For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఫ్యాన్సీ రేటుకు విశ్వామిత్ర.. జూన్ 14న రిలీజ్

|

ఫణి తిరుమలశెట్టి సమర్పణలో రాజకిరణ్ సినిమా పతాకంపై మాధవి అద్దంకి, రజనీకాంత్ ఎస్., రాజకిరణ్ నిర్మిస్తున్న సినిమా 'విశ్వామిత్ర'. నందితారాజ్, 'సత్యం' రాజేష్ జంటగా నటించారు. అశుతోష్ రాణా, ప్రసన్నకుమార్ ప్రధాన పాత్రలు పోషించారు. 'గీతాంజలి', 'త్రిపుర' వంటి థ్రిల్లర్ చిత్రాలతో ప్రేక్షకులను మెప్పించిన రాజకిరణ్ దర్శకత్వం వహించారు. ఇటీవల సినిమా సెన్సార్ పూర్తయింది. యు/ఎ సర్టిఫికేట్ లభించింది. జూన్ 14న చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

ఈ సందర్భంగా దర్శక, నిర్మాత రాజకిరణ్ మాట్లాడుతూ "సినిమా చూశాక సెన్సార్ సభ్యులు బావుందని మెచ్చుకున్నారు. సెన్సార్ బృందం ప్రశంసలు మా చిత్రబృందంలో సినిమాపై నమ్మకాన్ని మరింత పెంచాయి. ఈ సృష్టిలో ఏదైనా సాధ్యమే అని చెప్పే ప్రయత్నమే 'విశ్వామిత్ర'. మధ్యతరగతి అమ్మాయిగా నందిత, ఆమెకు సహాయం చేసే వ్యక్తి పాత్రలో 'సత్యం' రాజేష్, నందిత బాస్‌గా అశుతోష్ రాణా, నందిత స్నేహితుడిగా తమిళ నటుడు ప్రసన్న నటించారు అని తెలిపారు.

 Vishwamitra set to release the movie on June 14

ఆల్రెడీ సినిమా బిజినెస్ పూర్తయింది. అలాగే, సినిమా హిందీ, తెలుగు శాటిలైట్ హక్కులను ప్రముఖ ఛానల్ 'జీ తెలుగు' మంచి ఫ్యాన్సీ రేటుకు సొంతం చేసుకుంది. లవ్ థ్రిల్లర్ జానర్ లో, వాస్తవ ఘటనల ఆధారంగా... 'గీతాంజలి', 'త్రిపుర' తరహాలో థ్రిల్లింగ్ కాన్సెప్ట్ తో రూపొందించాం. ఫ్యామిలీ అంతా కలిసి చూడదగ్గ సినిమా అని రాజ కిరణ్ అన్నారు.

 Vishwamitra set to release the movie on June 14

నటీనటులు: విద్యుల్లేఖ రామన్, చమ్మక్ చంద్ర, 'కార్టూనిస్ట్' మల్లిక్, జీవా, రాకెట్ రాఘవ, సి.వి.ఎల్ నరసింహారావు, ఇందు ఆనంద్ తదితరులు

మాటలు: వంశీకృష్ణ ఆకెళ్ళ

ఫోటోగ్రఫీ: అనిల్ బండారి

ఎడిటర్: ఉపేంద్ర

మ్యూజిక్: అనూప్ రూబెన్స్

యాక్షన్: డ్రాగన్ ప్రకాష్

కొరియోగ్రఫీ: సుచిత్ర - భాను

ఆర్ట్: చిన్నా

కో-డైరెక్టర్: విజయ్ చుక్కా

పి.ఆర్.ఓ: సురేంద్ర కుమార్ నాయుడు - ఫణి కందుకూరి,

నిర్మాతలు: మాధవి అద్దంకి, రజనీకాంత్, రాజకిరణ్

కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: రాజకిరణ్.

English summary
'Vishwamitra' is a suspense thriller directed by Raajkiran of 'Geethanjali' and 'Tripura' fame, the film's story links the creation and human imagination.Starring also Nandita Raj, Sathyam Rajesh, Prasanna Kumar and Ashutosh Rana, the film is presented by Phani Tirumalashetty. The exciting thriller is produced by Madhavi Addanki, S Rajinikanth and Raajkiran. The film has completed its Censor formalities. It has got 'U/A' certificate. The makers are planning to release the movie on June 14..
 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more