Just In
- 11 min ago
తిరుపతిలో జాన్వీ కపూర్ పెళ్లి: లుంగీలో పెళ్లి కొడుకు దర్శనం.. సీక్రెట్ రివీల్ చేసిన శ్రీదేవి కూతురు
- 28 min ago
బెడ్‌కే పరిమితమైన నిహారిక.. ఆ గాయం అవ్వడంతో చైతన్య సేవలు
- 1 hr ago
Uppena 22 Days Collections: అన్ని సినిమాలున్నా తగ్గని ‘ఉప్పెన’.. వాటితో పోల్చితే కలెక్షన్లు ఎక్కువే
- 1 hr ago
సోషల్ మీడియాలో మరో రికార్డును అందుకున్న విజయ్ దేవరకొండ.. నెంబర్ వన్!
Don't Miss!
- Sports
India vs England: వణికిస్తున్న అశ్విన్, అక్షర్.. పెవిలియన్‌కు ఇంగ్లండ్ బ్యాట్స్‌మన్!
- Automobiles
కార్లలో ఇకపై ఫ్రంట్ ప్యాసింజర్ ఎయిర్‌బ్యాగ్ కూడా తప్పనిసరి: కేంద్రం
- News
రైతుల ఆందోళనకు 100రోజులు ... నల్లజెండాలతో నేడు బ్లాక్ డే పాటిస్తున్న రైతులు
- Finance
గుడ్‌న్యూస్: క్రిప్టోకరెన్సీ వినియోగంపై ఆలోచిస్తున్నాం..నిర్మలమ్మ ఏం చెప్పారంటే..?
- Lifestyle
శనివారం దినఫలాలు : ఓ రాశి ఉద్యోగులకు ఉన్నతాధికారులతో మంచి సమన్వయం ఉంటుంది...!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
నేను పెద్దోడినయ్యా.. కానీ ఆ విషయంలో ఇంకా చిన్న పిల్లాడినే: విజయ్ దేవరకొండ
రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా కె.ఎస్. రామారావు సమర్పణలో కె.ఎ. వల్లభ నిర్మించిన చిత్రం 'వరల్డ్ ఫేమస్ లవర్'. క్రాంతిమాధవ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా వాలంటైన్స్ డే కానుకగా ఫిబ్రవరి 14న విడుదల కానుంది. ఈ చిత్రంలో విజయ్ సరసన నలుగురు అందాల భామలు రాశి ఖన్నా, ఇసాబెల్లా, క్యాథెరిన్ ట్రెస్సా, ఐశ్వర్య రాజేష్ నటించారు.
ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్, ట్రైలర్ మూవీ రేంజ్ ఎలా ఉండబోతోందో చెప్పకనే చెప్పేశాయి. ఈ క్రేజీ అప్‌డేట్స్ చూసిన యువత 'వరల్డ్ ఫేమస్ లవర్' సినిమా విడుదల కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు మూవీ ప్రమోషన్స్ కోసం మాక్సిమమ్ టైమ్ కేటాయిస్తున్న విజయ్ దేవరకొండ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని ఆసక్తికరంగా మాట్లాడారు.

''గతంలో లవ్ అంటే నాన్సెన్స్ అనుకునేవాడిని. కానీ ఇప్పుడు జీవితంలో ప్రేమ అనేది శక్తిమంతమైన అనుభూతి అనే భావనలోకి వచ్చా. ప్రతి ఒక్కరూ జీవితంలో ప్రేమ అనే అనుభూతి ఆస్వాదించాల్సిందే. ప్రేమలో పడాల్సిందే. జీవితమంతా చూసుకుంటే తల్లితండ్రులు, భార్యాపిల్లలు, స్నేహితుల ప్రేమే గుర్తుంటుంది'' అని అన్నారు విజయ్ దేవరకొండ.
తాను 30 ఏళ్లు వచ్చాయని, పెద్దోడిని అయిపోయానని చెప్పిన విజయ్ దేవరకొండ.. పెళ్లి విషయానికి వచ్చేసరికి మాత్రం తానింకా చిన్న పిల్లాడినే అనిపిస్తోందని అన్నారు. ఇప్పుడు పెళ్లికి సిద్ధంగా లేనని, భవిష్యత్తులో చేసుకుంటానని అన్నారు విజయ్ దేవరకొండ.