప్రారంభమైందని, ఇద్దరం చాలా సంవత్సరాలు కలిసి ప్రయాణం చేశామని పేర్కొన్నారు. బ్యాచిలర్స్ గా ఉన్నప్పుడు ఇద్దరం ఒకే ఏరియాలో పక్క పక్క రూంలో ఉండేవాళ్ళమన్న ఆయన కలిసే వంట చేసుకునేవాళ్ళం అని పేర్కొన్నారు.

     కెరీర్ లో చాలా ఒడిదొడుకులు

    కెరీర్ లో చాలా ఒడిదొడుకులు

    నటుడు, రచయిత ఎల్.బి.శ్రీరామ్ దగ్గర ఇద్దరం స్క్రిప్ట్ అసిస్టెంట్స్ గా వర్క్ చేశామని ఆ తర్వాత ఆయన ఎం.ఎస్ రాజు మనసంతా నువ్వే ,వర్షం,నువ్వొస్తానంటే నేనొద్దంటానా,ఆట లాంటి చాలా సినిమాలకు అసోసియేట్ డైరెక్టర్ గా వర్క్ చేశాడని పేర్కొన్నారు. ఆ తర్వాత వరుణ్ సందేశ్ హీరోగా "ప్రియుడు" అనే సినిమాని డైరెక్ట్ చేశాడని, అయితే ఆ సినిమా అనుకున్నంత సక్సెస్ కాకపోవడం వలన కెరీర్ లో చాలా ఒడిదొడుకులను ఎదుర్కొన్నాడని ఆయన పేర్కొన్నారు.

    మళ్ళీ కో-డైరెక్టర్ గా బిజీ

    మళ్ళీ కో-డైరెక్టర్ గా బిజీ

    ఈ మధ్య చాలా సినిమాలకు మళ్ళీ కో-డైరెక్టర్ గా వర్క్ చేసూ బిజీగా ఉన్నాడని ఆయన అన్నారు. కో డైరెక్టర్ గా పనిచేసిన సినిమాలలో "బ్రోచేవారెవరురా" అనే సినిమా కూడా ఒకటి. ఈ సినిమాలో సరదాగా ఒక సీన్ లో కూడా కనిపిస్తాడని ఆ సీన్ తో సహా ఆయన వివరించారు. అయితే శ్రవణ్ నిన్న సాయంత్రమే కార్డియాక్ అరెస్ట్ తో చనిపోయాడని ఆయన వెల్లడించారు. కొన్ని రోజుల క్రితం కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్నారని, అయితే కోవిడ్ లక్షణాలు కనిపించడంతో టెస్ట్ చేయించుకుంటే పాజిటివ్ వచ్చిందని చెప్పుకొచ్చారు.

    Recommended Video

    Friday Movies App Launch Event Part 2
    బ్రీతింగ్ ప్రాబ్లం కారణంగా ఆక్సిజన్ కోసం వెళ్తుంటే

    బ్రీతింగ్ ప్రాబ్లం కారణంగా ఆక్సిజన్ కోసం వెళ్తుంటే

    కొద్దిగా బ్రీతింగ్ ప్రాబ్లం ఫేస్ చేస్తున్న క్రమంలో నిన్న సాయంత్రం ఆ బ్రీతింగ్ మరింత ఇబ్బంది కావడంతో అక్సీజన్ కోసం హాస్పిటల్ కి తరలిస్తుంటే మధ్యలో కార్డియాక్ అరెస్ట్ అయిందని పేర్కొన్నారు.. పానిక్ అవడం వల్లనే కార్డియాక్ అరెస్ట్ అయిందని భావిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. అయితే కరోనా కారణంగా మంచి మిత్రుడిని కోల్పోయానని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కోవిడ్ సమయంలో అస్సలు ప్యానిక్ అవద్దన్న ఆయన కేవలం భయం వల్ల ఎక్కువ శాతం కోవిడ్ మరణాలు సంభవిస్తున్నాయని అన్నారు.

    English summary
    Telugu Director shravan passed away recently. But his friend, Anchor TNR revealed the truth about director's demise.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X