కృష్ణానదిలో కృష్ణ ఆస్థికలు నిమజ్జనం.. మహేష్ బాబుతో ఆ గొడవ వల్లే నరేష్ దూరంగా!

సూపర్‌స్టార్ కృష్ణ ఆకస్మిక మరణం ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినీ అభిమానులను తీవ్ర విషాదంలోకి నెట్టింది. ఆరు దశాబ్దాలుగా 350 చిత్రాలకుపైగా నటించిన కృష్ణ ఇకలేరనే విషయాన్ని జీర్ణించుకోలేని స్నేహితులు, సన్నిహితులు, అభిమానులు తీవ్ర దిగ్బ్రాంతికి లోనయ్యారు. అయితే కృష్ణ మృతి నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అధికార లాంఛనాలతో అంత్యక్రియలను హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో నిర్వహించింది. కృష్ణ మరణం తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు తన తండ్రికి సంబంధించిన కార్యక్రమాలను నిర్వహిస్తుండటం తెలిసిందే. అయితే కృష్ణ మృతి తర్వాత మహేష్, వీకే నరేష్ మధ్య విభేదాలు తలెత్తాయనే విషయం మీడియాలో వైరల్ అయింది. ఆ వివరాల్లోకి వెళితే..

తండ్రి కృష్ణ ఆకస్మిక మరణంతో

తండ్రి కృష్ణ ఆకస్మిక మరణంతో

సూపర్ స్టార్ మహేష్ జీవితం గతేడాది కాలంగా భారీ కుదుపులకు లోనైంది. తొలుత సోదరుడు రమేష్ బాబు, ఆతర్వాత తల్లి ఇందిరా దేవీ మరణించి తీవ్ర విషాదాన్ని మిగిల్చారు. ఇద్దరి మరణ విషాదం నుంచి ఇంకా కోలుకోకముందే తండ్రి కృష్ణ ఆకస్మిక మరణం మరింత కుంగదీసింది. అయితే కృష్ణ మరణాంతరం విజయనిర్మల కుమారుడు వీకే నరేష్ చేసిన ఓవరాక్షన్ మహేష్ బాబును ఇబ్బందికి గురి చేసిందనే వార్తలు గుప్పుమన్నాయి.

వీకే నరేష్, పవిత్ర లోకేష్ అత్యుత్సాహం

వీకే నరేష్, పవిత్ర లోకేష్ అత్యుత్సాహం

కృష్ణ పార్ధీవదేహాన్ని సందర్భకుల కోసం వీకే నరేష్ నివాసంలో ఉంచారు. అయితే అభిమానులు, సినిమా, రాజకీయ ప్రముఖులు తమ అభిమాన నటుడిని కడసారి చూసేందుకు వచ్చిన సమయంలో వీకే నరేష్, తన జీవిత భాగస్వామి పవిత్ర లోకేష్‌తో చేసిన హడావిడిపై అందరూ అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే వారిద్దరి వ్యవహారం మహేష్ బాబుకు నచ్చలేదని సినీ వర్గాలు వెల్లడించాయి.

హరిద్వార్‌లో కృష్ణ అస్థికల నిమజ్జనం

హరిద్వార్‌లో కృష్ణ అస్థికల నిమజ్జనం

అయితే తండ్రి కృష్ణ మరణాంతరం ఆయన అస్థికలను పలుచోట్ల నిమజ్జనం చేసే కార్యక్రమంలో మహేష్ బాబు తలమునకలై ఉన్నారు. ఇటీవల ఉత్తర భారతంలోని హరిద్వార్‌లో కృష్ణ అస్థికలను నిమజ్జనం చేశారు. ఇటీవలే ఆయన చిన కర్మను కూడా జరిపించడం తెలిసిందే.

విజయవాడలో కృష్ణనదిలో నిమజ్జనం

విజయవాడలో కృష్ణనదిలో నిమజ్జనం

ఉత్తర భారత పర్యటన తర్వాత కృష్ణ అస్థికలను కృష్ణా నదిలో కలిపేందుకు మహేష్ బాబు తన కుటుంబ సమేతంగా విజయవాడకు వెళ్లారు. మహేష్ బాబు వెంట బావలు సంజయ్ స్వరూప్, సుధీర్ బాబుతోపాటు నిర్మాతలు నాగవంశీ, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కనిపించారు. అయితే ఈ ఆస్థికల నిమజ్జన కార్యక్రమంలో వీకే నరేష్ కనిపించకపోవడంపై అనేక ఊహాగానాలు మీడియాలో వినిపించాయి.

వీకే నరేష్‌ చేష్టలతో కృష్ణ ఫ్యామిలీ మనస్తాపం

అయితే కృష్ణ మరణాంతరం కార్యక్రమాలకు వీకే నరేష్ దూరంగా ఉండటానికి కారణం పవిత్ర లోకేష్.కృష్ణ పార్ధీవ దేహం వద్ద పవిత్ర లోకేష్‌తో కలిసి వీకే నరేష్ చేసిన అతి చనువు, అత్యుత్సాహం సూపర్ స్టార్ కుటుంబ సభ్యులను మనస్తాపానికి గురిచేసింది. గొప్ప నటుడు చనిపోయి అందరూ బాధలో ఉంటే.. వీకే నరేష్, పవిత్ర లోకేష్ చేతులు పట్టుకొని అక్కడ తిరగడం అందరికి ఎబ్బెట్టుగా ఉంది. అందుకే వీకే నరేష్‌ను దూరంగా పెట్టారు అని సీనియర్ జర్నలిస్టు ఇమంది రామారావు అభిప్రాయపడ్డారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X