»   » సినిమా వారికి బెదిరింపులు, టీఆర్ఎస్ నేతపై కేసు

సినిమా వారికి బెదిరింపులు, టీఆర్ఎస్ నేతపై కేసు

Posted By:
Subscribe to Filmibeat Telugu
Case filed against TRS leader Shravan
హైదరాబాద్: టిఆర్‌ఎస్ పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రవణ్ పై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయ్యింది. సినీ రంగానికి చెందిన సింహ తేజను బెదిరించారనే ఆరోపణపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. ఆయనపై నాలుగు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సింహతేజ 'చార్లి' చిత్రానికి సంబంధించిన వారని సమాచారం. చార్లి సినిమా విశేషాల్లోకి వెళితే....రేర్డన్ పిక్చర్స్ బ్యానర్‌పై సతీష్‌రెడ్డి నిర్మాతగా తెరకెక్కిన కామెడీ ఎంటర్‌టైనర్ "చార్లి". శివనాగరెడ్డి దర్శకుడు. సింహ, శ్రావ్యరెడ్డి, కార్తీక్, విష్ణు ముఖ్యపాత్రలు పోషించారు.

సినిమా గురించి నిర్మాత సతీష్‌రెడ్డి గతంలో ఓసారి మాట్లాడుతూముగ్గురు స్నేహితుల మధ్య ఓ రాత్రి జరిగే కథే ఈ సినిమా. అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో తెరకెక్కించారు. ఇందులో ఉన్న క్యారెక్టర్స్ నిజ జీవితంలో ఎవరో ఒకరికి కనెక్ట్ అవుతాయి. పాత్రల్ని దర్శకుడు తీర్చిదిద్దిన విధానం బావుందన్నారు.

యువతను, పిల్లలను అందరిని అలరించే కామెడీ, సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రమిది. థియెటర్‌కొచ్చిన ప్రతి ఒక్కరూ సినిమాని ఫుల్‌గా ఎంజాయ్ చేస్తారు. నిర్మాతగా నేను చేసిన తొలి ప్రయత్నం డెఫినెట్‌గా ప్రేక్షకాదరణ పొందుతుందనే నమ్మకం ఉంది అని తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: వరప్రసాద్, సంగీతం: రాజేష్.

English summary
Case filed against TRS leader Shravan in Jubilee Hills police station.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu