twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వకీల్ సాబ్ విషయంలో బాధపడుతున్నా.. మ్యూజిక్ డైరెక్టర్ కాకపోయి ఉంటే..: థమన్ హలో ముచ్చట్లు

    |

    సంగీత దర్శకుడు థమన్ ప్రస్తుతం టాలీవుడ్ లో మంచి ఊపు మీద ఉన్నాడు. ఎవరికి ఛాన్స్ ఇవ్వకుండా తనదైన శైలిలో మ్యూజిక్ అందిస్తూ కేవలం తన పాటలు మాత్రమే వైరల్ అయ్యేలా డామినేట్ చేస్తున్నాడు. రీసెంట్ గా హలో యాప్ కి ఇచ్చిన లైవ్ ఇంటర్వ్యూలో థమన్ తన జీవితంలోని కొన్ని ముఖ్యమైన విషయాల గురించి వివరించాడు. ఒకవేళ మ్యూజిక్ డైరెక్టర్ కాకపోయి ఉంటే తాను క్రికెటర్ అయ్యే వాడినని తెలిపారు. తమన్ మాట్లాడుతూ..

    వకీల్ సాబ్ కోసం వెయిటింగ్..

    వకీల్ సాబ్ కోసం వెయిటింగ్..

    పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి నేను కూడా అభిమానినే. ఆయన సినిమా కోసం సంధ్య థియేటర్స్ లో చొక్కాలు చింపుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. సినిమాకు ఎంతో ఇష్టంతో వర్క్ చేశాను. ఆయన ఇప్పుడు ఒక స్థాయిలో ఉన్నారు కాబట్టి.. ఒకవైపు క్రేజ్..మరో వైపు ఆయన గౌరవానికి భంగం కలగకుండా మ్యూజిక్ చేయాలని అనుకోని వర్క్ చేశాను. సినిమా రిలీజ్ కోసం అందరికంటే ఎక్కువగా నేనే వెయిట్ చేస్తున్నాను. ఆ సినిమా ఆలస్యం అవుతున్నందుకు కాస్త బాధగానే ఉంది.

    అల..వైకుంఠపురములో.. వాట్సాప్ గ్రూప్..

    అల..వైకుంఠపురములో.. వాట్సాప్ గ్రూప్..

    అల..వైకుంఠపురములో.. సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ కోసం గత ఏడాది ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేశాము. ఇప్పటికి ఇంకా ఆ గ్రూప్ కొనసాగుతూనే ఉంది. అందులో అల్లు అర్జున్, త్రివిక్రమ్ గారు అలాగే ఇతర టెక్నీషియన్స్ కూడా ఉన్నారు. డేవిడ్ వార్నర్ డ్యాన్స్ చేశారు అనగానే గ్రూప్ లో అందరూ నన్ను పొగడ్తలతో ముంచెత్తారు.

     బన్నీ గారి వల్లే..

    బన్నీ గారి వల్లే..

    ఒక సాంగ్ హిట్ అవ్వడానికి చాలా రకాల కారణాలు ఉంటాయి. అయితే అల..వైకుంఠపురములో బుట్ట బొమ్మ సాంగ్ దేశాన్ని దాటి వెళ్లడం అంటే ఆ క్రెడిట్ అల్లు అర్జున్ గారికే చెందుతుంది. ఆయన స్టైలిష్ డ్యాన్స్ తో పాటకు మరింత క్రేజ్ పెంచారు. బన్నీ డ్యాన్స్ స్కిల్స్ కి ఎవరైనా ఫిదా కావాల్సిందే. అల..వైకుంఠపురములో ఆడియో ఇంత పెద్ద హిట్ కావడానికి మూల కారణం అల్లు అర్జున్ అని నమ్మకంగా చెప్పగలను.

    Recommended Video

    Amazon Prime : Seven Movies To Release Directly On Amazon Prime Video
    క్రికెట్ అంటే పిచ్చి..

    క్రికెట్ అంటే పిచ్చి..

    ఒకవేళ నేను మ్యూజిక్ డైరెక్టర్ కాకపోయి ఉంటే తప్పకుండా క్రికెటర్ అయ్యేవాడ్ని. ఇంటర్నేషనల్ లెవెల్లో కాకపోయినా కూడా స్టేట్ లెవెల్లో అయినా ఆడేవాడిని. మ్యూజిక్ నా బ్లడ్ లో ఉన్నప్పటికీ క్రికెట్ అంటే నాకు చాలా పిచ్చి. శని, ఆదివారాల్లో పనులన్నీ పక్కనపెట్టి చెన్నైలోకి వెళ్లి క్రికెట్ అడతాను. అక్కడే కొంతమంది సింగర్స్ అలాగే తెలిసిన సినీ యాక్టర్స్ తో క్రికెట్ ఆడతానని థమన్ వివరణ ఇచ్చాడు.

    English summary
    Music director Thaman is currently on a good swing in Tollywood. He gives his own style of music without giving anyone a chance to make his songs go viral. In a live interview with Hello App, Thaman explained some important things in his life. If not a music director, he said he used to be a cricketer. Taman said ..
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X