twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మహేష్ బాబు సంపాదన ఎంత? సేవ ఎంత?

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: టాలీవుడ్ స్టార్ మహేష్ బాబు. అలుపు లేకుండా, విరామం లేకుండా ఎప్పుడూ సినిమాలు, యాడ్స్ చేస్తూ కోట్లు సంపాదిస్తున్నారు. ఎప్పుడో రేర్‌గా తప్ప బయట కార్యక్రమాల్లో, పంక్షన్లలో ఆయన అసలు కనిపించరు. ఆయనకు సంపాదనే తప్ప వేరే ధ్యాస లేదనే వారూ, ఫ్యామిలీతో విదేశాల్లో చక్కర్లు కొడుతూ లగ్జరీ లైఫ్ గడుపుతున్నారనే వారు సైతం ఉన్నారు.

    దత్తత గ్రామాన్ని మరిచిపోయారంటూ మహేష్ బాబుపై విమర్శలు!దత్తత గ్రామాన్ని మరిచిపోయారంటూ మహేష్ బాబుపై విమర్శలు!

    కానీ బయటకు తెలియని ఎన్నో విషయాలు మహేష్ బాబు సంపాదన వెనక ఉన్నాయి. ఆయన సంపాదిస్తున్న దాంట్లో 30 శాతం సేవా కార్యక్రమాలకు వినియోగిస్తున్నారు. ఇదంతా ఓల్డేజ్ హోమ్స్, హోమ్ లెస్ చిన్నారుల చదువుకు, ఇతర సేవా కార్యక్రమాలకు వినియోగిస్తున్నారు. ఇందుకు సంబంధించిన వ్యవహారాలు నమ్రత దగ్గరుండి పర్యవేక్షిస్తుంది. ఈ విషయాల మహేష్ బాబు ద్వారా తెలుసుకున్న కమెడియన్ అలీ ఆ మధ్య ఓ కార్యక్రమంలో స్వయంగా వెల్లడించారు.

    Mahesh Babu earnings and charity

    ఇక మహేష్ బాబు సినిమాల విషయానికొస్తే...
    మహేష్‌బాబు హీరోగా శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వంలో వస్తున్న సినిమా ‘బ్రహ్మోత్సవం'. ఈ సినిమాను ఏప్రిల్‌ 29న విడుదల చేయాడానికి సిద్దం అవుతున్నారని ట్రేడ్ వర్గాల సమాచారం. వేసవికాలం అయితే పిల్లలకు పరీక్షలు కూడా అయిపోతాయని, ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు తెలుస్తోంది.

    ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ పి.వి.పి.సినిమాస్‌ పతాకంపై ప్రముఖ నిర్మాత పొట్లూరి వరప్రసాద్‌ నిర్మిస్తున్నారు. మహేష్ బాబు కోసం ఈ సారి శ్రీ కాంత్ అడ్డాల విజయవాడ బ్యాక్ డ్రాప్ ని ఎంచుకున్నాడు. పివిపి బ్యానర్ పై పరమ్ వి పొట్లూరి నిర్మించనున్న ఈ సినిమాలో మహేష్ బాబు సరసన ముగ్గురు హీరోయిన్స్ నటిస్తున్నారు.

    శ్రీమంతుడు...
    సూపర్‌స్టార్‌ మహేష్‌ హీరోగా మైత్రి మూవీ మేకర్స్‌, ఎం.బి. ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రై. లిమిటెడ్‌ పతాకాలపై కొరటాల శివ దర్శకత్వంలో నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌, మోహన్‌(సివిఎం) నిర్మించిన హోల్‌సమ్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ 'శ్రీమంతుడు'. ఈ చిత్రం విడుదలైన అన్ని సెంటర్లలో హౌస్‌ఫుల్‌ కలెక్షన్స్‌తో బ్లాక్‌బస్టర్‌ హిట్‌గా నిలవడమే కాకుండా 100 కోట్ల షేర్‌ సాధించి సూపర్‌స్టార్‌ మహేష్‌ చిత్రాల్లో రికార్డ్‌ సృష్టించింది. 15 సెంటర్స్‌లో 100 రోజులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం నేటి(28 జనవరి)తో సిల్వర్‌ జూబ్లీ పూర్తి చేసుకోబోతోంది. ఎమ్మిగనూరు - లక్ష్మణ్‌ థియేటర్‌లో డైరెక్ట్‌గా 175 రోజులు పూర్తి చేసుకోబోతోంది. ఈ చిత్రానికి గాను ఐఫా అవార్డుల వేడుకలో మహేష్ బాబు ఉత్తమ నటుడి అవార్డు గెలుచుకున్నారు. హీరోయిన్ శృతి హాసన్ ఉత్తమ నటి అవార్డు దక్కించుకుంది. మొత్తం ఈ చిత్రానికి ఆరు అవార్డులు దక్కాయి.

    English summary
    Ali is supposed to have revealed that Mahesh stated, "30% of my earnings go for the charity work Namrata undertakes for helping old-age homes and homeless kids. Only to support this charity work I'm running from pillar to post to earn more".
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X