Just In
Don't Miss!
- Sports
ఇంటికి రాగానే దెబ్బ తగిలిన ప్రతి చోట ముద్దులు పెట్టింది: పుజారా
- News
Capital Gains Tax అంటే ఏంటి..? బడ్జెట్ వేళ పూర్తి వివరాలు మీకోసం..!
- Lifestyle
డయాబెటిస్ ఉన్నప్పటికీ సుదీర్ఘకాలం మరియు ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపడానికి ఇక్కడ కొన్ని ముఖ్యమైన చిట్కాలు ఉన్నాయ
- Finance
ఫ్యూచర్ గ్రూప్ డీల్, అమెజాన్‌కు షాక్: రిలయన్స్‌కు గుడ్‌న్యూస్, షేర్ జంప్
- Automobiles
భారత్‌లో అడుగుపెట్టిన కొత్త బిఎమ్‌డబ్ల్యూ 3 సిరీస్ గ్రాన్ లిమోసిన్; ధర & వివరాలు
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
యశ్ నుంచి అది దొంగిలిస్తా.. విజయ్ దేవరకొండ కామెంట్స్
కేజీఎఫ్ సినిమాతో సంచలనాలు సృష్టించిన కన్నడ రాక్ స్టార్ యశ్.. అన్ని ఇండస్ట్రీలను షేక్ చేశాడు. శాండిల్ వుడ్, కోలీవుడ్, టాలీవుడ్, బాలీవుడ్ అని తేడా లేకుండా ఎక్కడపడితే అక్కడ కుమ్మేసాడు. కేజీఎఫ్ ధాటికి ప్రపంచవ్యాప్తంగా కనక వర్షం కురిసింది. ఈ చిత్రం దాదాపు 250 కోట్లు కలెక్ట్ చేసినట్టు తెలుస్తోంది. కేజీఎఫ్ హిట్ కావడంతో చాప్టర్2ను మరింత జాగ్రత్తగా, అత్యంత భారీ ఎత్తున నిర్మిస్తున్నారు.

ఫస్ట్ లుక్‌తో ట్రీట్..
ఈ మూవీ నుంచి వచ్చే అప్‌డేట్ కోసం కొన్ని కోట్ల మంది రాకీ భాయ్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. అయితే ఈ మధ్య విడుదల చేసిన ఫస్ట్ లుక్ ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. తాజాగా ఈ మూవీ నుంచి టీజర్ కూడా రాబోతోన్నట్లు యశ్ ఇదివరకే ప్రకటించిన సంగతి తెలిసిందే.

రెండో వారంలో టీజర్
కొత్త్ ఏడాదిలో కేజీఎఫ్ అభిమానులకు, యశ్ ఫ్యాన్స్‌కు స్పెషల్ ట్రీట్ ఇవ్వబోతోన్నట్లు తెలుస్తోంది. ఓ వేడుకలో పాల్గొన్న యశ్‌ను చాప్టర్ 2కు సంబంధించి అప్‌డేట్ ఇవ్వాలని అడగ్గా.. జనవరి 8న టీజర్ రాబోతోన్నట్లు తెలిపాడు. ఫస్ట్ లుక్కే ఇంతటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుంటే టీజర్ వస్తే ఎలా ఉంటుందో మరి చూడాలి.

అది దొంగిలిస్తా..
ఇటీవల జరిగిన ఓ అవార్డు వేడుకలో టాలీవుడ్ స్టార్ విజయ్ దేవరకొండతోపాటు యశ్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ‘యశ్ నుంచి ఓ వస్తువును దొంగిలించమంటే దేన్ని దొంగిలిస్తారు?' అని విజయ్‌ను వేదికపై అడిగారు. దానికి ఆయన ఏ మాత్రం తడుముకోకుండా ‘ప్రశాంత్ నీల్' అని ప్రత్యేకమైన సమాధానం ఇచ్చారు.

కేజీఎఫ్3 పనులు..
అనంతరం విజయ్ నవ్వుతూ.. ‘ఆయన్ను దొంగిలిస్తే రహస్యంగా ‘కేజీఎఫ్ 3' పనులు మొదలుపెట్టొచ్చని' అంటూ జోక్ చేశారు. మరి విజయ్ కామెంట్‌కు యశ్ రియాక్షన్ ఎంటో చూడాలి.
విజయ్ ప్రస్తుతం ‘వరల్డ్ ఫేమస్ లవర్'సినిమా షూటింగ్‌తో బిజీగా ఉన్నారు. క్రాంతి మాధవ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఫిబ్రవరి 14న విడుదల కాబోతోంది.