»   » ఫొటోలు: చరణ్, చిరు..ఫ్యాన్స్ తో భేటీ, టైటిల్ ప్రకటన, వివాదం?

ఫొటోలు: చరణ్, చిరు..ఫ్యాన్స్ తో భేటీ, టైటిల్ ప్రకటన, వివాదం?

Posted by:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: మెగాస్టార్ చిరంజీవి,రామ్ చరణ్ కలిసి ఫ్యాన్స్ మీటింగ్ ని ఆదివారం మధ్యాహ్నం ఏర్పాటు చేసారు. రీసెంట్ గా రామ్ చరణ్ పుట్టిన రోజు నాడు బ్లడ్ డొనేషన్ క్యాంపులు ఏర్పాటు చేసిన వారిని అభినందించటానికి ఏర్పాటు చేసిన మీటింగ్ ఇది. ఈ మీటింగ్ లో చిరంజీవి స్వయంగా తన 150 వ చిత్రం గురించిన విశేషాలు తెలియచేసారు. ఈ మీటింగ్ హైదరాబాద్ లో ని హోటల్ తాజ్ కృష్ణలో జరిగింది. ఆ ఫొటోలను మీరు ఇక్కడ చూడవచ్చు.

అక్కడ ఉత్సాహంగా చిరంజీవి మాట్లాడుతూ ఈ విషయంతెలియచేసారు. తన రీ ఎంట్రీ కోసం వందలకొద్దీ కథలు విన్నారు. అయితే ఏవీ నచ్చలేదు. మైలురాయి లాంటి సినిమా కాబట్టి ఆయన ఆచితూచి తమిళ చిత్రం 'కత్తి'ని రీమేక్‌ చేయాలని నిర్ణయించారు. త్వరలో ప్రారంభం కానున్న ఈ చిత్రం టైటిల్ బయిటకు వచ్చింది. అందుతున్న సమచారం ప్రకారం ఈ చిత్రానికి 'కత్తిలాంటోడు' అనే టైటిల్ ని ఫైనలైజ్ చేసారు.

Also Read: సొంతింట్లోనే...చిరంజీవి 150కి అనుకోని అడ్డంకి!

చిరంజీవి మాట్లాడుతూ... వన్ మంత్ లో ...వివి వినాయిక్ డైరక్టర్ గా..చరణ్ సారధ్యంలో కత్తి లాంటి కత్తిలాంటోడు సినిమా స్టార్ట్ చేస్తున్నా... కత్తి రీమేక్ అయినా ..అభిమానుల కోసం చాలా యాడ్ చేసాం. మీరు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు అంటూ చెప్పుకొచ్చారని సమాచారం. దాంతో అభిమానులు చాలా ఆనందపడ్డారట. ఇక ఈ సినిమాలో ఎవరెవరు నటిస్తారు వంటి విషయాలు ఇంకా ఫైనలైజ్ చేయలేదని వెల్లడించారట.

అయితే ఈ నేపధ్యంలో గత కొద్దికాలంగా ఈ చిత్రం కధ విషయంలో జరుగుతన్న వివాదం ఏమైందనే విషయం మీడియా సర్కిల్స్ లో హాట్ టాపిక్ అయ్యింది. చిరంజీవి సామరస్యపూర్వకంగా పరిష్కరించబోతున్నారని పరుచూరి వెంకటేశ్వరరావు గారు గతంలో చెప్పినట్లు పరిష్కారం జరిగే పట్టాలు ఎక్కుతోందా అనే సందేహాలు మొదలయ్యాయి.

స్లైడ్ షోలో మీటింగ్ ఫొటోలు చూడండి..

ఎదురుచూపులు

మెగాస్టార్‌ చిరంజీవి 150వ చిత్రం కోసం అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.

 

ఒక్కటి కూడా..

2007 'శంకర్‌ దాదా జిందాబాద్‌' తరువాత ఆయన హీరోగా ప్రేక్షకుల ముందుకు రాలేదు

 

అయితే

రామ్‌చరణ్‌ హీరోగా ఇటీవల విడుదలైన 'బ్రూస్‌లీ' చిత్రంలో అతిథిగా కనిపించి అభిమానులు అలరించారు ఈ గ్యాంగ్‌లీడర్‌.

 

వివాదం

కథ విషయంలో వివాదం నడుస్తున్నప్పటికీ అది పరిష్కారమయ్యాకే చిరంజీవి 'కత్తి' పట్టబోతున్నారని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.

 

భారీ విజయం కోసమే..

తమిళంలో విజయ్‌ హీరోగా మురుగదాస్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రమిది. అక్కడ భారీస్థాయిలో వసూళ్లను సొంతం చేసుకొంది. అందుకే తన రీ ఎంట్రీకి ఈ చిత్రాన్ని ఎంచుకున్నాడు.

