For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  TTD నా ఎదపై చేయివేసి నెట్టారు.. హీరోయిన్ అర్చన గౌతమ్ తిరుమల దర్శన వివాదం.. అధికారుల స్పందన ఏమిటంటే?

  |

  ఉత్తర ప్రదేశ్‌కు చెందిన సినీ నటి అర్చన గౌతమ్ తిరుమల దర్శన వివాదం సోషల్ మీడియాలోనే కాకుండా తెలుగు, ఉత్తరాది మీడియాలో సెన్సేషనల్‌గా మారింది. అక్టోబర్ 31వ తేదీన తిరుమలలో జరిగిన చేదు అనుభవాన్ని వివరిస్తూ.. సోషల్ మీడియాలో వీడియోను పోస్టు చేయడం సంచలనంగా మారింది. అయితే ఈ వీడియో వైరల్‌గా కూడా మారడంతో మీడియా కూడా ఈ వార్తను ప్రధాన వార్తగా ప్రసారం చేసింది. ఈ వివాదంపై టీటీటీ బోర్డు అధికారులు తాజాగా స్పందించడం ఇంకాస్త ప్రాధాన్యత సంతరించుకొన్నది. ఈ వివాదం వివరాల్లోకి వెళితే..

  యూపీ నటి తిరుమల దర్శనం కోసం

  యూపీ నటి తిరుమల దర్శనం కోసం

  నటి అర్చన గౌతమ్‌ తిరుమల దర్శనం కోసం తన కుటుంబ సభ్యులతో వచ్చారు. అయితే టికెట్ లభించకపోవడంతో స్థానిక అధికారులను ఆశ్రయించారు. అయితే తనకు కేటాయించిన టికెట్‌పై దర్శనం కోసం అనుమతించకపోవడంపై అధికారులను ఆమె నిలదీయగా వారి మధ్య గొడవ జరిగింది. తన ఎదపై చేయిపెట్టి నెట్టారు. ఇలా పుణ్యక్షేత్రంలో తనతో దారుణంగా ప్రవర్తించారంటూ వీడియోను పోస్టు చేసింది.

  30 నిమిషాలు ఆలస్యమైనందుకు

  30 నిమిషాలు ఆలస్యమైనందుకు


  అర్చన గౌతమ్ వీడియోను పోస్టు చేస్తూ.. నేను ఆంధ్ర ప్రదేశ్‌లోని తిరుమలలో ఉన్నారు. నాలుగు రోజుల క్రితం వస్తే.. దర్శనానికి అనుమతి లేదు. మూడు రోజుల తర్వాత ఉందని చెప్పారు. అయితే మంత్రి లేదా ఎమ్మెల్యేల సిఫారసు లెటర్ ఉంటే.. దర్శనం చేయిస్తామని చెప్పారు. నేను ఎమ్మెల్యే లెటర్ ఇచ్చాను. అయితే 12 గంటలకు దర్శన సమయం ఉంటే.. నేను 30 నిమిషాలు లేటుగా వస్తే.. దర్శనం లేదని చెప్పారు. అయితే నేను దూరం నుంచి వచ్చాను. దర్శనానికి అనుమతించమని అడిగితే నన్ను నెట్టి వేశారు అని అన్నారు.

  10 వేలు ఇస్తే దర్శనం అని..


  అర్చన్ గౌతమ్ అధికారులపై ఆరోపణలు చేస్తూ.. దర్శనం కావాలంటే.. 10 వేలు చెల్లించమని అడిగారు. అయితే తనతో 5 గురు ఉన్నారు. వారందరికి 50 వేలు చెల్లించుకోలేనన చెప్పాను. కానీ వారు నా మాటలు వినకుండా నా ఛాతీపై చేయి వేసి నెట్టారు. భగవంతుడి పేరుతో అక్రమాలు చేస్తున్నారు. అవినీతికి పాల్పడుతున్నారు. పైగా దాడి కూడా చేశారు. ఒక అమ్మాయి ఛాతిపై చేయివేసే అధికారం ఎవరు ఇచ్చారు. ఇలాంటి వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఏపీ ప్రభుత్వానికి విన్నవించుకొన్నారు. తనపై దాడి చేసిన సమయానికి సంబంధించిన వీడియోను రిలీజ్ చేయాలని కోరారు.

  టీటీడీ అధికారుల వివరణ ఏమిటంటే?

  టీటీడీ అధికారుల వివరణ ఏమిటంటే?


  అయితే అర్చన గౌతమ్ ఆరోపణలపై టీటీడి అధికారులు స్పందించారు. యూపీకి చెందిన శివకాంత్ తివారీతోపాటు అర్చన గౌతమ్ మరో ఏడుగురు దర్శనం కోసం తిరుమల వచ్చారు. ఆగస్టు 30న కేంద్ర మంత్రి సిఫారసు లెటర్‌తో దర్శనం కోసం టీటీడీ ఈవోకు దరఖాస్తు చేసుకొన్నారు. దాంతో వారికి 300 రూపాయల టికెట్ కేటాయించి.. ఆ సమాచారాన్ని ఎస్సెమ్మెస్ ద్వారా పంపారు. అయితే వారు సకాలంలో దర్శనానికి రాలేదు. ఆ తర్వాత రోజు వస్తే.. టికెట్స్ ఎక్స్‌పైర్ అయ్యాయని చెప్పాం. దాంతో వారు టీటీడీ సిబ్బందితో గొడవకు దిగారు అని నిర్వాహకులు చెప్పారు.

   తప్పుడు కేసు పెట్టి.. సిబ్బంది ఆగ్రహం

  తప్పుడు కేసు పెట్టి.. సిబ్బంది ఆగ్రహం


  టీటీడీ సిబ్బందితో గొడవ తర్వాత టూ టౌన్ పోలీసులకు తప్పుడు ఫిర్యాదు చేశారు. తనను దూషించారని, తనతో అసభ్యంగా ప్రవర్తించారు అని ఫిర్యాదులు పేర్కొన్నారు. ఆ తర్వాత సీఐ వీడియో ఫుటేజ్‌ను పరిశీలించారు. ఆమె సిబ్బందిపై దురుసుగా ప్రవర్తించారు. ఆమె దుర్బాషలాడరనే విషయం స్పష్టమైంది. ఆమెకు వీడియోలు చూపించిన తర్వాత అక్కడి నుంచి మాట్లాడకుండా వెళ్లిపోయారు. దర్శనం కోసం 10 వేలు అడిగారని ఆరోపణలు చేశారు. కానీ మేము శ్రీవాణి దర్శనం కోసం 10500 చెల్లించాలని కోరాం అని టీటీటీ అధికారులు వివరణ ఇచ్చారు.

  English summary
  TTD Officials clarity on Actress Archana Gautam allegations over Balaji Darshan Contraversy. Out of all the temples in India, the gangs who are sitting in the name of VIPs, they are charging an amount like 10500 of one man, all of them should be removed. There should be normal philosophy for everyone. I had gone to Tirupati Bala ji, even though I had a ticket, they did not let me in and asked for 52500 and agreed to agree, then a man pushed me and picked me up and threw me out of the room, TTD employees sitting in Balaji, So I request to Andra government. Take out the CCTV footage of Afternoon on 31st Aug at 2:32 pm and watch.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X