For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Paagal ఓటీటీ రిలీజ్‌కు డేట్ ఫిక్స్: విశ్వక్ సేన్ మూవీ ఎందులో స్ట్రీమింగ్ కాబోతుందంటే!

  |

  తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంతో మంది హీరోలుగా ఎంట్రీ ఇస్తున్నారు. కానీ వారిలో చాలా తక్కువ మంది మాత్రమే మంచి గుర్తింపును అందుకుని సత్తా చాటుతున్నారు. తద్వారా ఫ్యాన్ ఫాలోయింగ్‌ను కూడా సంపాదించుకుంటున్నారు. ఇలా ఈ మధ్య కాలంలో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి దూసుకుపోతోన్న హీరోల్లో యంగ్ అండ్ టాలెంటెడ్ గాయ్ విశ్వక్ సేన్ ఒకడు. 'ఫలక్‌నామా దాస్' సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించిన అతడు.. ఆ వెంటనే నాని నిర్మించిన 'హిట్' మూవీతో భారీ విజయాన్ని అందుకున్నాడు. దీంతో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను అందుకున్నాడు.

  Mukku Avinash Engagement: నిశ్చితార్థం చేసుకుని షాకిచ్చిన అవినాష్.. ఆ అమ్మాయి ఎవరంటే!

  విభిన్నమైన చిత్రాలతో విలక్షణమైన పాత్రలు చేస్తూ మంచి పేరు సంపాదించుకున్న విశ్వక్ సేన్.. ఇటీవల 'పాగల్' అనే సినిమా చేశాడు. దీనికి ఆరంభం నుంచే అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. అందుకు అనుగుణంగానే ఈ మూవీ నుంచి విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలు వాటిని మరింతగా పెంచాయి. దీంతో ఈ సినిమా అందరి దృష్టిని ఆకర్షించింది. మరీ ముఖ్యంగా ఈ సినిమాలో దిల్ రాజు భాగం అవడంతో దీని రేంజ్ భారీగా పెరిగింది. అదే సమయంలో ఇండస్ట్రీలోనూ దీనిపై భారీ బజ్ ఏర్పడిపోయింది. దీంతో ఇది ఎన్నో అంచనాల నడుమ ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది.

  Vishwak Sens Paagal Streaming Strat From September 3rd

  గ్రాండ్‌గా రిలీజ్ అయిన 'పాగల్' మూవీకి ఆరంభంలో మంచి టాకే వచ్చింది. దీంతో విశ్వక్ సేన్ ఖాతాలో మరో హిట్ వచ్చి చేరుతుందని అంతా అనుకున్నారు. కానీ, ఆ తర్వాత దీనికి ప్రేక్షకుల ఆదరణ క్రమంగా తగ్గుతూ వచ్చింది. ఫలితంగా ఈ చిత్రం అనుకున్న స్థాయిలో ఆడలేదు. దీంతో ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా రూ. 5.45 కోట్లు షేర్‌తో పాటు రూ. 9.60 కోట్లు గ్రాస్ వచ్చింది. ఫలితంగా ఇది బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను చేరుకోలేదు. తద్వారా ఇది ఏవరేజ్‌ స్టేటస్‌తోనే సరిపెట్టుకుంది. ఈ చిత్ర ఫలితంతో విశ్వక్ సేన్‌తో పాటు అతడి ఫ్యాన్స్ నిరాశగానే ఉన్నారని చెప్పొచ్చు.

  బ్రా కూడా లేకుండా రెచ్చిపోయిన ప్రియాంక చోప్రా: అందాలు మొత్తం కనిపించేలా మరీ దారుణంగా!

  ఎంతో ప్రతిష్టాత్మకంగా వచ్చిన 'పాగల్' మూవీకి థియేటర్లలో పెద్దగా స్పందన రాకున్నా.. దీని డిజిటల్ స్ట్రీమింగ్ గురించి చాలా మంది వేచి చూస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా ఈ సినిమా స్ట్రీమింగ్ డేట్‌ను ప్రకటించారు. విశ్వక్ సేన్ నటించిన 'పాగల్' చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్ వీడియోలో సెప్టెంబర్ 3 నుంచి స్ట్రీమింగ్ చేయబోతున్నారు. ఈ మేరకు చిత్ర యూనిట్ ఓ పోస్టర్‌ను సైతం విడుదల చేసింది. అందులో 'మీ స్క్రీన్స్‌లో ఈ సినిమాను చూడండి' అంటూ రాసుకొచ్చారు. దీనిపై విశ్వక్ సేన్ మాస్ ఫ్యాన్స్‌తో పాటు ఫ్యామిలీ అభిమానులు ఎంతో సంతోషంగా ఉన్నారు.

  సరికొత్త కాన్సెప్టుతో ప్యూర్ లవ్ స్టోరీతో వచ్చిన 'పాగల్' మూవీని నరేష్ కుప్పిలి తెరకెక్కించాడు. ఇందులో నివేదా పేతురాజ్, సిమ్రన్ చౌదరి, మేఘలేఖ హీరోయిన్లుగా నటించారు. రాధాన్ సంగీతం అందించగా.. లియోన్ జేమ్స్ బ్యాగ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు సమర్పణలో బెక్కం వేణు గోపాల్ ఈ సినిమాను నిర్మించారు. ఇక, ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను అమెజాన్ ప్రైమ్ సంస్థ భారీ ధరకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.

  English summary
  Young Hero Vishwak Sen Now Did a Film Paagal Movie Under Naresh Kuppili Direction. This Movie Digital Streaming Strat From September 3rd on Amazon Prime.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X