Sherni on Amazon: విద్యాబాలన్ తొలి పారితోషికం ఎంతో తెలుసా?

బాలీవుడ్‌లో విభిన్నమైన పాత్రలతో ఆకట్టుకొంటున్న విద్యాబాలన్ నటించిన తాజా చిత్రం షేర్ని. దేశవ్యాప్తంగా పరిస్థితులు ప్రతికూలంగా ఉండటంతో ఈ చిత్రం ఓటీటీలో రిలీజ్ అవుతున్నది. ప్రముఖ ఓటీటీ స్ట్రీమింగ్ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియోలో జనవరి 18వ తేదీన రిలీజ్ అవుతున్నది. ఈ నేపథ్యంలో ప్రమోషనల్‌లో భాగంగా విద్యాబాలన్ జూమ్ ద్వారా మాట్లాడుతూ.. ఈ చిత్రంలో విద్యా విన్సెంట్ అనే పాత్రలో ఫారెస్ట్ ఆఫీసర్‌గా నటిస్తున్నాను అని తెలిపారు. ఈ చిత్రంలో మిగితా పాత్రలు కూడా ఆసక్తికరంగా ఉంటాయి అని అన్నారు.

ఇక తన కెరీర్ ఎలా ప్రారంభమైందనే విషయాన్ని వెల్లడిస్తూ.. తొలిసారి టీవీ షోకు తన తల్లి, సోదరితో కలిసి ఆడిషన్స్‌కు వెళ్లాను. ఓ చెట్టు పక్కన నిలుచుని నవ్వడంతో నా ఆడిషన్ పూర్తయింది అని చెప్పారు. నాకు తొలి పారితోషికం సినిమా గానీ, లేదా టెలివిజన్‌లో నటించడం ద్వారా రాలేదు అని విద్యాబాలన్ తెలిపారు.

Vidya Balans Sherni on Amazon Prime Video: Actress reveals her first remuneration

టూరిజం సంస్థకు సంబంధించిన యాడ్'లో నటించడం ద్వారా నాకు తొలి పారితోషికం లభించింది. ఆ పారితోషికం కేవలం 500 రూపాయలు. ఆ క్యాంపెయిన్ కోసం నేను, నా సోదరి, నా కజిన్, నా ఫ్రెండ్‌తో కలిసి పాల్గొన్నాను. ఒక్కొక్కరికి 500 లభించాయి పేర్కొన్నారు.

చిత్రం: షేర్ని
నటీనటులు: విద్యాబాలన్, శరత్ సక్సేనా, విజయ్ రాజ్, ఇలా అరుణ్, బ్రిజేంద్ర కాలా, నీరజ్ కాబీ, ముకుల్ ఛాద్దా తదితరులు
దర్శకత్వం: అమిత్ వీ మసుర్కార్
నిర్మాతలు: భూషణ్ కుమార్, కిషన్ కుమార్, విక్రమ్ మల్హోత్రా, అమిత్ వీ మసుర్కార్
కథ: ఆస్తా టికు
డైలాగ్స్: యషస్వీ మిశ్రా, అమిత్ వీ మసుర్కార్
మ్యూజిక్: బెనెడిక్ట్ టేలర్, నరేన్ చందవర్కార్, బండీష్ ప్రాజెక్ట్, ఉత్కర్ష్ ధోటేకర్
సినిమాటోగ్రఫి: రాకేశ్ హరిదాస్
ఎడిటింగ్: దీపిక హరిదాస్
రిలీజ్: అమెజాన్ ప్రైమ్ వీడియో
రిలీజ్ డేట్: 2021-06-18

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X