Don't Miss!
- Lifestyle
Chanakya Niti: జీవితంలో ఈ సుఖాలు అనుభవించాలంటే మంచి కర్మలు చేసుండాలి, అవేంటంటే..
- Automobiles
ఆల్టో కె10 ఎక్స్ట్రా ఎడిషన్ విడుదలకు సిద్దమవుతున్న మారుతి సుజుకి.. వివరాలు
- News
వైసీపీపై పోరాటంలో చంద్రబాబు కొత్త వ్యూహం - ఢిల్లీ కేంద్రంగా..!!
- Finance
Pakistan Crisis: ఓడరేవుల్లో సరుకులు.. పాకిస్థానీలకు మాత్రం ఆకలి కేకలు.. ఎందుకిలా..?
- Technology
హైదరాబాద్ లో Airtel 5G ప్లస్ అత్యధిక వేగం! స్పీడ్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
- Sports
INDvsNZ : ఇదేం ఆట? అంటూ.. హార్దిక్ పాండ్యాపై మండిపడుతున్న ఫ్యాన్స్..
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
AVA Entertainment సొంత బ్యానర్‌లో విష్ణు మంచు VM19, పాయల్, సన్నీలియోన్‌తో మూవీ.. జూన్ 10న ఫస్ట్‌లుక్
టాలీవుడ్‌లో అభిరుచి ఉన్న నటుడిగా, నిర్మాతగా ఎన్నో విభిన్నమైన చిత్రాలను విష్ణు మంచు అందించారు. తండ్రి మోహన్ బాబు వారసత్వాన్ని పుచ్చుకొని ఇప్పుడు సొంత బ్యానర్‌తో విలక్షణమైన చిత్రాలను అందించేందుకు, యువతరాన్ని ప్రోత్సాహించేందుకు AVA ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌తో ముందుకు వస్తున్నాడు. AVA బ్యానర్ ద్వారా సినిమాలే కాకుండా, డిజిటల్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్, డాక్యుమెంటరీ సిరీస్ నిర్మించేందుకు సిద్దమయ్యారు.
AVA మ్యూజిక్, AVA స్టూడియో ఏర్పాటు గురించి విష్ణు మంచు తన అభిప్రాయాలను పంచుకొన్నారు. AVA మ్యూజిక్ ద్వారా ఆల్బమ్స్ రూపొందించి సంగీత ప్రియులకు కొత్త అనుభూతిని పంచుతాం. AVA స్టూడియోను గొప్ప సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్ అందించే విధంగా అత్యాధునిక సాంకేతికతతో నిర్మిస్తున్నాం అని చెప్పారు.

AVA ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌ను ప్రకటిస్తూ.. తన కెరీర్‌లో 19వ చిత్రం.. ఇంకా పేరుపెట్టని సినిమాకు ఫస్ట్ లుక్, టైటిల్‌ను రిలీజ్ చేయనున్నారు. పూర్తిస్థాయి ఎంటర్‌టైన్‌మెంట్‌గా రూపొందుతున్న సినిమాకు ఈషాన్ సూర్య దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో పాయల్ రాజ్‌పుత్, సన్నీలియోన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. హైదరాబాద్‌లో ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతున్నది. ఈ సినిమా కోసం రామోజీ ఫిలిం సిటీలో ప్రత్యేకంగా ఓ సెట్‌ను నిర్మించి.. ప్రేమ్ రక్షిత్ కోరియోగ్రఫితో ఓ పాటను చిత్రీకరిస్తున్నారు. VM19 సినిమాకు రచన జీ నాగేశ్వర్ రెడ్డి, కోనా వెంకట్ స్క్రీన్ ప్లే, కథను అందించారు. అనూప్ రూబెన్ సంగీతం అందిస్తున్నారు.