twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హైదరాబాద్‌లోనే సోనూసూద్ సిట్టింగ్.. ఆ ఎఫెక్ట్‌తో ఒకేసారి 10కోట్ల ఖర్చు

    |

    కరోనా కష్టకాలంలో ఎంతోమందికి సహాయం చేసిన సోనూసూద్ రియల్ హీరోగా గుర్తింపు అందుకున్న విషయం తెలిసిందే. కరోనా ఫస్ట్ వేవ్ అనంతరం వైద్య సహయాలు మాత్రమే కాకుండా ఎంతోమందికి ఆర్థిక సహాయాన్ని కూడా అంధించాడు. ఎలాంటి పరిస్థితుల్లో అయినా పేద వారికి అండగా ఉంటానని నిరూపించాడు. అయితే సోనూసూద్ ఇటీవల హైదరాబాద్ లో ఉండడం కోసం ఏకంగా 10కోట్లు ఖర్చు చేసినట్లు సమాచారం.

    థర్టీ ఇయర్స్ పృథ్వి కూతురు ఎంత అందంగా ఉందో చూశారా?థర్టీ ఇయర్స్ పృథ్వి కూతురు ఎంత అందంగా ఉందో చూశారా?

    ఖర్చుకు ఏ మాత్రం వెనుకాడకుండా

    ఖర్చుకు ఏ మాత్రం వెనుకాడకుండా

    సినిమా ఇండస్ట్రీలో మొదట విలన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ అందుకున్న సోనూసూద్ బాషాభేదం లేకుండా నటించాడు. కొన్ని సినిమాలకు తన విలనిజంతోనే మంచి హైప్ క్రియేట్ చేశాడు. నిజానికి అతనిలో ఒక రియల్ హీరో ఉన్నాడని కరోనా వచ్చే వరకు ఎవరికి తెలియదు. ఖర్చుకు ఏ మాత్రం వెనుకాడకుండా ఎన్నో సహాయలు చేశాడు.

    ఆ తరువాత కూడా..

    ఆ తరువాత కూడా..

    మొదటి లాక్ డౌన్ మొదలైనప్పుడే సొంత గూటికి చేరేందుకు జనాలు పడిన కష్టం అంతా ఇంతా కాదు. అలాంటి వారి కోసం సోనూసూద్ చేసిన సహాయం ప్రతి ఒక్కరినీ కదిలించింది. ప్రత్యేకంగా బస్సులను ఏర్పాటు చేయడమే కాకుండా ఎంతోమందికి ఆకలి బాధను కూడా తీర్చాడు. లాక్ డౌన్ అనంతరం కూడా అదే తరహాలో సహాయలు అందించాడు.

    వెనుకడుగు వేయలేదు.

    వెనుకడుగు వేయలేదు.

    ఆక్సిజన్ ప్లాంట్స్ కోసం సోనూసూద్ చేసిన కృషి అంతా ఇంతా కాదు. ఏకంగా 3కోట్ల వరకు ఖర్చు చేసి దేశంలోని ఎమర్జెన్సీ పేషేంట్స్ కు ఆక్సిజన్ అందేలా చేశాడు. ఎలాంటి పరిస్థితుల్లోనూ సోనూసూద్ వెనుకడుగు వేయలేదు. దీంతో సోనూసూద్ కు వచ్చే ఆఫర్స్ లో మార్పులు వస్తున్నాయి. ముఖ్యంగా టాలీవుడ్ లో అతనికి పాజిటివ్ గా ఉండే రోల్స్ ఎక్కువగా వస్తున్నాయి.

    సొంతంగా ఖరీదైన ఫ్లాట్

    సొంతంగా ఖరీదైన ఫ్లాట్

    ఇక హైదరాబాద్ లో ప్రతిసారి హోటల్ లో ఉండడం సోనూసూద్ కు నచ్చడం లేదట. ఆ ఎఫెక్ట్ తో ప్లాన్ చేంజ్ చేశాడు. సొంతంగా ఫ్లాట్ తీసుకుంటే బెటర్ అని ఏకంగా రూ.10కోట్లు ఖర్చు చేసి ఒక సొంత ఫ్లాట్ తీసుకున్నాడట. ఎక్కువ రోజులు ఇక్కడ గడపాల్సి వస్తే కుటుంబ సభ్యులకు కూడా సౌకర్యంగా ఉండాలని ప్లాన్ చేసుకుంటున్నట్లు సమాచారం.

    English summary
    It is a known fact that Sonu Sood has been recognized as a real hero who has helped many people during Corona's difficult times. Corona provided not only medical assistance after the first wave but also financial assistance to many. He proved to be a boon to the poor under any circumstances. However, it is learned that Sonu Sood recently spent Rs 10 crore to stay in Hyderabad.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X