చనిపోయిన అభిమాని కుటుంబానికి అండగా వరుణ్ తేజ్.. తన టీమ్ ని పంపి మరీ!
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మెగా ఫ్యామిలీ నుంచి హీరోగా ఎంట్రీ ఇచ్చి స్టార్ గా నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక మెగా ఫాన్స్ ఎవరు ఆపదలో ఉన్నా వారికి తన వంతు సాయం అందిస్తున్నాడు వరుణ్. తాజాగా ఆయన మరో దివంగత అభిమాని కుటుంబానికి అండగా నిలిచారు. ఇటీవల చనిపోయిన తన అభిమాని శేఖర్ కుటుంబాన్ని వరుణ్ తేజ్ ఆదుకున్నారు. కరీంనగర్‌కి చెందిన శేఖర్ అనే వరుణ్ అభిమాని ఇటీవల కన్ను మూశారు.
అయితే శేఖర్ ఫ్యామిలీ ఇబ్బందుల్లో ఉందని తెలుసుకున్న వరుణ్ తేజ్ వారికి తన తరపు నుంచి సహాయాన్ని అందించారు. వరుణ్ తన సొంతంగా రెండు లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేశారు. ఈరోజు శేఖర్ కుటుంబం వద్దకి వెళ్ళిన వరుణ్ తేజ్ టీమ్ రెండు లక్షల చెక్ ని వారికి అందచేశారు. ఇక సినిమాల విషయానికి వస్తే వరుణ్ తేజ్ గని అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని నూతన దర్శకుడు కిరణ్ కొర్రపాటి తెరకెక్కిస్తున్నారు.

ఇక ఈ సినిమాతో అల్లు అరవింద్ పెద్ద కుమారుడు అల్లు బాబి నిర్మాతగా టాలీవుడ్ కి పరిచయం అవుతున్నారు. గని సినిమా కోసం బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ సుల్తాన్ సినిమా కోసం పని చేసిన యాక్షన్ కంపోజర్లు పని చేస్తున్నారు. హాలీవుడ్ నుంచి వచ్చిన లార్నెల్ స్టోవల్ మరియు వ్లాడ్ రింబర్గ్ ఈ యాక్షన్ ఎపిసోడ్లను పర్యవేక్షిస్తారు. కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహిస్తున్న ఈ 'గని' సినిమాతో సాయి మంజ్రేకర్ టాలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తోంది. జగపతి బాబు, నవీన్ చంద్ర, ఉపేంద్ర, సునీల్ శెట్టి, నదియా లాంటి వారు నటిస్తున్న ఈ సినిమాకి తమన్ సంగీతం అందిస్తున్నారు. మరో పక్క ఆయన సంక్రాంతికి రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఎఫ్2కి సీక్వెల్‌గా ఎఫ్3 తెరకెక్కిస్తున్నారు.


Click it and Unblock the Notifications











