గర్బవతిగా ఉండగా చంపే ప్రయత్నం.. బ్యాగులో వాడేసిన కండోమ్స్: యువ హీరోపై భార్య ఫిర్యాదు
తెలుగు సినిమా పరిశ్రమకు ఇటీవల పరిచయమైన యువ హీరో ధర్మ మహేష్‌పై ఆయన భార్య సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రేమించి పెళ్లి చేసుకొన్న ఆయన చాలా మందితో అక్రమ సంబంధాలు పెట్టుకొని చెడు తిరుగుళ్లు తిరుగుతున్నాడు అని ఆరోపించింది. హైదరాబాద్‌లోని పోలీస్ స్టేషన్‌లో గృహ హింస, ప్రాణ భయం అంశాలపై కేసు నమోదు చేశారు. అనంతరం పలు మీడియా ఛానెల్స్‌తో మాట్లాడుతూ.. డ్రింకర్ సాయి అనే సినిమాలో హీరోగా నటించిన ధర్మ మహేష్‌కు నాకు 2013 నుంచి పరిచయం ఉంది. మాది ప్రేమ వివాహమే. కానీ హీరో అయ్యాక ధర్మ మహేష్ పూర్తిగా మారిపోయాడు అని గౌతమి తెలిపారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ..
నా భర్త ధర్మ అమ్మాయిలతో అర్ధరాత్రి వరకు ఎంజాయ్ చేస్తాడు. సినిమా హీరోగా మారక ఆయన అసలు స్వరూపం బయటపడింది. సినిమాలో నటించిన అమ్మాయిలు, ఇతర మహిళలు ఫ్లాట్‌కు వచ్చే వారు. అర్ధరాత్రి వరకు వారితో గడిపేవాడు.ఆయన చీటింగ్ వ్యవహారంతో ఎంతో మంది జీవితాలు నాశనం అవుతున్నాయి. నా భర్త బయటకు వెళ్లి ఇంటికి వచ్చేటప్పుడు నలుగురు అమ్మాయితో తిరిగి వచ్చేవాడు. నేను గర్బవతిగా ఉన్నప్పుడు నన్ను చంపడానికి ప్రయత్నించాడు అని గౌతమి ఆరోపించింది.

నా భర్త చెల్లెలు నాపై, నా కొడుకుపై బెదిరింపులకు పాల్పడింది. నీ కొడుకు ఐదేళ్లు మాత్రమే బతుకుతాడని వార్నింగ్ ఇచ్చింది. నా కొడుకు వందేళ్లు బతుకుతాడు. నేను ఆమెకు ఛాలెంజ్ చేస్తున్నాను. నా బిడ్డను ఏమీ చేయలేవు. మీ ఇంటికి ఆడబిడ్డగా వస్తే.. నీ ఇలా బెదిరిస్తావా? నా బిడ్డ జోలికి వస్తే.. తల్లి ఏం చేస్తుందో నీకు తెలియదా? తల్లిగా నా బిడ్డను రక్షించుకోవడానికి ఏం చేయాలో తెలియదా? ఓ పసిబిడ్డ ప్రాణాలు తీయడానికి ప్రయత్నిస్తారా? అని ఆమె ప్రశ్నించారు.
నాకు నా భర్త ఆస్తులు తనకు వద్దు. తన బిడ్డను మాత్రం వదిలేయండి. ధర్మ మహేష్‌తో విడాకులు తీసుకోవడానికి సిద్దంగా ఉన్నాను. తనను వేధించడం ఆపకుంటే తగిన విధంగా బుద్ది చెబుతాను. నా ఫిర్యాదుపై పోలీసులు విచారణ జరుపుతున్నారు అని ఆమె తెలిపారు.


Click it and Unblock the Notifications











