twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Oscar Nominations 2022 లో చోటు దక్కించుకొన్న భారతీయ చిత్రం.. ఆ మూవీ పేరు ఏంటో తెలుసా?

    |

    భారతీయ సినీ ప్రేక్షకులకు శుభవార్త. 94వ అకాడమీ అవార్డ్స్ నామినేషన్స్‌లో జై భీమ్ సినిమాకు చోటు దక్కకపోవడంతో నిరాశకు గురైన అభిమానులకు ఊరట కలిగించే వార్త ముందుకు వచ్చింది. రింటూ థామస్, సుస్మిత్ ఘోష్ దర్శకత్వం వహించిన రైటింగ్ విత్ ఫైర్ డ్యాక్యుమెంటరీ ఉత్తమ డాక్యుమెంటరీ విభాగంలో ఎంపికైంది. ఇంకా ఈ విభాగంలో అసెన్షన్, అట్టికా, ఫ్లీ అండ్ సమ్మర్ ఆఫ్ సోల్ లాంటి చిత్రాలు పోటీలో ఉన్నాయి.

    రైటింగ్ విత్ ఫైర్ డాక్యుమెంటరీ జర్నలిస్టుల జీవితం నేపథ్యంగా తెరకెక్కించారు. దళిత మహిళ నిర్వహించే కబర్ లహరియా న్యూస్ పేపర్‌ను 14 ఏళ్లు ఏకధాటిగా నడిపిన తర్వాత.. ప్రింట్ నుంచి డిజిటల్ ఫ్లాట్‌ఫాం షిఫ్ట్ అవుతుంది. స్మార్ట్‌ఫోన్ల యుగంలోకి అడుగుపెట్టిన తర్వాత జరిగిన పరిణామాలను డాక్యుమెంటరీగా రూపొందించారు. 2022 ఆస్కార్ అవార్డు కోసం ఎంపికైన ఏకైక భారతీయ చిత్రంగా ఘనతను సంపాదించింది.

    Writing With Fire Documentary selected for Oscar Nominations 2022 from India

    రైటింగ్ విత్ ఫైర్ చిత్రాన్ని ఘోష్ అండ్ థామస్ బ్లాక్ టికెట్ ఫిల్మ్స్ బ్యానర్‌పై తెరకెక్కించారు. 2021 సండేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శించగా ఆడియెన్స్ అవార్డు, స్పెషల్ జ్యూరీ అవార్డ్ అనే రెండు అవార్డులను దక్కించుకొన్నది.

    ఇంకా పలు చలనచిత్రోత్సవాల్లో రైటింగ్ విత్ ఫైర్ డాక్యుమెంటరీని ప్రదర్శించగా పలు అవార్డులు లభిచాయి. ఈ డాక్యుమెంటరీకి 28 అంతర్జాతీయ అవార్డుల లభించాయి. న్యూయార్క్ టైమ్స్, వాషింగ్టన్ పోస్ట్ లాంటి అంతర్జాతీయ పత్రికలు ఈ డాక్యుమెంటరీపై ప్రశంసలు కురిపించాయి. జర్నలిజం కథా నేపథ్యంగా ఇప్పటి వరకు వచ్చిన చిత్రాల్లో అత్యంత స్పూర్తి కలిగించిన మూవీ అని ప్రశంసించారు.

    English summary
    Oscars Nominations 2022: 94th annual Academy Awards nominattions are going high. Here are the The Academy of Motion Picture Arts and Sciences nominations list. Writing With Fire Documentary selected for Oscar Nominations 2022 from India
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X