హల్ చల్..

ఈ చిత్రానికి 'కత్తిలాంటోడు' టైటిల్‌ను అనుకున్నట్లు, టైటిల్ అదిరిపోయిందని చిరు, రామ్‌చరణ్‌ అభిమానులు ఫేస్‌బుక్‌లో హల్‌చల్‌ చేస్తున్నారు.

 

ఇంకో నెలే..

మరో నెలలో వి.వి. వినాయక్‌ దర్శకత్వంలో చరణ్‌ సారథ్యంలో ఈ సినిమా ప్రారంభం అవుతుందని తెలిపారు.

 

పూర్తి స్పష్టత వచ్చిందనే

మెగాస్టార్‌ చిరంజీవి 150వ చిత్రంపై ఓ స్పష్టత వచ్చినట్లు తెలుస్తోంది.

 

మొదట అనుకున్నారు

మార్చి 27న చిరంజీవి తనయుడు రామ్‌చరణ్‌ పుట్టినరోజున ఈ చిత్ర షూటింగ్‌ ఆరంభించాలని అనుకున్నారు కానీ కుదరలేదు.

తొలిసారిగా..

వి.వి. వినాయక్‌ దర్శకత్వం వహించే ఈ సినిమాకి చరణ్‌ తొలిసారి నిర్మాతగా వ్యవహరించనున్నారు.

 

హీరోయిన్ గా

నయనతార హీరోయిన్ గా చేసే అవకాసం ఉందని చెప్తున్నారు. ఈ మేరకు చర్చలు జరుగుతున్నట్లు సమాచారం.

 

విలన్ గా..

బాలీవుడ్‌ నటుడు వివేక్‌ ఒబెరాయ్‌ విలన్ గా నటిస్తున్నట్లు తెలుస్తోంది.

 

రెండో సారి

చిరంజీవి, వి.వి. వినాయక్‌ కాంబినేషన్‌లో చివరి సారిగా ‘ఠాగూర్‌' చిత్రం విడుదలైంది.

 

ఆలోచించే నిర్ణయం

తొలుత ఈ చిత్రాన్నే చేద్దామనుకున్నా.. మాస్‌ మసాలా మూవీతో రీఎంట్రీ ఇస్తే ఎలా ఉంటుంది అని కూడా చిరు ఆలోచించారు. అయితే చివరకు చిరంజీవి మళ్లీ ‘కత్తి' పట్టేందుకు సిద్ధమయ్యారు

ప్రీ ప్రొడక్షన్

వి.వి.వినాయక్‌ . ఇప్పటికే స్క్రిప్ట్‌ పనులు పూర్తి చేసి, ప్రీ ప్రొడక్షన్ లో బిజీగ ఉన్నారు. ఇక కొబ్బరికాయ కొట్టడమే ఆలస్యం.

 

మరో ప్రక్క

'రచయిత నరసింహారావుకు న్యాయం జరిగేంతవరకూ తెలుగులో 'కత్తి' సినిమాని రీమేక్‌ చేయనివ్వం'' అంటూ తెలుగు చలన చిత్ర పరిశ్రమ ఏకతాటిపై నిలిచింది

కథ నాదే..

'కత్తి' కథ నాదే అంటూ నరసింహారావు అనే ఓ రచయిత గత కొంతకాలంగా పోరాటం చేస్తున్నారు. ఈ వివాదమై పూర్వాపరాలను పరిశీలించిన కథా హక్కుల సమాఖ్య రచయితకు మద్దతుగా నిలిచింది.

పరిష్కారం అయ్యిందా

ఆ సమస్య పరిష్కారం కాకుండానే 'కత్తి'ని తెలుగులో రీమేక్‌ చేయాలనుకోవడంతో రచ్చ మళ్లీ మొదలైంది. అయితే ఈ సారి మరి పరిష్కరించుకునే చేస్తున్నారా లేదనే విషయం తెలియరాలేదు.

పరిష్కరించుకునే..

''కత్తి' రీమేక్‌ విషయంలో చిరంజీవి స్పష్టమైన అభిప్రాయంతో ఉన్నారు. 'కత్తి' కథపై ఉన్న వివాదం తీరాకే ఆ సినిమాని సెట్స్‌పైకి తీసుకెళ్తామని చిరంజీవి చెప్పారు. మధ్యవర్తుల ద్వారా ఈ సమస్యని సామరస్యంగా పరిష్కరించుకొనే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు.

ఎప్పుడు మొదలెడతారు

అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రం ఏప్రియల్ 22న ప్రారంభించే అవకాసం ఉందని తెలుస్తోంది.

 

English summary
Chiranjeevi confirmed officially in Mega fans meet that his 150th film titled as "Kathilantodu". Inside talk is film will be launched in a grand manner on April, 22nd.
Please Wait while comments are loading...