For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  kushi: సర్‌ప్రైజింగ్‌గా విజయ్, సమంత ఖుషి ఫస్ట్ లుక్.. రిలీజ్ డేట్ కూడా ప్రకటన

  |

  కెరీర్ ఆరంభంలో చిన్న చిన్న పాత్రలతో మెప్పించి.. 'పెళ్లి చూపులు' అనే సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు క్రేజీ గాయ్ విజయ్ దేవరకొండ. మొదటి చిత్రంతోనే అందరి దృష్టినీ ఆకర్షించిన అతడు.. ఆ తర్వాత ఎన్నో విజయాలను ఖాతాలో వేసుకుని చాలా తక్కువ సమయంలో స్టార్‌గా ఎదిగిపోయాడు. అప్పటి నుంచి వెనుదిరిగి చూడని ఈ యంగ్ సెన్సేషన్.. వరుసగా సినిమాల మీద సినిమాలు చేసుకుంటూ దూసుకెళ్తున్నాడు. ఈ క్రమంలోనే మరెన్నో సూపర్ డూపర్ హిట్లను కూడా సొంతం చేసుకున్నాడు. ఇలా చాలా కాలంగా టాలీవుడ్‌లో తన సత్తాను చూపిస్తూ వస్తున్నాడు. దీంతో రెట్టించిన ఉత్సాహంతో వరుసగా ప్రాజెక్టులు చేస్తున్నాడు.

  హాట్ డోస్ పెంచిన సీరియల్ నటి: పెళ్లైన కొత్తలోనే ఇలా రెచ్చిపోయిందేంటబ్బా!

  విజయ్ దేవరకొండ ఇప్పటికే పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో 'లైగర్' అనే సినిమాలో నటించాడు. పాన్ ఇండియా రేంజ్‌లో రూపొందుతోన్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తి అయింది. దీంతో ఈ యంగ్ హీరో తన ఫ్యూచర్ ప్రాజెక్టులపై దృష్టి సారించాడు. ఇందులో భాగంగానే ఇప్పటికే పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో 'జన గణ మన' అనే సినిమాను కూడా ప్రకటించాడు. అయితే, దీని కోసం కొంత గ్యాప్ తీసుకోవాలని డిసైడ్ అయిన విజయ్.. ఇప్పుడు మాత్రం శివ నిర్వాణ దర్శకత్వంలో తన పదకొండవ సినిమాను చేస్తున్నాడు. తాజాగా దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌తో పాటు టైటిల్‌ను కూడా చిత్ర యూనిట్ రివీల్ చేసింది.

  Vijay devarakondas Kushi First Look and Release Date

  విజయ్ దేవరకొండ హీరోగా శివ నిర్వాణ తెరకెక్కిస్తోన్న ఈ సినిమాకు ముందు నుంచీ అనుకుంటున్నట్లుగానే 'ఖుషి' అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ఈ మేరకు చిత్ర యూనిట్ తాజాగా ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్‌ను విడుదల చేసింది. ఇందులో విజయ్ సిగరెట్ కాల్చుతూ కనిపించాడు. అతడి పక్కనే హీరోయిన్ సమంత కూడా ఉంది. సంప్రదాయ వస్త్రాల్లో ఉన్న వీళ్లిద్దరికీ బ్రహ్మ ముడి వేసినట్లు ఇందులో చూపించాడు. ఇక, ఈ వీడియోలో 'ఖుషి.. నువ్వు కనపడితే.. ఖుషి.. నీ మాట వినపడితే' అనే పాటను కూడా హమ్ చేశారు. మొత్తంగా ఈ వీడియోలో బ్యాగ్రౌండ్ స్కోర్, విజువల్స్ అదిరిపోయేలా ఉన్నాయి. దీంతో ఈ వీడియోకు భారీ రెస్పాన్స్ వస్తోంది.

  మసాజ్ వీడియో షేర్ చేసిన హీరోయిన్: ఒంటిపై నూలుపోగు లేకుండా ఘోరంగా!

  క్రేజీ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న 'ఖుషి' మూవీకి సంబంధించిన రిలీజ్ డేట్‌ను కూడా చిత్ర యూనిట్ తాజాగా ప్రకటించింది. దీన్ని క్రిస్టమస్ కానుకగా ఈ ఏడాది డిసెంబర్ 23వ తేదీని ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయబోతున్నారు. అంతేకాదు, ఈ మూవీని తెలుగుతో పాటు తమిళం, కన్నడం, మలయాళంలో కూడా రిలీజ్ చేస్తున్నట్లు తాజాగా ప్రకటించారు. దీంతో విజయ్ దేవరకొండ అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. విడుదలకు సమయం దగ్గర పడడంతో చిత్ర యూనిట్ షూటింగ్‌ను మరింత స్పీడుగా పూర్తి చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

  ప్యూర్ లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న 'ఖుషి' మూవీ షూటింగ్ కశ్మీర్ ఏరియాలో శరవేగంగా సాగుతోంది. దీనికి సంబంధించిన అప్‌డేట్లను చిత్ర యూనిట్ ఇప్పటికే ఇచ్చేసింది. ఇక, ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యేర్నేని,రవిశంకర్ యలమంచిలి నిర్మిస్తున్నారు. దీనికి హిషామ్ అబ్దుల్ వాహబ్ సంగీతాన్ని అందిస్తున్నారు. జయరాం, సచిన్ ఖేడేకర్, మురళీ శర్మ, లక్ష్మీ, అలీ, రోహిణి, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ, శ్రీకాంత్ అయ్యంగార్, శరణ్య ప్రదీప్ తదితరులు నటిస్తున్నారు.

  English summary
  Vijay Devarakonda Now Doing Kushi Movie Under Shiva Nirvana Direction. Now This Movie First Look and Release Date Announced.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X