వరుణ్ తేజ్ ‘గని’ లేటెస్ట్ అప్‌డేట్: ఆ దేశం వాళ్లు వచ్చిన వెంటనే ఫైటింగ్ స్టార్ట్

మెగా ఫ్యామిలీ నుంచి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినా.. తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును అందుకుని స్టార్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్నాడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్. కెరీర్ ఆరంభం నుంచీ వైవిధ్యమైన సినిమాలను చేస్తున్న అతడు.. ఎన్నో హిట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. మరీ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో మరింత ఫామ్‌లో కనిపిస్తున్నాడు. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఈ యంగ్ హీరో 'గని' అనే సినిమాను చేస్తున్నాడు. కరోనా కారణంగా ఆగిపోయిన ఈ సినిమా షూటింగ్ గురించి తాజాగా ఓ న్యూస్ ఫిలిం నగర్ ఏరియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో వరుణ్ తేజ్ నటిస్తోన్న చిత్రమే 'గని'. బాక్సింగ్ నేపథ్యంతో రాబోతున్న ఈ సినిమా కోసం హాలీవుడ్ నుంచి యాక్షన్ కొరియోగ్రాఫర్లు లార్నెల్ స్టోవల్, లాడ్ రింబర్గ్‌ను తీసుకు రాబోతున్నట్లు ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. తాజా సమాచారం ప్రకారం.. ఈ ఫైట్ మాస్టర్లు ఇద్దరూ జూలైలో హైదరాబాద్‌కు రానున్నారట. వాళ్లు వచ్చిన వెంటనే ఈ సినిమా షూటింగ్‌ను పున: ప్రారంభించబోతున్నారని తెలుస్తోంది. ఇందుకోసం నగరంలోని ఓ స్టూడియోలో బాక్సింగ్ రింగ్ సెట్‌ను ఇప్పటికే ఏర్పాటు చేసేశారని తెలుస్తోంది.

 Varun Tejs Ghani Shooting Start From July

ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న 'గని' సినిమాలో వరుణ్ తేజ్ ప్రొఫెషనల్ బాక్సర్‌గా నటిస్తున్నాడు. ఇందుకోసం అతడు అమెరికా వెళ్లి మరీ చాలా నెలల పాటు శిక్షణ కూడా తీసుకున్నాడు. కరోనా రెండు దశల కారణంగా ఈ సినిమా పలుమార్లు వాయిదా పడింది. ఇక, ఇందులో బాలీవుడ్ బ్యూటీ సయీ మంజ్రేకర్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పణలో సిద్ధు ముద్ద, అల్లు బాబీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. నవీన్ చంద్ర విలన్‌గా చేస్తున్నాడు. వీళ్లతో పాటు హిందీ హీరో సునీల్ శెట్టి, కన్నడ హీరో ఉపేంద్ర కూడా నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలను చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X