అన్వేష్ ఫేక్ రివ్యూ.. హరి హర వీరమల్లుపై తప్పుడు సమీక్ష.. ఎన్ని లక్షలు ఇచ్చారో తెలుసా?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీసెంట్ గా యాక్షన్ ఫిల్మ్ హరి హర వీరమల్లు: పార్ట్ 1తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం జూలై 24న తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడలోనూ గ్రాండ్ గా విడుదలైంది. ఈ సినిమాను తొలుత టాలీవుడ్ టాప్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వం వహించారు. కానీ ప్రాజెక్ట్ ఆలస్యం కావడంతో ఆయన తప్పుకున్నారు. ఆ తర్వాత ఏఎం జ్యోతికృష్ణ దర్శకత్వ బాధ్యతలను తీసుకున్నారు. ఆయన తండ్రి, టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ ఏఎం రత్నం భారీ బడ్జెట్ తో నిర్మించారు. రెమ్యునరేషన్లు, నిర్మాణ ఖర్చులు, ప్రచారాల వ్యయం అంతా కలుపుకొని రూ.250 కోట్లు అయినట్టు చెప్పారు.
అయితే, పవన్ కళ్యాణ్ ఏపీ ఎలక్షన్స్ లో ప్రభంజనం సృష్టించిన తర్వాత మొదటి సారిగా థియేటర్లలోకి హరి హర వీరమల్లు చిత్రంతో వచ్చారు. ఈ సందర్భంగా అభిమానులతో పాటు నార్మల్ ఆడియెన్స్ లోనూ సినిమాపై భారీ అంచనాలు నెలకున్నాయి. ఇక సినిమా విడుదల సమయంలో చాలా పెద్ద ఎత్తున రివ్యూలు వచ్చాయి. ఇదే సమయంలో యూట్యూబర్, సోషల్ మీడియా ఇన్ ఫ్ల్యూయెన్సర్ నా అన్వేష్ హరిహర వీరమల్లు చిత్రంపై రివ్యూ చెప్పారు. తను యూకేలో ఉన్నానని, ఇప్పుడు సినిమా చూశానంటూ సినిమా రిలీజ్ కు ఒక రోజు ముందే తన రివ్యూను విడుదల చేశారు.

హరిహర వీరమల్లు చిత్రం అదిరిపోయిందని, ఈ సినిమాలో బాలకృష్ణ కూడా ఉన్నారని, భారీ యాక్షన్ సీన్లు ఉన్నారని చెప్పారు. సినిమా బ్లాక్ బాస్టర్ అని చెప్పారు. మరిన్ని అంశాలపై హైప్ పెంచేలా రివ్యూ చెప్పారు. కానీ ఇండియాలో సినిమా విడుదలైన తర్వాత నా అన్వేశ్ చెప్పిన రివ్యూకు భిన్నంగా ఫలితం వచ్చింది. అయితే తాజాగా తను చెప్పిన రివ్యూ సినిమా చూడకుండానే చెప్పానని ఒప్పుకున్నారు. సినిమా చూడకుండానే రివ్యూ చెప్పినందుకు లక్షల్లో డబ్బులు వచ్చాయని అన్నారు.
మొదట తను హరి హర వీరమల్లుపై ఇచ్చిన తన రివ్యూకు 1.6 లక్షల రూపాయలు, ఆ తర్వాత ఆయన రివ్యూ ఫేక్ అంటూ ప్రచారం జరిగడంతో మళ్లీ రూ.3.6 లక్షలు ఆదాయం వచ్చిందని, మొత్తంగా రూ.5 లక్షల వరకు ఆదాయం వచ్చిందని చెప్పుకొచ్చారు. సినిమా చూడకుండానే రివ్యూ చెప్పి ఇన్ని లక్షలు సంపాదించాడని అన్వేశ్ చెప్పడం వైరల్ గా మారింది. ఇక సినిమా చూసి తనను రివ్యూ చెబితే ఇంకా మంచి రెస్పాన్స్ ఉంటుందని నెటిజన్లు చెబుతున్నారు.
ఇక హరి హర వీరమల్లు చిత్రం ద్వారా బాక్సాఫీస్ నుంచి ఆశించిన ఫలితాలు రాలేదు. రూ.250 కోట్లు పెట్టుబడి పెడితే కేవలం బాక్సాఫీస్ నుంచి రూ.106 కోట్లు మాత్రమే తిరిగి వచ్చింది. దీంతో మేకర్స్ కు భారీ స్థాయిలో నష్టాలు చవిచూడాల్సి వచ్చింది. ఇక పవన్ కళ్యాణ్ నుంచి నెక్ట్స్ రాబోయే చిత్రాలపై భారీ అంచనాలు ఉన్నాయి. సుజీత్ ఓజీ, హరీశ్ శంకర్ ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రాల కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు.


Click it and Unblock the Notifications











