బన్నీ సినిమా అందుకే ఒప్పుకోలేదు.. క్లారిటీ ఇచ్చిన విజయ్ సేతుపతి
టాలీవుడ్ పాన్ ఇండియా మూవీ పుష్ప సినిమా కోసం కేవలం బన్నీ అభిమానులే కాకుండా ఎంతో మంది సినీ ప్రముఖులు కూడా ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అల్లు అర్జున్ నటిస్తున్న మొదటి పాన్ ఇండియా సినిమా కావడంతో అంచనాల డోస్ అకాశాన్ని తాకుతున్నాయి. అయితే ఇలాంటి సినిమాలో ఒక పాత్ర కోసం సంప్రదించగా విజయ్ సేతుపతి ఎందుకు రిజెక్ట్ చేశాడు అనే విషయంలో అనేక రకాల రూమర్స్ వచ్చాయి.
ఆ రూమర్స్ పై ఎట్టకేలకు విజయ్ సేతుపతి క్లారిటీ ఇచ్చాడు. ఇటీవల తమిళ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పుష్ప ఆఫర్ గురించి మాట్లాడిన విజయ్ అందులో నటించాలని ఎంత ప్లాన్ చేసుకున్నా డేట్స్ అడ్జస్ట్ అవ్వలేదట. పైగా లాక్ డౌన్ కారణంగా వాయిదా పడిన షూటింగ్స్ మళ్ళీ వెంటనే పూర్తి చేయాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ఆ సినిమా చేయడానికి ఒప్పుకోలేదట.

విజయ్ సేతుపతి ఇచ్చిన క్లారిటీతో ఈ విషయంలో ఒక క్లారిటీ వచ్చినట్లయ్యింది. రెమ్యునరేషన్ కారణంగా పుష్ప సినిమాను రిజెక్ట్ చేశాడని వస్తున్న వార్తలకు ఫైనల్ గా చెక్ పడింది. ఇక పుష్ప సినిమాకు సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా సినిమాని మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది.


Click it and Unblock the Notifications











