Just In
- 2 hrs ago
ప్రదీప్ కోసం టాప్ యాంకర్స్.. చివరకు వారితో జంప్.. మొత్తానికి సద్దాం బక్రా!
- 3 hrs ago
ఆస్కార్ బరిలో ‘ఆకాశం నీ హద్దురా’.. సూర్య కష్టానికి ప్రతిఫలం లభించేనా?
- 4 hrs ago
అప్‌డేట్ ఇస్తావా? లీక్ చేయాలా?.. ఆచార్యపై కొరటాలను బెదిరించిన చిరంజీవి
- 5 hrs ago
నిద్రలేని రాత్రులెన్నో.. ఇప్పుడు నవ్వొస్తుంటుంది.. ట్రోల్స్‌పై సమంత కామెంట్స్
Don't Miss!
- News
కువైట్‌లో నారా లోకేష్ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించిన టీడీపీ నేతలు
- Sports
వైరల్ ఫొటో.. ధోనీ, సాక్షితో పంత్!!
- Automobiles
కొత్త సఫారి ఎస్యూవీ ఆవిష్కరించిన టాటా మోటార్స్; లాంచ్ ఎప్పుడంటే ?
- Finance
Budget 2021: పన్ను తగ్గించండి, తుక్కు పాలసీపై కూడా
- Lifestyle
మంగళవారం దినఫలాలు : వ్యాపారులకు ఈరోజు చాలా అదృష్టం కలిసి వస్తుంది...!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
థాయ్‌లాండ్‌లో రౌడీకి ప్రత్యేక శిక్షణ..రెగ్యులర్ షూటింగ్ అప్‌డేట్ ఇచ్చిన ఛార్మీ
టాలీవుడ్ సెన్సేషన్ స్టార్ విజయ్ దేవరకొండను ఇస్మార్ట్ దర్శకుడు పూరీ జగన్నాథ్.. నిర్మాత చార్మీ బాగానే వాడేస్తున్నారు. ఫైటర్ అంటూ విజయ్‌ను పూర్తిగా మార్చేసే పనిలో పడింది టీమ్. అందుకోసం విజయ్ ఒళ్లు హూనం చేసేందుకు సిద్దమైనట్టు తెలుస్తోంది. ఇస్మార్ట్ శంకర్ చిత్రం భారీ హిట్ సాధించిన తరువాత పూరీ ఎంచుకున్న లైన్, విజయ్ దేవరకొండ లాంటి రైజింగ్ స్టార్ ఆ కథకు ఓకే చెప్పడం లాంటివి ఈ ఫైటర్‌పై మంచి అంచనాలే పెంచాయి.

అవార్డుల జోరు..
మాస్ మసాలా చిత్రమైన ఇస్మార్ట్ శంకర్‌కు జీ సినీ వేడుకల్లో అవార్డుల పంట పండింది. ఇస్మార్ట్ శంకర్ సినిమాకు సెన్సేషనల్ డైరెక్టర్, నిర్మాత, మ్యూజిక్ డైరెక్టర్, హీరో ఇలా పలు విభాగాల్లో ఇస్మార్ట్ శంకర్‌ను వరించాయి. ఇంతటి ఘన విజయాన్ని చూసిన పూరి.. మళ్లీ అంతే కసితో ఫైటర్ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు.
|
ఫైటర్ కోసం ప్రత్యేక శిక్షణ
అయితే టైటిల్‌కు తగ్గట్టే.. ఈ చిత్రంలో విజయ్ ఫైటర్‌గా నటించబోతోన్నాడు. ఈ మేరకు విజయ్ మార్షల్ ఆర్ట్స్ లాంటి వాటిలో కఠినమైన శిక్షణ తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు విజయ్ కఠిన ఆహార నియమాల్ని పాటిస్తున్నట్లు టాక్. విజయ్‌కు ఈ ప్రత్యేకమైన కళల్లో శిక్షణ ఇచ్చేందుకు థాయ్లాండ్ తీసుకెళ్లింది చిత్రయూనిట్.

థాయ్‌లాండ్‌లో ప్రత్యక్షం..
ఈ మేరకు ట్రెయినర్‌తో మాట్లాడిస్తూ.. వాటి గురించి తెలియజెప్పింది. ఈ మేరకు విడుదల చేసిన వీడియో బ్యాక్ గ్రౌండ్‌లో కిక్ బాక్సింగ్ లాంటిది ఆడుతున్నారు. అయితే విజయ్ ఫైటర్‌గా మారిపోవడానికి ఇక ఎంతో సమయం లేదని తెలుస్తోంది. ఈ మేరకు షూటింగ్ అప్‌డేట్‌ను కూడా ఇచ్చేశారు.

జనవరి 20 నుంచి..
ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్‌ను జనవరి 20 నుంచి ప్రారంభించబోతోన్నట్లు ప్రకటించారు. ఈ మేరకు చిత్ర నిర్మాత అయిన ఛార్మీ ఈ వీడియోను విడుదల చేస్తూ అందులో తెలిపింది. ప్యాన్ ఇండియాగా ఈ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్న క్రమంతో బాలీవుడ్ హీరోయిన్‌ను తీసుకోవాలని చిత్రయూనిట్ భావించింది. అందులో భాగంగా జాన్వీ కపూర్‌ను సంప్రదించిందట. మరి ఈ మూవీకి సంబంధించిన ఇతర నటీనటులు, సాంకేతిక బృందం గురించి త్వరలోనే వెల్లడించనుంది.