For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Vanitha vijaya kumar : 'ఎన్టీఆర్​తో షాట్‌ చాలు.. నాలుగో పెళ్లి కూడా, ఆరోజునే పాము వల్ల పోయినా పర్లేదన్నారు!

  |

  ప్రముఖ నటి మంజుల, ప్రముఖ నటుడు విజయ్ కుమార్ దంపతుల కుమార్తెలలో ఒకరైన వనిత విజయ్ కుమార్ దేవి సినిమాతో హీరోయిన్ గా సినీరంగ ప్రవేశం చేసింది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే దేవి సినిమా సూపర్ హిట్ అయినా కూడా ఆమె ఆ తర్వాత మరే తెలుగు సినిమాలో కనిపించలేదు. ఒక్క సినిమాతోనే ఆమె తెలుగు సినిమాలు ఆపేయడం ఆ తర్వాత తమిళ సినీ రంగంలో ప్రవేశించడం వెంట వెంటనే జరిగిపోయాయి. తాజాగా అలీతో సరదాగా ప్రోగ్రాం కి హాజరైన వనిత విజయ్ కుమార్ తన జీవితం గురించి, తన నట జీవితం గురించి అలాగే తల్లిదండ్రుల గురించి ఆసక్తికర అంశాలు పంచుకున్నారు. ఆ విషయాలు ఏమిటో తెలుసుకుందాం.

  Tollywood Super Stars 24 గంటల్లో అత్యధిక వ్యూస్ అందుకున్న టాలీవుడ్ టాప్ టీజర్స్

  నాలుగు కాదు నలభై

  నాలుగు కాదు నలభై

  వనిత విజయ్ కుమార్ కు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఆ తరం వారికి ఆమె దేవి సినిమాలతో పరిచయం అయితే ఈ తరం వారికి మాత్రం మూడు పెళ్లిళ్లు చేసుకుని నాలుగో పెళ్లికి సిద్ధం అంటూ ప్రకటన చేసి వివాదాలతో దగ్గరయింది. గతంలో రెండు పెళ్లిళ్లు చేసుకుని ఆ రెండు పెళ్లిళ్లు విడాకులు తీసుకున్న వనితా విజయ్ కుమార్ ఆ మధ్య పీటర్ అనే వ్యక్తిని మూడో పెళ్ళి చేసుకుని అందరికీ షాక్ ఇచ్చింది.

  ఆ పెళ్లి పెటాకులు అయిన కొద్ది రోజులకే తమిళంలో పవర్ స్టార్ గా పిలవబడే కమెడియన్ శ్రీనివాస్ ను పెళ్లి చేసుకున్నట్లు గా కూడా ఒక ఫోటో ఆమె స్వయంగా సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. ఏంటి నాలుగో పెళ్ళా? అంటూ కామెంట్లు చేస్తున్న వారందరికీ నాలుగు కాదు నలభై చేసుకుంటా మీకెందుకు అని నోరు మూయించింది వనిత విజయ కుమార్. అయితే ఆ తర్వాత అది ఒక సినిమాకు సంబంధించిన పోస్టర్లని క్లారిటీ ఇచ్చింది అనుకోండి అది వేరే విషయం.

  అలీతో సరదాగా

  అలీతో సరదాగా

  ఇక ఈ భామ ఈటీవీలో ప్రసారమవుతున్న ఆలీతో సరదాగా షో కి ముఖ్య అతిథిగా హాజరైంది. దానికి సంబంధించిన ప్రోమో విడుదల కాగా అది బాగా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక ఇంటర్వ్యూ మొదట్లోనే నాగలక్ష్మి మహేశ్వరి వనిత అని ఇంత పెద్ద పేరు ఉంటే అవన్నీ తీసేసి వనిత విజయ్ కుమార్ అనే పేరు ఎందుకు పెట్టుకున్నారు అని ప్రశ్నించారు.

  దానికి ఆమె ముగ్గురు అక్కడ ముగ్గురు ఇక్కడ అంటూ ఆసక్తికరంగా సమాధానం ఇచ్చింది. దేవి సినిమా తర్వాత తెలుగులో మళ్లీ ఎందుకు కనిపించలేదు అని ప్రశ్నించగా ఆమె తన బుర్ర లేదంటూ సమాధానం ఇచ్చింది. అది ఏంటది అని ప్రశ్నించగా తన బుర్ర ఇంకా ఎదగలేదని ఇప్పుడిప్పుడే అది తయారవుతోందని రివర్స్ పంచ్ కూడా వేసింది.

