Just In
- 3 min ago
జానీ మాస్టర్ వల్లే .. ఆ విషయంలో చాలా కష్టపడ్డా.. అనసూయ కామెంట్స్
- 14 min ago
బాలీవుడ్ సినిమా కోసం.. మరో అగ్ర హీరోను కలిసిన సాహో డైరెక్టర్.. ఏం జరుగుతోంది?
- 1 hr ago
ముగిసిన కపటధారి పోరాటం: సుమంత్ కెరీర్ మొత్తంలోనే ఊహించని కలెక్షన్స్..!
- 1 hr ago
నెటిజన్ ప్రశ్నకు సరైన రిప్లై.. బాయ్ ఫ్రెండ్ పేరు బయటపెట్టేసిన ఇలియానా
Don't Miss!
- News
తేయాకు కార్మికురాలిగా .. అసోం ఎన్నికల ప్రచారంలో టీ ఎస్టేట్ లో ప్రియాంకా గాంధీ సందడి
- Finance
పెట్రోల్, డీజిల్, గ్యాస్ తర్వాత ఢిల్లీలో ఆ ధరలు షాకిచ్చాయి
- Sports
పొట్టకూటి కోసం డ్రైవర్‌గా మారిన సీఎస్కే మాజీ స్పిన్నర్!
- Automobiles
గుడ్ న్యూస్.. అతి తక్కువ ధరకే కొత్త బజాజ్ ప్లాటినా 100 ఎలక్ట్రిక్ స్టార్ట్ బైక్
- Lifestyle
అతను 30 ఏళ్లుగా వధువు దుస్తుల్లోనే... కారణం తెలిస్తే షాకవుతారు...!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
'ఉదయ్ కిరణ్' ఇండస్ట్రీ హిట్‌కు సీక్వెల్.. 20ఏళ్ళ తరువాత మళ్ళీ అదే కాంబోలో న్యూ మూవీ!
టాలీవుడ్ ఇండస్ట్రీలో క్యూట్ లవర్ బాయ్ గా మొదటి సినిమాతోనే ఒక మంచి పాజిటివ్ ఇంప్రెషన్ ని అందుకున్న హీరోల్లో ఉదయ్ కిరణ్ ఒకడు. అన్ని వర్గాల ఆడియెన్స్ అతన్ని ఇష్టపడేవారు. ఉదయ్ కిరణ్ మరణించి ఏళ్ళు గడుస్తున్నా జనాలు ఇంకా ఆ హీరోను మర్చిపోలేదు. ఇక చాలా రోజుల తరువాత ఉదయ్ కిరణ్ కు సంబంధించిన ఒక సినిమాకు సీక్వెల్ ను ప్రకటించడం హాట్ టాపిక్ గా మారింది. దర్శకుడు తేజ పుట్టినరోజు సందర్భంగా ఈ అప్డేట్ ఇచ్చారు.

మొదటి సినిమతోనే భారీ క్రేజ్
2000వ సంవత్సరంలో తేజ డైరెక్షన్ లో వచ్చిన మొదట సినిమా 'చిత్రం'. ఈ సినిమా ద్వారానే తెలుగు ప్రేక్షకులకు ఒక మంచి హీరోగా ఉదయ్ కిరణ్ పరిచయమయ్యాడు. కొన్నాళ్లకే స్టార్ హీరోల రేంజ్ లో గుర్తింపు దక్కించుకున్నాడు. నువ్వు నేను - మనసంతా నువ్వే వంటి సినిమాలు ఉదయ్ స్థాయిని ఒక్కసారిగా పెంచేశాయి. యూత్ లోనే కాకుండా ఫ్యామిలీ ఆడియెన్స్ లో కూడా ఉదయ్ కి మంచి క్రేజ్ ఏర్పడింది.

హీరో అవ్వాలని అనుకోలేదట
గ్యాప్ లేకుండా మొదట్లో బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ తో తన క్రేజ్ ని పెంచుకున్న ఈ లవర్ బాయ్ కొన్నాళ్ళ తరువాత పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల చాలానే ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. అసలు ఉదయ్ హీరోగా అవ్వాలని ఇండస్ట్రీకి రాలేదట. ఒక యాక్టర్ గా కొనసాగాలని మాత్రమే ప్రయత్నాలు చేశాడని ఒక ఇంటర్వ్యూలో దర్శకుడు తేజ చెప్పాడు. చిత్రం సినిమాలో మొదట హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ అనుకోగా ఆ తరువాత అనుకోకుండా మెయిన్ లీడ్ లో నటించే ఛాన్స్ వచ్చింది.

2014లో విషాదం..
అనుకోకుండా ఎదురైన పరాజయాలు ఉదయ్ కిరణ్ జీవితాన్ని ఉహీంచని విధంగా బాధకు గురి చేశాయి. అయితే 2014లో హైదరాబాద్ లోని తన ఫ్లాట్ లోనే సూసైడ్ చేసుకోవడం అందరిని షాక్ కి గురి చేసింది. అప్పట్లో ఈ విషాదం అభిమానులతో పాటు సినిమా ఇండస్ట్రీని కూడా ఎంతో బాధకు గురి చేసింది.

20 ఏళ్ళ తరువాత హిట్టు సినిమాకు సీక్వెల్
ఇక ఉదయ్ కిరణ్ నటించిన మొదటి సినిమా చిత్రంకు కొనసాగింపుగా మరో కథను దర్శకుడు తేజ రెడీ చేసుకున్నారట. చిత్రం 1.1 అనే టైటిల్ తో సినిమాను తెరకెక్కిస్తున్నట్లు అఫీషియల్ పోస్టర్ తో క్లారిటీ ఇచ్చేశారు. 20ఏళ్ళ క్రితం అందమైన లవ్ స్టోరీతో బాక్సాఫీస్ హిట్ కొట్టి ట్రెండ్ సెట్ చేసిన తేజ ఈ సినిమాతో ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

అదే కాంబినేషన్ లో..
20 ఏళ్ళ క్రితం వచ్చిన చిత్రం సినిమాలో ఉదయ్ కిరణ్, రీమా సేన్ నటించగా ఇప్పుడు రానున్న చిత్రంలో కొత్త నటీనటులు కనిపిస్తారట. ఇక దర్శకుడు తేజ - ఆర్ పీ.పట్నాయక్ కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు అప్పట్లో మ్యూజికల్ హిట్స్ గా నిలిచాయి. ఇక చాలా కాలం తరువాత చిత్రం 1.1తో మరోసారి ఈ కాంబోలో మూవీ రాబోతోంది కాబట్టి మ్యూజిక్ పై అంచనాల డోస్ పెరుగుతాయని చెప్పవచ్చు.