నాపేరు సూర్య, రేసు గుర్రం ఫేం విక్రమ్ సహిదేవ్ హీరోగా 'ఎవడు తక్కువకాదు'

అల్లు అర్జున్ హీరోగా వచ్చిన 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా' మూవీలో అన్వర్ పాత్రలో తన నటనతో ఆకట్టుకున్న విక్రమ్ సహిదేవ్, అంతకు ముందు 'రేసుగుర్రం'లో బన్నీ చిన్నప్పటి పాత్రలో నటించాడు. ఇప్పుడు విక్రమ్ సహిదేవ్ హీరోగా ఓ సినిమా రాబోతోంది.

'ఎవడు తక్కువ కాదు'... టైటిల్‌తో రూపొందుతున్న చిత్రంలో విక్రమ్ సహిదేవ్ ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. 'ఎ స్టోరీ ఆఫ్ బ్రేవ్ హార్ట్' అనేది ఈ మూవీ ఉపశీర్షిక. రఘు జయ దర్శకుడు. లగడపాటి శిరీష సమర్పణలో రామలక్ష్మి సినీ క్రియేషన్స్ పతాకంపై లగడపాటి శ్రీధర్ నిర్మాణంలో ఈ చిత్రం రూపొందుతోంది.

Yevadu Takkuva Kadu with Lagadapati Vikram Sahidev as main lead

తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశఆరు. విక్రమ్ సహిదేవ్ ప‌వ‌ర్‌ఫుల్ ఎక్స్‌ప్రెష‌న్‌ ఆకట్టుకునే విధంగా ఉంది. నిర్మాత లగడపాటి శ్రీధర్ మాట్లాడుతూ "ఎ స్టోరీ ఆఫ్ బ్రేవ్ హార్ట్... అనేది ప్రధాన పాత్రలో నటిస్తున్న విక్రమ్ సహిదేవ్ క్యారెక్టర్‌కు ఫ‌ర్‌ఫెక్ట్‌గా సూట్ అవుతుందని తెలిపారు.

Yevadu Takkuva Kadu with Lagadapati Vikram Sahidev as main lead

న్యూ ఏజ్ రివెంజ్ డ్రామా ఇది. బాల నటుడిగా ఆకట్టుకున్న మా విక్రమ్ సహిదేవ్, కథకు తగ్గట్టు వైవిద్యమైన పాత్రలో కనిపిస్తాడు. యాక్ష‌న్‌తో పాటు అందమైన టీనేజ్ ప్రేమకథతో రూపొందుతోన్న చిత్రమిది. చిత్రీకరణ పూర్తయింది. ‌మా సంస్థలో ఇది ఓ మంచి సినిమాగా నిలవటంతో పాటు, విక్రమ్ మంచి పేరు తీసుకొస్తుందని నమ్మకంగా ఉన్నామని శ్రీధర్ తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X