For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Urvashi sharada చనిపోయారంటూ ప్రచారం.. పనిపాటలేకుండా ఆ వెధవ చేసిందే ఇది !

  |

  నిజం నోరు దాటే లోపు అబద్దం ఊరు చుట్టూ వస్తుంది అని పెద్దలు ఉరికే అనలేదు ఈ మధ్య కాలంలో ఫేక్ న్యూస్ కు లభిస్తున్న ఆదరణ నిజమైన వార్తలకు లభించడం లేదన్న విషయం దాదాపు అందరికీ తెలిసిన సంగతే. అదీగాక ఈ మధ్య సీనియర్ నటీనటులు చనిపోయారంటూ అనూహ్యంగా వార్తలు వెలుగులోకి వస్తున్నాయి. తీరా అక్కడ చూస్తే పరిస్థితి వేరుగా ఉంటుంది. ఇప్పటికే చాలాసార్లు నటీనటులు తమ ఇంకా బతికే ఉన్నామని మీడియాకి స్టేట్మెంట్లు ఇచ్చుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి.

  తాజాగా సీనియర్ నటి ఊర్వశి శారదకు కూడా అలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి. దక్షిణాదిన దాదాపు అన్ని భాషల్లో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న ఊర్వశి శారద కొద్దిసేపటి క్రితం చనిపోయారని సోషల్ మీడియాలో వార్తలు ఒక్కసారిగా వైరల్ అయ్యాయి.

  అసలు ఎలా చనిపోయారు ? ఎప్పుడు చనిపోయారు అనే విషయం బయటకు రాకుండా ఆమె చనిపోయారంటూ ఆమెకు సంతాపం తెలియజేస్తూ కొందరు సోషల్ మీడియా యూజర్స్ వరుసగా మెసేజ్ లు పెట్టడం ఒక్కసారిగా కలకలం రేపింది. అసలు ఆమె ఏమైంది ? నిజంగానే ఆమె మరణించారా అని తెలుసుకునే ప్రయత్నం చేయగా అసలు విషయం తెలుసుకున్న ఆమె దీనిని ఖండిస్తూ ఒక ప్రెస్ స్టేట్మెంట్ రిలీజ్ చేశారు.

  urvashi Sharada responds on Death Rumours

  'తాను ప్రశాంతంగా, ఆనందంగా, ఆరోగ్యంగా ఉన్నాను అని ఆమె వెల్లడించారు. ప్రస్తుతం చెన్నైలో ఉన్న తన నివాసంలో ఉన్నానని తన గురించి తన ఆరోగ్యం గురించి వస్తున్న వార్తలు అన్నీ తప్పుడు వార్తలు అని ఆమె పేర్కొన్నారు. అంతేగాక ఈ మేరకు ఆమె ప్రెస్ స్టేట్మెంట్ ప్రెస్ కి విడుదల చేశారు. ఎవరో వెధవ చేసిన పనికి కొన్ని వేల సంఖ్యలో ఫోన్ కాల్స్ తనకు వస్తున్నాయని ఆమె వెల్లడించారు.

  మధ్యాహ్నం నుంచి వేల సంఖ్యలో ఫోన్లు వస్తూనే ఉన్నాయని ఆమె వెల్లడించారు. అయితే తన అభిమానులు అందరూ కంగారు పడాల్సిన పని లేదని తాను చాలా ఆరోగ్యంగా ఉన్నానని ఆమె చెప్పుకొచ్చారు. ఎవరో పని లేని వారు ఇలా పుకార్లు పుట్టిస్తున్నారు అని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వార్తలను నమ్మవద్దని ఆమె కోరారు. దీంతో జరుగుతున్న ఆమె మరణం గురించిన ప్రచారానికి బ్రేకులు వేసినట్లయింది.

  అయితే అంతకుముందు కూడా కన్నడ నటి ఎల్వీ శారద చనిపోతే ఊర్వశి శారద చనిపోయిందని అప్పట్లో ప్రచారం జరిగింది. అప్పుడు కూడా ఆమె దీనికి సంబంధించిన క్లారిటీ ఇచ్చుకోవాల్సి వచ్చింది.. ఇక గుంటూరు జిల్లా తెనాలిలో జన్మించిన శారద అసలు పేరు సరస్వతి. కాగా సినిమాల్లోకి వచ్చాక శారద గా మార్చుకున్నారు. తండ్రి వ్యాపార రీత్యా మద్రాసు వెళ్లగా అక్కడ శారదకు నాటకాల్లో అవకాశాలు లభించాయి. అలా నాటకాల్లో బాలనటిగా ప్రవేశించిన ఆమె కొన్నాళ్ళపాటు నాటకాల్లోని హాస్యనటిగా మంచి పేరు సంపాదించారు..

  అయితే అటు తెలుగు వ్యక్తిని కాక ఇటు తమిళ వ్యక్తిని కాక అనూహ్యంగా ఒక మలయాళిని పెళ్లి చేసుకోవడంతో ఆమె కేరళ వెళ్లారు. అక్కడ ఆమెకు మలయాళ సినిమాల్లో అవకాశాలు దక్కాయి.. అలా మలయాళంలో ఆమె నటించిన సినిమా కు జాతీయ అవార్డు కూడా లభించింది అంటే ఆమె నటనా కౌశలం మీరు అర్థం చేసుకోవచ్చు. ఇక నెమ్మదిగా ఆమె దక్షిణాదిలో అన్ని భాషలలో నటిగా బిజీ అయ్యారు. అవకాశాలు తగ్గాయి అనుకున్న తర్వాత తెలుగుదేశం ద్వారా రాజకీయ రంగప్రవేశం చేసి ఎంపీగా కూడా ఎన్నికయ్యారు. తర్వాత రాజకీయాల్లో కూడా ఆమె కెరీర్ డౌన్ అవడంతో ఆమె కొంతకాలంగా ఇంటికే పరిమితమయ్యారు.

  English summary
  News on social media that Urvashi Sarada had died a short while ago went viral. Upon learning of the matter she released a press statement condemning it.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X