దుమ్మురేపుతున్న విశాల్.. తెలుగులోకి టెంపర్ రీమేక్
తెలుగులో పూరి జగన్నాథ్ రూపొందించిన టెంపర్ చిత్రం తమిళంలో రీమేక్ అయి ఘన విజయం దిశగా దూసుకెళ్తున్నది. ఈ చిత్రం ఆయోగ్య పేరుతో ఇటీవల విడుదలై భారీ కలెక్షన్లను రాబడుతున్నది. యువ హీరో విశాల్ ఈ చిత్రాన్ని ఆయోగ్య పేరుతో తెలుగులో విడుదల చేయడానికి రంగం సిద్ధం అవుతున్నది. ఈ సినిమా తెలుగు డబ్బింగ్ హక్కులను ప్రముఖ నిర్మాత మల్కాపురం శివకుమార్ సొంతం చేసుకొన్నారు. జూన్‌లో ఈ సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
వాస్తవానికి విశాల్ చిత్రం రెండు వారాల క్రితమే రిలీజ్ కావాల్సింది. కానీ ఆర్థిక పరిస్థితుల కారణంగా సినిమా విడుదల వాయిదా పడింది. ప్రస్తుతం ఇబ్బందులను ఎదుర్కొని ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఆయోగ్య చిత్రంలోని విశాల్ నటనకు సినీవర్గాలు, విమర్శకులు, ప్రేక్షకులతోపాటు అన్నివర్గాలు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. టెంపర్ రీమేక్ చిత్రానికి వెంకట్ మోహన్ దర్శకత్వం వహించారు. విశాల్‌తో రాశీఖాన్నా జతకట్టింది. సామ్ సీఎస్ సంగీతం అందించారు. టెంపర్ రీమేక్ హక్కులు సొంతం చేసుకొని తమిళంలో ఆయోగ్య పేరుతో నిర్మాత టాగోర్ మధు రూపొందించారు.

నటీనటులు: విశాల్, రాశీఖన్నా, పార్తీపన్, సంతాన భారతి, ఎంఎస్ భాస్కర్, యోగిబాబు, ఆనంద్ రాజ్, నరైన్, సోనియా అగర్వాల్
దర్శకుడు: వెంకట్ మోహన్
సినిమాటోగ్రఫి: కార్తీక్
డైలాగ్స్: రాజేష్ ఏ మూర్తి
ఎడిటర్: రూబెన్


Click it and Unblock the Notifications











