‘భారతీయుడు 2’లో అవకాశం దక్కించుకున్న వెన్నెల కషోర్

2.0 తర్వాత ప్రముఖ దర్శకుడు శంకర్ తెరకెక్కించబోయే మరో భారీ చిత్రం 'ఇండియన్ 2' (భారతీయుడు -2)లో తెలుగు కమెడియన్ వెన్నెల కిషోర్ అవకాశం దక్కించుకున్నట్లు తెలుస్తోంది. కమల్ హాసన్ హీరోగా రూపొందబోయే ఈ చిత్రం తమిళంతో పాటు తెలుగులోనూ విడుదలవుతున్న నేపథ్యంలో ఇక్కడి నటులను కూడా ఎంపిక చేస్తున్నారు. ఇందులో ఓ ముఖ్యమైన కామెడీ పాత్రకు వెన్నెల కిషోర్ ఎంపిక చేశారట.

ఈ చిత్రంలో మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ కీలక పాత్రలో కనిపించబోతున్నట్లు కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. తమిళ నటుడు శింబు కూడా ఇందులో నటించబోతున్నట్లు తెలుస్తోంది.

 Vennela Kishore in indian 2

మరో వైపు ఈ సినిమా కోసం రామోజీ ఫిల్మ్ సిటీలో ఆల్రెడీ సెట్స్ నిర్మాణం మొదలైంది. కీలకమైన సన్నివేశాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతాల్లో చిత్రీకరించబోతున్నారని తెలుస్తోంది. 2.0 చిత్రాన్ని నిర్మించిన లైకా ప్రొడక్షన్స్ వారు ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు.

ఇండియన్' కంటే 'ఇండియన్ 2'లో మరింత పవర్ ఫుల్ డైలాగులు పేలబోతున్నాయట. ఈ విషయాన్ని గతంలో ఓ ఇంటర్వ్యూలో కమల్ హాసన్ తెలిపారు. ఈ మెగా మూవీకి రవి వర్మన్ సినిమాటోగ్రఫీ అందించనున్నారు. అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తారు. '2.0' సినిమా విడుదల తర్వాత షూటింగ్ ప్రారంభం కానుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X