Don't Miss!
- News
ఏప్రిల్‌లో వైజాగ్ వెళ్లిపోతున్నాం.. ఇప్పుడేం వద్దు..! విద్యాశాఖాధికారులకు బొత్స కీలక సంకేతం !
- Finance
బంగారం కొనుగోలు చెయ్యాలని చూస్తున్నారా? అయితే లేటెస్ట్ ధరలు తెలుసుకున్నాక నిర్ణయించుకోండి!!
- Automobiles
హైవేపై అందంగా రీల్ చేసిన చిన్నది: కట్ చేస్తే రూ. 17,000 ఫైన్.. కారణం మాత్రం ఇదే
- Sports
India Playing XI: పృథ్వీ షా రీ ఎంట్రీ.. న్యూజిలాండ్‌తో తొలి టీ20 ఆడే భారత తుది జట్టు ఇదే!
- Lifestyle
ఈ అలవాట్లు సంబంధంలో ప్రేమను బలోపేతం చేస్తాయి
- Technology
Infinix కొత్త స్మార్ట్ ఫోన్ ఇండియాలో లాంచ్ అయింది! లాంచ్ ఆఫర్ ధర చూడండి!
- Travel
భాగ్యనగరపు పర్యాటక ఆకర్షణ.. గోల్కొండ కోట!
డైరెక్టర్ల మధ్య వార్.. అందరి దగ్గర ఏడవకన్న హరీష్.. సంస్కారం గురించి నువ్వా మాట్లాడేదన్న మచ్చ రవి!
టాలీవుడ్ ప్రముఖ దర్శకుల మధ్య జరుగుతున్న ట్విట్టర్ లో జరుగుతున్నా వార్ నెట్టింట్లో హాట్ టాపిక్ గా మారింది. సోషల్ మీడియా వేదికగా ఒకరి మాటల మీద ఒకరు విమర్శనాస్త్రాలు సంధించుకుంటున్నారు. నీ నోటి వెంట సంస్కారం అనేది కొత్తగా ఉందని ఒకరు అంటే పిరికితనం అంటూ మరొకరు కౌంటర్ వేస్తున్నారు. ఆ దర్శకులు ఎవరు? వారి మధ్య ఏం జరిగింది? అనే వివరాల్లోకి వెళితే
Recommended Video

పబ్లిక్‌గా గొడవలకు
టాలీవుడ్‌లోని దర్శకుల మధ్య ఎన్ని గొడవలు ఉన్నా ఎప్పుడూ పబ్లిక్‌గా గొడవలకు దిగరు. ఎన్ని విభేదాలు వచ్చినా తమ తమ సర్కిల్స్ లోనే సాల్వ్ చేసుకుంటారు కానీ బహిరంగ వేదికపై మాటలు అనేసుకోరు. కానీ ఏమయిందో ఏమో కానీ తాజాగా దర్శకుడు బీవీఎస్ రవి, దర్శకుడు హరీష్ శంకర్ ల ట్విట్టర్ వార్ చూస్తుంటే వారి మధ్య ఏదో తేడా జరిగిందని ఇట్టే అర్థమవుతుంది. గత రాత్రి దర్శకుడు, రచయిత బీవీఎస్ రవి ఒక ట్వీట్ చేశారు.. "అనుభవించమని ఇచ్చిన అధికారాన్ని ప్రదర్శించడం మొదలెడితే ప్రజలు పతనం పరిచయం చేస్తారని తరతరాల ప్రజాస్వామ్య చరిత్ర చెబుతోంది" అని రవి ట్వీట్ చేశారు. ఇది ఇది ఎవరి గురించి అనేది క్లారిటీ లేదు కానీ ప్రస్తుతం ఏపీలో ప్రభుత్వ ఉద్యోగుల నిరసన కార్యక్రమాలు చేస్తున్న క్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఉద్దేశించి చేసినట్టుగా అనిపిస్తుంది. అయితే ఈ ట్వీట్ ఇద్దరి మధ్య రచ్చకు ఆజ్యం పోస్యింది. రవి చేసిన ఈ ట్వీట్ కు హరీష్ శంకర్ వెంటనే స్పందిస్తూ "అనుభవించమని ఇచ్చారా ??" అని ప్రశ్నించాడు. అలా గురువారం స్టార్ట్ అయిన ఈ వివాదం ఇప్పటికీ కొనసాగుతోంది.

