Don't Miss!
- Sports
IND vs AUS: ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్.. అతను ఆడటం భారత్‌కు కీలకం!
- News
టీఎస్ ఎస్పీడీసీఎల్లో 1601 ఉద్యోగాలకు నోటిఫికేషన్
- Finance
h1b layoffs: సెలవులో ఉన్న టెక్కీకి లేఆఫ్.. US వెళ్లే దారిలేక..
- Lifestyle
Happy Propose Day 2023: మీరు ప్రపోజ్ చేయడానికి ఈ ప్లేసెస్ ది బెస్ట్, అవేంటంటే..
- Technology
ఈ ఫోన్లు వాడుతున్నారా? కొత్త OS అప్డేట్ చేస్తే ఇబ్బందుల్లో పడతారు జాగ్రత్త!
- Travel
బెజవాడకు చేరువలోని ఈ జైన దేవాలయం గురించి మీకు తెలుసా!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
Veera Simha Reddy ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదిక ఖారారు.. వేడుక ఎక్కడంటే? రంగంలోకి టీడీపీ శ్రేణులు!
ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీస్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, రవి ప్రకాశ్ నిర్మాతలుగా మలినేని గోపిచంద్ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ నటిస్తున్న వీరసింహారెడ్డి మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదిక మార్పు వ్యవహారం గందరగోళంగా మారిన విషయం తెలిసిందే. అయితే ట్రాఫిక్ సమస్య తలెత్తే అవకాశం ఉందని అనుమతులు ఇవ్వకపోవడంతో వీరసింహారెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు వేదిక మార్పు అనివార్యమైంది. ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడంతో కొత్తగా వేదికను ఖారారు చేశారు. ఆ వేదిక వివరాల్లోకి వెళితే..

అనుమతుల్లేవని ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు బ్రేక్
నందమూరి బాలకృష్ణ నటించినవీరసింహారెడ్డి నిర్మాతలు ముందుస్తు పర్మిషన్ తీసుకొని ఒంగోలులోని ఏబీఎం గ్రౌండ్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించాలని ప్లాన్ చేశారు. వేదిక ఏర్పాట్లు, బారికేడ్ల నిర్మాణం పనులను శ్రేయాస్ మీడియాకు అప్పగించారు. యుద్ద ప్రాతిపాదికన ఏబీయం గ్రౌండ్‌ను ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముస్తాబు చేశారు. అంతా సవ్యంగా సాగుతుందనుకొనే సమయంలో ప్రభుత్వ అధికారులు.. అనుమతుల్లేవని మోకాలు అడ్డారు. దాంతో ప్రీ రిలీజ్ ఈవెంట్ పనులు మళ్లీ మొదటికి వచ్చాయి.

వేదిక కోసం రాత్రంతా కసరత్తు
ఒంగోలు ఏబీఎం గ్రౌండ్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించడానికి అనుమతి లేదనే అధికారులు ఆంక్షలతో మైత్రీ మూవీస్ సందిగ్దంలో పడింది. అప్పటికప్పుడు భారీ ఈవెంట్‌కు స్థలం ఎక్కడ ఉందంటూ ఆరా తీశారు. ఓ దశలో హైదరాబాద్‌లో నిర్వహిస్తే ఎలా ఉంటుందనే ఆలోచనతో ముందుకెళ్తారు. కానీ ఆంధ్రాలోనే అభిమానుల మనోభావాలు దెబ్బ తీయకూడదనే ఒంగోలు ప్రాంతంలోనే అనువైన ప్రదేశం గురించి వెతికారు.

అనువైన ప్రదేశాల కోసం గాలింపు
జనవరి 6వ తేదీన అంటే రెండు రోజుల్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించాల్సిన గడువ దగ్గరపడటంతో బుధవారం రాత్రంతా మంతనాలు జరిపారు. ఒంగోలు ప్రాంతంలోని పలు ప్రదేశాలను, ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా ఉండే ప్రదేశాలను గుర్తించారు. రాత్రంతా అధికారులతో వేదిక ప్రాంతానికి సంబంధించిన వివరాలను అందించి అనుమతి పొందేందుకు నిర్మాతలు ప్రయత్నించారు.

ఒంగోలు బైపాస్ రోడ్డుకు సమీపంలో
వీరసింహారెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదిక మార్పుకు సంబంధించిన వ్యవహారానికి నిర్మాతలు కొలిక్కి తీసుకొచ్చారు. అనేక తర్జనభర్జనల అనంతరం ఒంగోలులోనే ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించేందుకు ప్లాన్ చేశారు. చివరకు ఒంగోలులోని ఆర్ఎస్ డాబా సమీపంలోని బైపాస్‌కు చేరువలోని అర్జున్ ఇన్ఫ్రా ప్రదేశంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదికను ఖరారు చేశారు. యుద్ధ ప్రాతిపాదికన వేదికను సిద్దం చేసేందుకు నిర్వాహకులు రంగంలోకి దిగారు.

రంగంలోకి టీడీపీ శ్రేణులు
వీరసింహారెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఏబీఎం గ్రౌండ్‌లో నిర్వహించడానికి అనుమతి లేదనే అధికారుల ఆదేశాలతో నందమూరి అభిమానులు ఆందోళనకు గురయ్యారు. ఈవెంట్‌ను ఆంధ్రాలో నిర్వహిస్తారా? లేదా అనే గందరగోళంలో పడిపోయారు. చివరకు బాలకృష్ణ సినిమా ఈవెంట్‌ను ఒంగోలులోనే నిర్వహించాలని డిసైడ్ చేయడంతో ప్రీ రిలీజ్ వేడుకు భారీగా తరలివచ్చేందుకు సిద్దమవుతున్నారు. ఈవెంట్‌ను భారీ సక్సెస్ చేయడానికి టీడీపీ శ్రేణులు రంగంలోకి దూకినట్టు సమాచారం.