twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఇది కదా ప్రభాస్ క్రేజ్ అంటే.. షోకి వంద టికెట్ల కావాలట.. ఇదెక్కడి లెక్క?

    |

    బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయిన ప్రభాస్ తాజా చిత్రం రాధేశ్యామ్. ఈ సినిమా దాదాపు మూడేళ్ల తర్వాత విడుదల అవుతూ ఉండడంతో పాటు సినిమా నుంచి వచ్చిన ప్రమోషనల్ స్టఫ్ కూడా ప్రేక్షకులకు బాగా నచ్చడంతో ఈ సినిమా మీద విపరీతమైన అంచనాలు ఏర్పడ్డాయి.. ఈ సందర్భంలో విజయవాడ మేయర్ "రాధేశ్యామ్" మూవీ కోసం 100 టికెట్లు కావాలంటూ రిక్వెస్ట్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. ఆ వివరాల్లోకి వెళ్తే

    టాక్ ఆఫ్ ది టౌన్

    టాక్ ఆఫ్ ది టౌన్

    యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటించిన పాన్ ఇండియా చిత్రం "రాధే శ్యామ్". అనేక సార్లు వాయిదా పడిన ఈ చిత్రం ఎట్టకేలకు శుక్రవారం థియేటర్లలోకి వచ్చింది. ఈ సినిమాకు సానుకూల స్పందన రావడంతో "రాధే శ్యామ్" టిక్కెట్లు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. ప్రస్తుతం ఈ చిత్రం సోషల్ మీడియాలో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది అనడంలో ఏమాత్రం సందేహం లేదు.

    విపరీతమైన ఆసక్తి

    విపరీతమైన ఆసక్తి

    సినిమాకి కొంచెం డివైడ్ టాక్ వచ్చింది కానీ సినిమా టికెట్ల కోసం విపరీతమైన పోటీ నెలకొంది. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో అయితే ఆన్లైన్ టిక్కెట్లు అయిపోవడంతో థియేటర్ల వద్ద చాలా మంది క్యూలు కడుతున్నారు పరిస్థితి కనబడుతోంది. చాలా కాలం తర్వాత ప్రభాస్ సినిమా రావడంతో అటు ప్రభాస్ అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులు కూడా ఈ సినిమా మీద విపరీతమైన ఆసక్తి చూపిస్తున్నారు.

    మల్టీప్లెక్స్ యాజమాన్యాలకు

    మల్టీప్లెక్స్ యాజమాన్యాలకు


    శుక్రవారం అయినా ఆఫీసులకు సెలవు పెట్టి మరీ ఈ సినిమా చూసేందుకు అభిమానులు ఆసక్తి చూపిస్తున్నారు అంటే ప్రభాస్ క్రేజ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే ప్రభాస్ రాధేశ్యామ్ విడుదల సమయంలో విజయవాడ మేయర్ కోరిన కోరిక టాలీవుడ్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. రాధే శ్యామ్ విడుదల నేపథ్యంలో విజయవాడ మేయర్ రాయన భాగ్య లక్ష్మి "రాధే శ్యామ్" మూవీ టికెట్స్ 100 కావాలంటూ విజయవాడలో ఉన్న అన్ని మల్టీప్లెక్స్ యాజమాన్యాలకు లేఖ రాశారు.

    డబ్బులు మాత్రం

    డబ్బులు మాత్రం

    ఆ లేఖలో కొత్త సినిమాలకు సినిమా టిక్కెట్లు ఏర్పాటు చేయాలని పార్టీ ప్రజాప్రతినిధులు, వార్డు కార్పొరేటర్లు కోరుతున్నారని, ఇప్పటి నుంచి విడుదలయ్యే ప్రతి సినిమాకు సంబంధించి 100 టికెట్లు మేయర్ ఛాంబర్‌కు పంపాలంటూ, దాని కోసం టికెట్ రేట్ ఎంత అయితే అంత డబ్బులు మాత్రం చెల్లిస్తామని చెప్పుకొచ్చారు. మేయర్ లేఖ సోషల్ మీడియాలో వైరల్‌గా మారి అందరి దృష్టిని ఆకర్షించింది. అయితే ఇది కేవలం ప్రభాస్ క్రేజ్ అని ఆయన అభిమానులు చెప్పుకుంటున్నారు.

    రాజకీయ వర్గాల్లో కూడా

    రాజకీయ వర్గాల్లో కూడా


    ప్రభాస్ కు ఎవరూ హేటర్స్ లేరు అని అందరు హీరోల అభిమానులు ప్రభాస్ ను కూడా అభిమానిస్తారు అని అందుకే భారీ స్థాయిలో టికెట్లు అవసరం కావడంతో ఇలా లేఖను విడుదల చేయాల్సి వచ్చిందని వారు సగర్వంగా చెప్పుకుంటున్నారు. మరో పక్క నిన్న మొన్నటి వరకూ తెలుగు సినీ పరిశ్రమను ఇబ్బంది పెట్టే విధంగా వ్యవహరించిన ఏపీ అధికార పార్టీకి చెందిన నేతలు ఇలా లేఖ రాయడం అనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది.

    English summary
    Vijayawada municipal mayor rayana bhagyalakshmi letter to multiplex management requesting Radheshyam tickets went viral on social media.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X