  ప్రేమలో పడి

  ప్రేమలో పడి

  అయితే దేవి సినిమా హిట్ అయిన తరువాత తెలుగులో అవకాశాలు వచ్చినా చేయలేక పోయారా ? లేకపోతే అవకాశాలు రాలేదా అని ప్రశ్నించగా ప్రేమ వ్యవహారంతో సినిమాల లో నటించ లేకపోయాను అని విజయ వనిత విజయకుమార్ ఇప్పుడు స్పందించారు. అయితే అప్పుడు సినిమాలు ఆఫర్ చేసిన వాళ్ళు ఏదో ఒకరోజు తిరిగి ఇక్కడికి వస్తావు అని అన్నారని అది ఈ ఇంటర్వ్యూ ద్వారా నిజమైందని ఆమె చెప్పుకొచ్చారు.

  ఇక తనకు అప్పట్లో నాగార్జున అంటే చాలా ఇష్టమని కానీ ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ అంటే తనకు చాలా అభిమానం అని చెప్పుకొచ్చారు. ఎన్టీఆర్ తో ఒక్క షాట్ అయినా పర్వాలేదని అది తన జీవితకాల డ్రీమ్ అని మనసులో మాట బయటపెట్టారు వనిత విజయకుమార్.

  అప్పుడే పోవాల్సింది

  అప్పుడే పోవాల్సింది

  ఇక దేవి సినిమా షూటింగ్ సమయంలో తాను చనిపోయేది ఉందని ఎందుకంటే దేవీ షూటింగ్ లో నిజమైన పాము తన నుదుట బొట్టు పెట్టిందని వనిత విజయ్ కుమార్ వెల్లడించారు. అయితే బొట్టు పెట్టిన తర్వాత ఆ పాము తన చేతి వేలుని కొరికిన అప్పుడు తన కండిషన్ సీరియస్ అయింది అని చెప్పుకొచ్చారు.

  అయితే అలాంటి సమయంలో తన తల్లి మాట్లాడుతూ ఆమె వలన చనిపోయినా పర్వాలేదు అని చెప్పారని చెప్పుకొచ్చారు. అలాగే నేను మంజుల హౌస్ లో పుట్టానని అందుకే నాకు నాగదేవత అంటే చాలా ఇష్టం అని ఆమె అంశతోనే నేను పుట్టాను అని భావిస్తూ ఉంటారు అని చెప్పుకొచ్చారు.

  అందుకే నాకు నాగదేవత అంటే చాలా ఇష్టమని అలా దేవి సినిమాలో అవకాశం వచ్చిందని భావిస్తాను అని చెప్పుకొచ్చారు ఇక ఆ ఇంటిని తర్వాత కాలంలో మెగాస్టార్ చిరంజీవి కొనుక్కున్నారు అని వెల్లడించారు.

  అప్పుడు ఓకే కానీ ఇప్పుడు

  అప్పుడు ఓకే కానీ ఇప్పుడు

  ఇక ఆ తర్వాత ఈ భామ తన ఫ్యామిలీలో గొడవల గురించి కూడా కొన్ని విషయాలను పంచుకున్నారు. తన కుటుంబంలో జరిగిన కొన్ని పర్సనల్ వివాదాల కారణంగా పోలీస్ స్టేషన్ కు వెళ్లాల్సి వచ్చిందని ఆమె వెల్లడించింది. ఆ రోజుల్లో ఈ వ్యవహారం చాలా పెద్దది అయిందని అన్నారు.

  అలాగే ఈ వ్యవహారంలో తన తప్పేమీ లేదని చెప్పుకొచ్చారు.. అయితే ఇప్పుడు మీ కుటుంబంతో కలిసే ఉంటున్నారా అని ప్రశ్నించగా తాను అనేక ఇబ్బందులు పడుతున్ప్పుడు అందరూ కలిసే ఉన్నారని ఇప్పుడు కొంచెం పర్వాలేదు సెటిల్ అవుతున్నాను అనుకున్న సమయంలో అందరూ దూరమయ్యారని ఆమె ఎమోషనల్ అయ్యారు.

  English summary
  Vanitha Vijay Kumar, who attended the Ali tho saradaga show, shared interesting facts about her life, her acting career as well as her parents.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X