For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Ghani: అదిరిపోయే పంచ్ ఇచ్చిన వరుణ్ తేజ్.. రిలీజ్ డేట్ విషయం ఫ్యాన్స్‌కు నిరాశే

  |

  మెగా బ్రదర్ నాగబాబు కుమారుడిగా సినిమాల్లోకి ప్రవేశించినా.. ఆరంభంలోనే తనలోని టాలెంట్లను నిరూపించుకుంటూ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకున్నాడు వరుణ్ తేజ్. సాదాసీదాగా ఎంట్రీ ఇచ్చినా తొలినాళ్లలోనే మంచి మంచి చిత్రాలను ప్రేక్షకులకు అందించిన అతడు.. పలు విజయాలను కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ ఉత్సాహంతోనే వరుస పెట్టి సినిమాల మీద సినిమాలు చేస్తూ వెళ్తున్నాడు. ఇక, ఇటీవలి కాలంలో ఎన్నో హిట్లను అందుకున్నాడు. దీంతో మరింత జోష్‌తో కనిపిస్తున్నాడు. అలా ఎన్నో ప్రాజెక్టులను సైతం పట్టాలెక్కించేందుకు ప్లాన్ చేసుకుంటున్నాడు.

  మహేశ్ మూవీ నుంచి చెప్పకుండా తీసేశారు.. ఆ అమ్మాయి వల్ల నాపై కేసు పెట్టారు: నోరు విప్పిన ప్రకాశ్ రాజ్

  వరుస హిట్లతో ఫుల్ జోష్‌ మీదున్న వరుణ్ తేజ్ ప్రస్తుతం 'గని' అనే సినిమాలో నటిస్తున్నాడు. కిరణ్ కొర్రపాటి తెరకెక్కిస్తోన్న ఈ సినిమా బాక్సింగ్ నేపథ్యంతో రూపొందుతోంది. మూవీ షూటింగ్ ఎప్పుడో ప్రారంభం అయింది. కానీ, అనివార్య కారణాల వల్ల తరచూ ఆటంకాలు ఎదురవడంతో చిత్రీకరణ మాత్రం పూర్తి కాలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఇటీవలే క్లైమాక్స్‌కు సంబంధించిన ఫైనల్ షెడ్యూల్‌ను హైదరాబాద్‌లో ప్రారంభించారు. ఇందులో చివరి ఫైట్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఇది దాదాపుగా పూర్తి అయిపోయింది. ఆ వెంటనే ఈ సినిమాకు సంబంధించిన డబ్బింగ్ పనులను కూడా చిత్ర యూనిట్ మొదలు పెట్టేసింది.

  Varun Tejs Ghani Movie Release on December 3rd

  వరుణ్ తేజ్ హీరోగా కిరణ్ కొర్రపాటి తెరకెక్కించిన 'గని' చిత్రాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేసుకుని ప్రేక్షఖుల ముందుకు తీసుకు రావాలని చిత్ర యూనిట్ భావించింది. ఇందులో భాగంగానే ఈ ఏడాది దీపావళి పండుగ కానుకగా నవంబర్ 4వ తేదీన విడుదల చేయాలని చిత్ర యూనిట్ నిర్ణయించింది. ఈ మేరకు ఓ ప్రకటనను కూడా చేసింది. అయితే, ఈ సినిమాను డిసెంబర్‌కు వాయిదా వేస్తున్నట్లు కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతూ వచ్చింది. ఈ నేపథ్యంలోనే తాజాగా 'గని' మూవీ యూనిట్ ఫస్ట్ పంచ్ పేరిట ఓ గ్లిమ్స్ వీడియోను విడుదల చేసింది. దీని ద్వారా రిలీజ్ డేట్ విషయంలో క్లారిటీ ఇచ్చింది.

  బీచ్‌లో లవర్‌తో పాయల్ రాజ్‌పుత్ రచ్చ: బికినీలో అందాలన్నీ చూపిస్తూ.. షాకిస్తోన్న సెల్ఫీ వీడియో

  'గ్లిమ్స్ ఆఫ్ గనీ ఫస్ట్ పంచ్' పేరిట తాజాగా 'గని' మూవీ నుంచి ఓ వీడియో విడుదలైంది. ఇందులో వరుణ్ తేజ్ బాక్సింగ్ గ్లౌజ్‌లు వేసుకుని రక్తం చిందిస్తూ కనిపించాడు. చివర్లో అదిరిపోయేలా పంచ్ ఇచ్చాడు. ఇక, ఇందులో ఎస్ థమన్ అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ సూపర్బ్‌గా ఉంది. ఇదిలా ఉండగా.. ఇదే వీడియోలో ముందు నుంచీ అనుకుంటున్నట్లుగానే సినిమా రిలీజ్ వాయిదా పడినట్లు ప్రకటించారు. దీని ప్రకారం.. ఈ సినిమాను డిసెంబర్ 3న ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు.

  ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న 'గని' సినిమాలో వరుణ్ తేజ్ ప్రొఫెషనల్ బాక్సర్‌గా నటిస్తున్నాడు. ఇందుకోసం చాలా కాలం పాటు అమెరికాలో బాక్సింగ్‌లో శిక్షణ కూడా తీసుకున్నాడు. ఇక, ఈ సినిమాను గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్ సమర్పణలో సిద్ధు ముద్ద, అల్లు బాబీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. నవీన్ చంద్ర కూడా హీరోకు పోటీనిచ్చే బాక్సర్‌గా చేస్తున్నాడు. ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ సయీ మంజ్రేకర్ హీరోయిన్‌గా నటిస్తోంది. వీళ్లతో పాటు సునీల్ శెట్టి, కన్నడ హీరో ఉపేంద్ర కూడా కీలక పాత్రలను పోషిస్తున్నారు. థమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే.

  English summary
  Mega Prince Varun Tej Now Doing Ghani Movie Under Kiran Korrapati Direction. Now This Movie Release Date Announced.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X