షూటింగ్‌కు సిద్ధమైన మహేశ్ డైరెక్టర్: ఆ తరహా కథతో ప్రయోగం చేయబోతున్నాడు

తెలుగు సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం ఉన్న స్టార్ డైరెక్టర్లలో వంశీ పైడిపల్లి ఒకరు. యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ చేసిన 'మున్నా' అనే సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీకి దర్శకుడిగా పరిచయం అయిన ఆయన.. ఆ వెంటనే స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ 'బృందావనం' అనే సినిమా చేశాడు. ఇది సూపర్ డూపర్ హిట్ అవడంతో ఈ డైరెక్టర్ బిజీ అయిపోయాడు. ఈ క్రమంలోనే రామ్ చరణ్‌తో 'ఎవడు', నాగార్జున - కార్తీ కాంబినేషన్‌లో 'ఊపిరి' అనే సినిమాలను తెరకెక్కించాడు. ఇక, ఈ మధ్య సూపర్ స్టార్ మహేశ్ బాబు 'మహర్షి' తీసి మరో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు.

'మహర్షి' వచ్చి రెండేళ్లు కావొస్తున్నా.. వంశీ పైడిపల్లి తన కొత్త సినిమాను మాత్రం ప్రకటించలేదు. ఆ మధ్య మహేశ్ బాబుతో ప్రాజెక్టు ఉంటుందని ప్రకటించినా.. అది కార్యరూపం దాల్చలేదు. ఈ క్రమంలోనే టాలీవుడ్‌లోని పలువురు స్టార్ హీరోలతో సంప్రదింపులు జరిపిన ఈ డైరెక్టర్.. సినిమాను మాత్రం ప్రారంభించలేకపోయాడు. ఇలాంటి పరిస్థితుల్లో 'సర్కారు వారి పాట' తర్వాత మహేశ్ బాబుతోనే తన తదుపరి సినిమాను చేయబోతున్నాడని జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే, ఈ గ్యాప్‌లో ఓ వెబ్ సిరీస్‌ను తెరకెక్కించబోతున్నాడు ఈ స్టార్ డైరెక్టర్.

Vamshi Paidipally Web Series Starts From Next Week

బడా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ఏర్పాటు చేసిన 'ఆహా' కోసం వంశీ పైడిపల్లి ఓ వెబ్ సిరీస్‌ను రూపొందిస్తున్నట్లు ఇది వరకే ప్రకటించాడు. అందుకు అనుగుణంగానే వచ్చే వారం నుంచి దీన్ని పట్టాలెక్కించబోతున్నాడట ఈ డైరెక్టర్. హైదరాబాద్‌లోని సారథి స్టూడియోలో ఈ సిరీస్ షూటింగ్ జరగనుందని తాజాగా ఓ న్యూస్ ఫిలిం నగర్ ఏరియాలో చక్కర్లు కొడుతోంది. ఇదిలా ఉండగా, ఈ వెబ్ సిరీస్‌ను మాఫియా బ్యాగ్‌డ్రాప్‌లో తెరకెక్కించబోతున్నాడని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X