Just In
Don't Miss!
- News
శివమొగ్గలో భారీ పేలుడు: 15 మంది మృతి?, భూమి కంపించడంతో భయంతో జనం పరుగులు
- Finance
తగ్గిన బంగారం ధర, పెరిగిన వెండి ధర: రూ.50,000 దిగువనే బంగారం
- Sports
సొంతగడ్డపై భారత్‌ను ఓడించడం కష్టమే: జోరూట్
- Automobiles
ఉత్పత్తిలో '100 మిలియన్' రికార్డ్ కైవసం : హీరోమోటోకార్ప్
- Lifestyle
Happy Republic Day 2021 :మనందరికీ ప్రేరణనిచ్చే ఈ మెసెజెస్ తో ‘రిపబ్లిక్ డే’ విషెస్ చెప్పండిలా...
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
సుశాంత్ మృతితో డబ్ల్యూ డబ్ల్యూ వ్రెస్లర్ జాన్ సెనా షాక్.. ఎమోషనల్‌గా శ్రద్దాంజలి
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణంపై హాలీవుడ్ ప్రముఖులే కాకుండా అంతర్జాతీయ క్రీడాకారులు కూడా తమ తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. ఆదివారం బాంద్రాలో మరణించిన యువ హీరోకు అమితాబ్, షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్ లాంటి ప్రముఖులు ట్వీట్స్‌తో శ్రద్దాంజలి ఘటించారు. హాలీవుడ్ మీడియా కూడా సుశాంత్ మరణంపై భారీగా కథనాలు వెలువరించింది. ఈ క్రమంలో
డబ్ల్యూ డబ్ల్యూ వ్రెస్లర్ జాన్ సెనా కూడా తన సంతాపాన్ని ప్రకటించారు.
సుశాంత్ సింగ్ బ్లాక్ అండ్ వైట్ ఫోటో పెట్టి తన ఇన్స్‌టాగ్రామ్‌లో డబ్ల్యూ డబ్ల్యూ వ్రెస్లర్ జాన్ సెనా శ్రద్దాంజలి ఘటించారు. భావోద్వేగమైన మెసేజ్‌ను పెట్టారు. సుశాంత్ సార్ మరణాన్ని తట్టుకోవడం చాలా కష్టంగా మారింది అంటూ జాన్ సెనా మెసేజ్ పెట్టారు.

ఇదిలా ఉండగా, సుశాంత్ మరణంపై విదేశీ మీడియా కూడా పెద్ద ఎత్తున కవరేజ్ ఇచ్చింది. సుశాంత్ గురించి విశ్లేషణాత్మకమైన కథనాలను వెలువరించింది. హాలీవుడ్ నటులు కొందరు సుశాంత్‌కు శ్రద్దాంజలి ఘటించారు.
జూన్ 14న ముంబైలోని బాంద్రాలో ఉన్న తన నివాసంలో ఉరివేసుకొని మరణించారు. దాంతో హిందీ చిత్ర పరిశ్రమ తీవ్ర దిగ్బ్రాంతికి లోనైంది. రెండుగంటలపాటు నిర్వహించిన పోస్టు మార్టమ్‌ను వీడియోగా చిత్రీకరించారు. జూన్ 15వ తేదీన ముంబైలోని విల్లే పార్లేలోని శ్మశాన వాటికలో అంత్యక్రియలను పూర్తి చేశారు. సుశాంత్‌కు శ్రద్దాకపూర్, కృతిసనన్, ఏక్తా కపూర్, వివేక్ ఒబెరాయ్, ఉదిత్ నారాయణ్ తదితరులు చివరి వీడ్కోలు పలికారు.