‘వెంకీమామ’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఖరారు.. వేదిక ఎక్కడో తెలుసా?
అక్కినేని నాగ చైతన్య, విక్టరీ వెంకటేష్ హీరోలుగా రాబోతున్న సినిమా 'వెంకీమామ'. రియల్ లైఫ్ మామాఅల్లుళ్లు రీల్ లైఫ్ మామాఅల్లుడుగా నటిస్తున్నందున ఈ సినిమాపై భారీ హైప్ నెలకొంది. ఇప్పటికే షూట్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది.
ఇందులో భాగంగా తాజాగా చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదికను ఖరారు చేశారు యూనిట్ సభ్యులు. 'వెంకీమామ' ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను డిసెంబర్ 7న ఖమ్మంలోని లేక్ వ్యూ క్లబ్‌లో సాయంత్రం 6 గంటలకు నిర్వహిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ట్వీట్ పెట్టారు.

హిలేరియస్ కామెడీ ఎంటర్‌టైనర్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న 'వెంకీమామ' సినిమాలో వెంకటేష్ రైతుగా, నాగచైతన్య ఆర్మీ ఆఫీసర్‌గా కనిపించనున్నారు. వెంకటేష్ సరసన పాయల్ రాజ్ పుత్, నాగచౌతన్యకు సరసన రాశీఖన్నా ఆడిపాడారు. డిసెంబర్ 13న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
కేఎస్ రవీంద్ర (బాబీ) దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రానికి దగ్గుబాటి సురేశ్ బాబు, టీజీ విశ్వప్రసాద్ నిర్మాతలుగా వ్యవహరించారు. ఎస్.ఎస్.థమన్ సంగీతం అందించారు. విడుదలకు ముందే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొనడంతో చిత్ర ప్రీ రిలీజ్ బిసినెస్ బాగా జరిగిందని తెలుస్తోంది. ఈ సినిమా కోసం అటు దగ్గుబాటి అభిమానులు, ఇటు అక్కినేని అభిమానులు ఆసక్తిగా ఎదురు చుస్తున్నారు.


Click it and Unblock the Notifications