ఉనికి కోసం పోరాడడమే
హరీష్ శంకర్ ట్వీట్ కు దయచేసి సెటైర్ ను ఆస్వాదించడానికి ప్రయత్నించండి. అంటూ బీవీఎస్ రవి కౌంటర్ ఇచ్చారు. మీరు అద్ది సెటైర్ అని వివరించాల్సినపుడు దాన్ని సెటైర్ అని అనరు గెట్‌వెల్‌సూన్ అని హరీష్ శంకర్ పేర్కొన్నారు. దానికి ఇతరుల స్టేట్‌మెంట్‌లపై మనం స్టేట్‌మెంట్‌లు ఇవ్వడం కొన్ని సమయాల్లో ఉనికి కోసం పోరాడడమే అంటూ పేర్కొన్నారు. అంతేకాక అంతా మంచి జరుగుగాక. సోషల్ మీడియా ప్రజాస్వామ్యంలో ప్రయాణం కొనసాగించండి అని బీవీఎస్ రవి పేర్కొన్నారు. అయితే దీనికి మనం వాట్సాప్ లో మాట్లాడుకుందాం అని బీవీఎస్ రవి పేర్కొన్నట్టు ఉన్నారు, ఆ తర్వాత ఆయన ట్వీట్ డిలీట్ చేశారు.

అందరి దగ్గర ఏడవకు
దానికి హరీష్ శంకర్ ఈ మేటర్ లో నాకు వాట్సాప్ అక్కర్లేదు బావా పది మందిలో కూడా సంస్కారవంతంగా మాట్లాడటం "నాకు" వచ్చు .. అయితే నేను చెప్పినట్టు మీరు UNSTOPPABLE ప్లీజ్ కంటిన్యూ అని పేర్కొన్నారు. దానికి బీవీఎస్ రవి సంస్కారం గురించి నువ్వు మాట్లాడటం చాలా సంతోషంగా ఉంది. బహుశా మొదటి సారి అనుకుంటా కదా అని కౌంటర్ ఇచ్చాడు. అంతేగా ఉన్న దాని గురించి ఎక్కువ మాట్లాడను లేని వాళ్ళ దగ్గర చెప్పడానికి తాడనాడను ...గుడ్ గోయింగ్ బావా ప్లీస్ కంటిన్యూ ..... నా వీకెండ్ సరదాగా గడుపుతున్నాను .. కానీ నా తీరిక సమయంలో మాత్రమే సమాధానం ఇస్తాను ; రిప్లై లేట్ అయితే అయ్యి మళ్ళీ వాట్సాప్ లో అందరి దగ్గర ఏడవకు అని హరీష్ శంకర్ కౌంటర్ ఇచ్చారు.

చవక బారుతనం
దానికి ఏడవడానికి కూడా ఎవడు లేని ఒంటరి తనం ఉంటెనే సోషల్ మీడియా అరుగు మీద కూర్చుని యెడవలేక నవ్వుకునే వాళ్ళని చూస్తే నవ్వొస్తుంది. ఇట్లు భవదీయుడు బీవీఎస్ రవి అని పేర్కొన్నారు. ట్వీట్లు డిలీట్ చెసే పిరికితనం కన్నా ఒంటరితనం బెటర్ ఏమో కదా బావా !!! ఓహ్ మై గాడ్ ఏది ఏమైనా నీతో నా ఫ్లో సూపర్ బావా.. నీ నెక్స్ట్ ట్వీట్ కోసం వెయిటింగ్ డూ ఇట్ అని మరో కౌంటర్ ఇచ్చారు. సరిచేసుకోవడం పిరికితనం అయితే సాగ తీసుకోవడం చవక బారుతనం. సూపర్ కదా పంచ్. నీతో అదే సౌకర్యం. నీ మొహం చూస్తే పంచ్ పడిపోతుంది. భవదీయుడు భగత్ సింగ్ షూట్ లో కలుద్దాం పర్మిషన్ ఇస్తే అని పేర్కొన్నారు. ఇందాకే ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఫస్ట్ మాటే హైలైట్. వాడికెలాగో అంటూ దాన్ని సాగదీశారు

భవదీయుడు భగత్ సింగ్
అనుభవించడంలో
ఒక
భాగం
పరిపాలన,ఇంకొంచమే
భాగం
ప్రజా
సేవ.
ఎవరు
వచ్చినా
చేసేది
అనుభవించడమే.
ఎవరైతే
నా
ట్వీట్
ను
చేసుకున్నారో
వారికోసమే
అని
చెబుతూ
ఇది
విశాఖదత్తుడు
విరచిత
"ముద్రారాక్షసమ్"
లో
చంద్రగుప్తుడికి
చాణక్య
చెప్పింది
అని
చెప్పుకొచ్చారు.
ఇక
బీవీఎస్
రవి
ఇటీవలే
బాలకృష్ణ
హోస్ట్
గా
వచ్చిన
అన్
స్టాపబుల్
విత్
ఎన్బీకే
షోకి
రచయితగా
పనిచేసి
మంచి
హిట్
అందుకున్నారు.
ఇక
మరో
పక్క
హరీష్
శంకర్
పవన్
కళ్యాణ్
హీరోగా
భవదీయుడు
భగత్
సింగ్
సినిమా
చేస్తున్నారు.
ప్రస్తుతం
షూటింగ్
దశలో
ఉన్న
సినిమాలు
పూర్తయిన
తరువాత
ఈ
సినిమా
షూటింగ్
మొదలు
పెట్టె
అవకాశం
కనిపిస్తోంది.