Malli Modalaindi on ZEE5 రొమాంటిక్ రోల్‌తో వర్షిణి సౌందర్‌రాజన్.. విడాకులిస్తూ లాయర్‌తో అఫైర్!
కరోనావైరస్ పరిస్థితుల్లో వినోదం కరువైన ప్రేక్షకులకు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ విభిన్నమైన కంటెంట్‌తో చిత్రాలను అందిస్తున్నాయి. ఓటీటీలో స్వేచ్ఛ, ఎలాంటి కంటెంట్‌నైనా అందించడానికి వెసలుబాటు ఉండటంతో యువ దర్శక, నిర్మాతలు కథలు, విలక్షణమైన స్క్రిప్టులతో ప్రయోగాలు చేయడానికి సాహసం చేస్తున్నారు. ఇలాంటి ప్రయోగాత్మకమైన కథతో వస్తున్న చిత్రం మళ్లీ మొదలైంది. భార్యభర్తల సంబంధాలు, వివాహేతర బంధాల కథతో ఈ చిత్రం రూపొందింది. ఈ సినిమా త్వరలోనే ZEE5 ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. ఈ సినిమాకు సంబంధించిన వివరాల్లోకి వెళితే...

విభిన్నమైన కథతో సుమంత్ మరోసారి
అక్కినేని నట వారసుడు సుమంత్ ఇటీవల కాలంలో తన మనసుకు నచ్చిన, ప్రేక్షకుల మెచ్చే పాత్రలను అంగీకరిస్తూ విభిన్నమైన పాత్రలను పోషిస్తున్నారు. మళ్లీ రావా, కపటధారి లాంటి చిత్రాలతో ప్రేక్షకులకు చేరవయ్యారు. విభిన్నమైన నటనతో ప్రేక్షకుల మెప్పు పొందారు. తాజాగా యూత్, ఫ్యామిలీ అంశాలు ఉన్న మళ్లీ మొదలైందితో ప్రేక్షకుల ముందుకు రాబోతుండటం గమనార్హం.

భార్యకు విడాకులు ఇవ్వబోయి. . లాయర్‌తో
మళ్లీ మొదలైంది సినిమా కథ విషయానికి వస్తే.. భార్యతో విభేదాలు ఉన్న వ్యక్తి విడాకుల కోసం దరఖాస్తు చేసుకొంటారు. అయితే కోర్టులో తన కేసును వాదిస్తున్న లాయర్‌లో ఆ వ్యక్తి ప్రేమలో పడుతాడు. భార్యతో విడాకులు తీసుకొన్నారా? తన లాయర్‌తో ప్రేమలో పడిన తర్వాత ఆ వ్యక్తి జీవితంలో ఎలాంటి ట్విస్టులు చోటుచేసుకొన్నాయి అనే అంశాలతో మళ్లీ మొదలైంది సినిమా రూపొందింది. భర్తగా సుమంత్ నటించగా.. భార్యగా యువ హీరోయిన్ వర్షిణి సౌందర్యరాజన్ నటించారు. లాయర్ పాత్రలో నైనా గంగూలీ నటించారు.

సిద్ శ్రీరాం పాడిన పాటకు
లవ్, రొమాన్స్, ఎమోషన్స్ తదితర అంశాలతో రూపొందిన మళ్లీ మొదలైంది చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు అనుప్ రూబెన్ మ్యూజిక్ అందించారు. ప్రముఖ గాయకుడు, ఇటీవల ప్రేక్షకులను ఆకట్టుకొంటున్న సిద్ శ్రీరాం పాడిన ఎలోన్.. ఎలోన్ అనే పాట మ్యూజిక్ లవర్స్‌ను మంత్ర ముగ్దుల్ని చేస్తుందని చిత్ర యూనిట్ నమ్మకంతో ఉన్నారు.

ఫ్యాన్సీ రేటుకు జీ5 చేతికి హక్కులు
ఇక మళ్లీ మొదలైంది చిత్రం ఈడీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై కే రాజశేఖర్ రెడ్డి నిర్మాతగా, చరణ్ తేజ్ ఉప్పలపాటి సీఈవోగా, టీజీ కీర్తి కుమార్ దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ఓటీటీ రైట్స్‌ను జీ5 ఫ్యాన్సీ రేటుకు దక్కించుకొన్నది. ఫిబ్రవరిలో ఈ సినిమాను ఓటీటీ ద్వారా ప్రేక్షకులకు అందించే ప్రయత్నం చేస్తున్నారు.

జీ5 విభిన్నమైన చిత్రాలతో
ఇక కరోనా, ఒమిక్రాన్ పరిస్థితుల్లో ప్రేక్షకులకు విలక్షణమైన, విభిన్నమైన సినిమాలను ZEE5 అందించే ప్రయత్నం చేస్తున్నది. సుమంత్, వర్షిణి సౌందరరాజన్ జంటగా మళ్లీ మొదలైంది సినిమా కంటే ముందుగా లూజర్ 2 అనే చిత్రాన్ని జనవరి 21వ తేదిన ZEE5 రిలీజ్ చేస్తున్నది. ఇప్పటికే ఈ సినిమా టీజర్లు, ట్రైలర్లకు భారీ రెస్సాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే.
Recommended Video

మళ్లీ మొదలైందిలో నటీనటులు, సాంకేతిక నిపుణులు
నటీనటులు: సుమంత్, వర్షిణి సౌందర్‌రాజన్, నైనా గంగూలీ, సుహాసిని, అన్నపూర్ణ తదితరులు
రచన, దర్శకత్వం: టీజీ కీర్తి కుమార్
నిర్మాత: కే రాజశేఖర్ రెడ్డి
సీఈవో: చరణ్ తేజ్ (రెడ్ సినిమాస్)
మ్యూజిక్: అనూప్ రూబెన్స్
సినిమాటోగ్రఫి: శివ జీఆర్ఎన్
ఎడిటింగ్: ప్రదీప్ ఈ రాఘవ్,
ఆర్ట్: అర్జున్ సురిశెట్టి
సాహిత్యం: కృష్ణ చైతన్య
ఓటీటీ రిలీజ్: జీ5
ఓటీటీ రిలీజ్ డేట్: ఫిబ్రవరి 2022


Click it and Unblock the Notifications











