'Who Is Balakrishna' Trending: చిచ్చు పెట్టిన బాలయ్య వ్యాఖ్యలు: నటసింహంపై దారుణమైన ట్రోలింగ్..
నందమూరి బాలకృష్ణ ఇండస్ట్రీలో జరిగే వివాదాలపై పెద్దగా స్పందించరు గాని ఆయన ఏదో ఒకసారి కామెంట్ చేశారు అంటే మామూలుగా ఉండదు. మీడియాలో దుమారం రేగడం పక్కన పెడితే సోషల్ మీడియాలో ఆ కామెంట్స్ కూడా ఒక రేంజ్ లో వైరల్ అవుతుంటాయి. ఇక ఇటీవల బాలకృష్ణ ఏ ఆర్.రెహమాన్ ఎవరో తనకు తెలియదని చేసిన కామెంట్ నేషనల్ వైడ్ గా వైరల్ అయ్యింది. ఒకవైపు రెహమాన్ ఫ్యాన్స్, మరోవైపు బాలయ్య అభిమానులు ఏకధాటిగా మాటల యుద్ధంలోకి దిగారు.

పదేళ్లకోకసారి హైలెట్ అయ్యేవారు
నందమూరి బాలకృష్ణ రాజకీయ నాయకుడిగా అనుభవం ఉన్నప్పటికీ ఆయన ప్రత్యర్ధులపై కామెంట్స్ చేయడం చాలా తక్కువ. ఒకవేళ కౌంటర్స్ వేస్తే మాత్రం ఎదో ఒక విధంగా వైరల్ అవ్వడం కామన్. ఇక రెహమాన్ లాంటి ఆస్కార్ విన్నర్ ను పదేళ్లకోకసారి హైలెట్ అయ్యేవారు అంటూ పరోక్షంగా కామెంట్ చేయడం అందరిని ఆశ్చర్యపరిచింది.

రెహమాన్ ఎవరో నాకు తెలియదు
ఇటీవల ఆదిత్య 369 సినిమా విడుదలై 30 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చిన బాలకృష్ణ ఇళయరాజా సంగీతం గురించి గొప్పగా మాట్లాడారు. ఇక రెహమాన్ లాంటి వారు ఎవరో కూడా తనకు సరిగ్గా తెలియదని, పదేళ్లకోకసారి హిట్స్ ఇచ్చే వారి గురించి పెద్దగా పట్టించుకోను అని కామెంట్ చేశాడు. అలాగే భారతరత్న ఎన్టీఆర్ కాలి గోటితో సమానం అంటూ వ్యాఖ్యలు చేయడం సరికొత్త వివాదానికి దారి తీసింది.

బాలకృష్ణ ఎవరు
ఇక బాలకృష్ణ అలా అనగానే ఒక్కసారిగా ఏఆర్.రెహమాన్ అభిమానులు కౌంటర్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. అసలు ఈ బాలకృష్ణ ఎవరు అంటూ who is balakrishna అనే ట్యాగ్ ను ట్రెంట్ అయ్యేలా చేస్తున్నారు. కొన్ని గంటల్లోనే ఆ ట్యాగ్ నేషనల్ లెవెల్లో ట్రెండ్ అయ్యింది.

రెహమాన్ ఫ్యాన్స్ ఆగ్రహం
ఆస్కార్ అవార్డును అందుకొని దేశానికి గర్వకారణం అయినటువంటి ఒక ఉన్నతమైన సంగీత దర్శకుడిపై అలాంటి కామెంట్స్ చేయడం కరెక్ట్ కాదని అంటున్నారు. బాలకృష్ణ వెంటనే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని కూడా రెహమాన్ ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు.

రంగంలోకి నందమూరి అభిమానులు
ఇక బాలకృష్ణ ఎవరు అనే ట్యాగ్ ట్రెండ్ అవ్వగానే నందమూరి అభిమానులు కూడా కౌంటర్ ఇస్తున్నారు. బాలకృష్ణపై గతంలో అగ్ర హీరోలు చేసిన పాజిటివ్ కామెంట్స్ ను షేర్ చేస్తున్నారు, సూర్య, యువరాజ్ సింగ్, అమితాబ్ బచ్చన్ వంటి వారు బాలయ్యకు ఆప్తమిత్రులు అంటూ బాలయ్యకు అండగా ఉంటున్నారు. మరి ఈ ట్రోలింగ్స్ పై బాలకృష్ణ ఏ విధంగా స్పందిస్తాడో చూడాలి.


Click it and Unblock the Notifications











