Just In
- 5 min ago
RRR నుంచి అదిరిపోయే అప్డేట్: గుడ్ న్యూస్ చెప్పిన ఎన్టీఆర్, చరణ్.. వాళ్లిచ్చే సర్ప్రైజ్ అదే!
- 1 hr ago
హాలీవుడ్ చిత్రం గాడ్జిల్లా vs కాంగ్ ట్రైలర్ విడుదల: తెలుగుతో పాటు ఆ భాషల్లో కూడా వదిలారు
- 2 hrs ago
మహేశ్ బాబు పేరిట ప్రపంచ రికార్డు: సినిమాకు ముందే సంచలనం.. చలనచిత్ర చరిత్రలోనే తొలిసారి ఇలా!
- 3 hrs ago
ఘనంగా హీరో వరుణ్ వివాహం: సీసీ కెమెరాలు తీసేసి మరీ రహస్యంగా.. ఆయన మాత్రమే వచ్చాడు!
Don't Miss!
- News
ఇంగితజ్ఞానం ఉన్నవాళ్లు ఆ పనిచేయరు... దమ్ముంటే కేసీఆర్ దానిపై ప్రకటన చేయాలి : సంజయ్ సవాల్
- Sports
మెల్బోర్న్ సెంచరీ చాలా స్పెషల్.. అందుకే సిడ్నీలో మైదానం వీడలేదు: అజింక్యా రహానే
- Automobiles
కియా సెల్టోస్ ఫేస్లిఫ్ట్ లాంచ్ ఎప్పుడు? ఇందులో కొత్తగా ఏయే ఫీచర్లు ఉండొచ్చు?
- Lifestyle
జుట్టు పెరగడానికి నూనె మాత్రమే సరిపోదు, ఇక్కడ మోకాలి పొడవు జుట్టు యొక్క రహస్యం ఉంది
- Finance
Budget 2021: హెల్త్ బడ్జెట్ డబుల్! నిర్మలమ్మ 'ప్రధానమంత్రి హెల్త్ఫండ్?'
- Technology
వన్ప్లస్ నార్డ్ స్మార్ట్ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
కోట్లు తెచ్చిపెట్టిన బిచ్చగాడు కథకు సీక్వెల్ రెడీ.. ఈసారి ఎన్ని రికార్డులు బద్దలవుతాయో?
పెట్టిన పెట్టుబడికి అత్యధిక షేర్స్ ని అందించిన తమిళ డబ్బింగ్ సినిమాల్లో బిచ్చగాడు (పిచ్చైకారాన్) ఒకటి. తెలుగులో చాలా సైలెంట్ గా అనువాదమైన ఈ సినిమా 2016లో టాప్ బాక్సాఫీస్ హిట్స్ లో ఒకటిగా నిలిచింది. విజయ్ ఆంటోనీ కథానాయకుడిగా నటించిన ఆ సినిమా మొదట తమిళ్ లో పిచ్చైకారాన్ గా విడుదల అయ్యింది. విడుదలైన రోజు వరకు ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను అందుకుంటుందని ఎవరు ఊహించలేదు. ప్రస్తుతం ఆ సినిమాకు సీక్వెల్ సిద్ధమవుతున్నట్లు ఫస్ట్ లుక్కుతో చిత్ర యూనిట్ అఫీషియల్ ఎనౌన్స్మెంట్ ఇచ్చింది.

తక్కువ బడ్జెట్ లో..
అమ్మ సెంటిమెంట్ తో వచ్చిన ఈ చిత్రం ఎలాంటి హడావుడి లేకుండా రిలీజ్ అయ్యింది. వెంకటేష్ తో అప్పట్లో శీను అనే సినిమాను డైరెక్ట్ చేసిన సీనియర్ దర్శకుడు శశి బిచ్చగాడు సినిమాకు దర్శకత్వం వహించాడు. తక్కువ బడ్జెట్ తో రూపొందించిన ఈ సినిమా కోలీవుడ్ లో అద్భుత విజయాన్ని అందుకుంది. విజయ్ ఆంటోనీ ఈ సినిమాలో హీరోగానే కాకుండా సంగీతం కూడా అందించాడు.

తెలుగులో కాసుల వర్షం..
2016లో తెలుగులో బిచ్చగాడు పేరుతో సినిమాను రిలీజ్ చేస్తున్నారు అనగానే మొదట ఎదో డబ్బింగ్ సినిమా అని అందరూ లైట్ తీసుకున్నారు. కానీ మొదటి మూడు రోజులు చూసిన కొంతమంది జనాల నుంచి పాజిటివ్ టాక్ రావడంతో తరువాత వారం పాటు చాలా ఏరియాల్లో హౌజ్ ఫుల్ బోర్డులు దర్శనమిచ్చాయి. అప్పట్లో ఈ సినిమా దాదాపు 14కోట్ల వరకు కలెక్షన్స్ సాధించింది.

ఐదేళ్ల తరువాత సీక్వెల్..
ఇక ఐదేళ్ల అనంతరం బిచ్చగాడు కథకు సీక్వెల్ రాబోతున్నట్లు చిత్ర యూనిట్ అఫీషియల్ ఎనౌన్స్మెంట్ ఇచ్చింది. 2021లో సినిమాను విడుదల చేయాలని అనుకుంటున్నారు. గత కొన్ని నెలల క్రితమే బిచ్చగాడు 2కి సంబంధించిన స్క్రిప్ట్ పనులు జరుగుతున్నట్లు చెప్పిన విజయ్ ఇప్పుడు సడన్ గా ఫస్ట్ లుక్ రిలీజ్ చేసి హాట్ టాపిక్ అయ్యేలా చేశారు.

టెక్నీషియన్ చేంజ్
ఇక ఈ సారి విజయ్ టెక్నీషియన్స్ విషయంలో భారీ మార్పులు చేశాడు. నేషనల్ అవార్డ్ విన్నర్ ప్రియా కృష్ణస్వామి దర్శకత్వం వహిస్తుండగా విజయ్ అంథోని సినిమాను నిర్మించనున్నాడు. అయితే ఈసారి ఈ సినిమా ఏ స్థాయిలో కలెక్షన్స్ అందుకుంటుందో చూడాలి.