Don't Miss!
- News
Vastu tips: ఇంటికెళితే చిరాకులా.. అన్నీ సమస్యలా.. బయటపడేందుకు చెయ్యాల్సిందిదే!!
- Sports
విరాట్ కోహ్లీ-రోహిత్ శర్మ మధ్య విభేదాలు నిజమే: మాజీ ఫీల్డింగ్ కోచ్ శ్రీధర్
- Finance
adani issue: అదానీ వ్యవహారంపై స్పందించిన కేంద్ర మంత్రి.. హెచ్చుతగ్గులు సాధారణమేనంటూ వ్యాఖ్యలు
- Lifestyle
మీ సెక్స్ జీవితాన్ని మెరుగుపరచుకోవడానికి ఇలా చేయండి..సెక్స్ లో ఆనందాన్ని పొందండి!
- Technology
ఐఫోన్ 14 పై రూ.12000 వరకు ధర తగ్గింది! ఆఫర్ ధర ,సేల్ వివరాలు!
- Travel
ఏపీలో ఆధ్యాత్మిక పర్యాటకానికి టూరిజం శాఖ సరికొత్త రూట్ మ్యాప్!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
Waltair Veerayya ట్రైలర్ డేట్ వచ్చేసింది.. ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడు? ఎక్కడంటే?
మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమా జనవరి 13వ తేదీన గ్రాండ్ గా విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ అయితే సినిమాపై అంచనాలను మరింతగా పెంచేస్తున్నాయి. ప్రస్తుతం ఫ్యాన్స్ కూడా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కోసం అలాగే ట్రైలర్ కోసం కూడా ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఇక వాటికోసం కూడా నిర్మాత అన్ని ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. ఇక ట్రైలర్ ఎప్పుడు విడుదల కాబోతోంది అలాగే ఈవెంట్ ఎక్కడ జరగబోతోంది అనే వివరాల్లోకి వెళితే..

మాస్ కమర్షియల్ మూవీగా..
మెగాస్టార్ చిరంజీవి హీరోగా అలాగే మాస్ మహారాజ్ రవితేజ మరొక ముఖ్యమైమ పాత్రలో నటించిన వాల్తేరు వీరయ్య సినిమాలో శృతిహాసన్ మేయిన్ హీరోయిన్ గా నటించింది. బాబీ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ భారీ బడ్జెట్ సినిమాపై అంచనాలు అయితే మామూలుగా లేవు. పూర్తి స్థాయిలో మాస్ కమర్షియల్ మూవీగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

పెరుగుతున్న అంచనాలు
ముఖ్యంగా ఈ సినిమాలో రవితేజ ఉండడంతోనే అంచనాలు తారస్థాయికి చేరిపోయాయి. ఫ్యాన్స్ ఎలాగైతే ఈ హీరోలను చూడాలని అనుకుంటున్నారో దర్శకుడు బాబి వారిని అదే విధంగా ప్రజెంట్ చేయబోతున్నట్లుగా ఇదివరకే క్లారిటీ ఇచ్చారు. ఇక ఇప్పటివరకు విడుదలైన సాంగ్స్ తో పాటు పోస్టర్స్ కూడా మరింతగా అంచనాలను పెంచేశాయి. తప్పకుండా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది అని అనిపిస్తోంది.

క్యాన్సిల్ అయ్యే అవకాశం?
అయితే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది అలాగే ట్రైలర్ ఎప్పుడు రానుంది అనే విషయంలో కూడా చిత్ర యూనిట్ సభ్యులు అధికారికంగా ఒక క్లారిటీ అయితే ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ లోనే ఈ సినిమా ఈవెంట్ నిర్వహించాలని ముందుగానే ఒక నిర్ణయానికి వచ్చారు. అయితే అందుకోసం అనుమతులు రాకపోవచ్చు అని కూడా ఒక టాక్ అయితే వినిపించింది. కానీ మొత్తానికి నిర్మాతలు అధికారులను కలిసి అనుమతి తీసుకున్నారు.

ట్రైలర్ డేట్ ఫిక్స్
ముందుగా అయితే ఫ్యాన్స్ ఎక్కువగా వాల్తేరు వీరయ్య ట్రైలర్ కోసమే ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అసలైతే న్యూ ఇయర్స్ సందర్భంగా ఈ ట్రైలర్ విడుదల చేయబోతున్నట్లు మొదట టాక్ అయితే వినిపించింది. కానీ చిత్ర యూనిట్ సభ్యులు మాత్రం జనవరి 7వ తేదీన ట్రైలర్ విడుదల చేయాలని ఫిక్స్ అయ్యారు. అందుకు సంబంధించిన పనులు కూడా మొత్తంగా పూర్తయ్యాయి.
|
మాస్ పూనకాలు.. ఈవెంట్ ఎక్కడంటే
ఇక ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల కారణంగా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కోసం అనుమతులు రావని అందరు అనుకున్నారు. అయితే నిర్మాతలు ప్రత్యేకంగా ప్రభుత్వ అధికారులతో మాట్లాడి అనుమతులు తీసుకువచ్చారు. ఇక మొదట అయితే ఈనెల ఎనిమిదవ తేదీన విశాఖ ఆర్కే బీచ్ లో ఈవెంట్ లో నిర్వహించాలని అనుకున్నారు. కానీ ఇప్పుడు ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్ లో ఏర్పాటు చేయాలని పోలీసుల నిర్ణయం ప్రకారం అనుమతులు తీసుకున్నట్లు తెలుస్తోంది.