మోసగాళ్లు: కాజల్‌ని ఎలా చూపించారో మీరే చూడండి..

టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ లుక్ బయటపెట్టేశారు 'మోసగాళ్లు' యూనిట్ సభ్యులు. యంగ్ హీరో మంచు విష్ణు నిర్మిస్తున్న ఈ సినిమాలో విష్ణుతో పాటు కాజల్ లీడ్ రోల్ పోషిస్తోంది. చరిత్రలో అతిపెద్ద ఐటీ కుంభకోణాల్లో ఒకటిగా నిలిచిన స్కామ్ మిస్టరీని కథాంశంగా తీసుకొని హాలీవుడ్-ఇండియన్ మూవీగా ఈ సినిమాను రూపొందిస్తుండటం విశేషం.

మంచు విష్ణు అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్టుగా భావిస్తున్న ఈ 'మోసగాళ్లు' సినిమా నుంచి తాజాగా కాజల్ ఫస్ట్‌లుక్ విడుదల చేశారు మేకర్స్. చిత్రంలో కాజల్ పోషిస్తున్న పాత్ర పేరు ''అను'' అని ఈ పోస్టర్ ద్వారా తెలిపారు. ఈ వేసవిలో చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు పోస్టర్‌లో పేర్కొన్నారు. ఈ పిక్‌లో కాజల్ లుక్ వెరీ అట్రాక్ట్‌ఫుల్‌గా ఉండటంతో సినిమాపై ఒక్కసారిగా ప్రేక్షకులందరి కన్ను పడింది.

Vishnu Manchus Mosagallu : Kajal Aggarwal Look Released

ఇటీవలే అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లో షూటింగ్ జరిపిన చిత్ర యూనిట్.. ప్రస్తుతం చివరిదశ పనుల్లో ఉంది. ఈ చిత్రంలో విష్ణు పోషిస్తున్న క్యారెక్టర్ చాలా ఇన్టెన్స్‌గా, మునుపెన్నడూ చూడని విధంగా ఉంటుందని టాక్. జెఫ్రీ గీ చిన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నవదీప్, నవీన్ చంద్ర, బాలీవుడ్ స్టార్ సునీల్ శెట్టి ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. వైవిధ్యభరితమైన కాన్సెప్ట్ కావడంతో ఈ సినిమాపై అంచనాలు పెట్టుకున్నారు ప్రేక్షకులు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X