Just In
- 42 min ago
రేయ్ రేయ్ అల్లరి నరేష్ పేరు మార్చేయ్.. కామెడీ హీరోకు నాని సలహా
- 1 hr ago
రష్మిక బ్రేకప్ పై ఇంకా తగ్గని ప్రశ్నలు.. విజయ్ దేవరకొండ ఇచ్చిన జవాబుకు రిపోర్టర్ మైండ్ బ్లాక్
- 2 hrs ago
2021 గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ .. ఇండియాలో కూడా లైవ్.. ఎప్పుడంటే?
- 2 hrs ago
అరణ్య ట్రైలర్ ఎప్పుడంటే.. రచ్చ చేసేందుకు రానా రెడీ!
Don't Miss!
- News
టీఆర్ఎస్ సభ్యత్వం తీసుకుంటేనే ప్రభుత్వ పథకాలు..: ఎమ్మెల్యే రాజయ్య సంచలనం
- Sports
కొంచెం స్పిన్ అయితే చాలు ఏడుపు మొదలుపెడతారు.. మొతేరా పిచ్ విమర్శకులపై నాథన్ లయన్ ఫైర్!
- Finance
9 కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.2.2 లక్షల కోట్లు డౌన్, రిలయన్స్ మాత్రమే అదరగొట్టింది
- Automobiles
అతి తక్కువ ధరకే బౌన్స్ ఎలక్ట్రిక్ స్కూటర్.. పూర్తి వివరాలు
- Lifestyle
ఈ వారం మీ రాశి ఫలాలు ఫిబ్రవరి 28 నుండి మార్చి 6వ తేదీ వరకు
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
పెళ్లి కాకుండానే తల్లి అయిన సినీ నటి.. గత రాత్రి గోవాలో!
నేటితరం బాలీవుడ్, హాలీవుడ్ హీరోయిన్లు అన్నింటా ముందే ఉంటున్నారు. ప్రేమ, పెళ్లి, డేటింగ్, గర్భం దాల్చడం ఇలా ఏదైనా ఫాస్ట్ ఫాస్ట్ గా చేసేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రెగ్నెన్సీకి పెళ్లి అడ్డుకాదని నిరూపించి సెన్సేషన్ క్రియేట్ చేసింది రోబో బ్యూటీ హీరోయిన్ అమీ జాక్సన్. తాజాగా ఇదే బాటలో మరో హీరోయిన్ చేరి వార్తల్లో నిలిచింది.

బాలీవుడ్ దర్శకుడితో వివాహం.. మరో యువకుడితో ప్రేమ
బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్‌ని పెళ్ళాడి ఆ తర్వాత ఆయనతో తెగదెంపులు చేసుకుంది కల్కి కొచ్లిన్. వెంటనే మరో యువకుడితో ప్రేమలో మునిగితేలి గర్బం దాల్చింది. ఇలా పెళ్లి కాకుండానే ఆమె గర్బవతి కావడం పట్ల నెటిజన్లు ఓ రేంజ్ కామెంట్స్ చేసినా అవేవీ పట్టించుకోలేదు కల్కి.

సహజీవనం చేసి గర్భం దాల్చిన హీరోయిన్
ఇజ్రాయెల్ లోని జెరూసలెంకు చెందిన పియానిస్ట్ గయ్‌తో ప్రేమలో మునిగితేలిన కల్కి కొచ్లిన్.. అతనితో సహజీవనం చేసి గర్భం దాల్చింది. తాను పెళ్లికాకుండానే గర్భవతి అయ్యానని ప్రకటిస్తూ సెన్సేషన్ క్రియేట్ చేసిన ఆమె.. నిన్న (శనివారం) రాత్రి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈమెకిదే తొలి సంతానం. పుట్టిన ఆ పాపకు ఇంకా పేరు పెట్టలేదు కల్కి కొచ్లిన్.

పెళ్లి కాకుండానే గర్భం.. గే అయినా ఫర్వాలేదు
ఇకపోతే సాధరణంగా పుట్టబోయే బిడ్డ ఆడ లేదా మగ కావాలని కోరుకోవడం సహజం. ఆ బిడ్డ అందంగా ఉండాలని అనుకోవడం అందరిలో చూసేదే. కానీ అందరికీ బిన్నంగా తనకు పుట్టబోయే బిడ్డ 'గే' అయినా ఏం ఫర్వాలేదు అంటూ గతంలో కామెంట్స్ చేసి సంచలనం సృష్టించింది కల్కి.

గోవాలో అనుకుంది.. అలాగే చేసింది
అప్పట్లో గర్భవతిని అని ప్రకటించిన కల్కి.. ఎప్పుడు బిడ్డను కనాలి? ఆ బిడ్డతో ఎప్పుడు, ఎలా కనెక్ట్ కావాలో తనకు బాగా తెలుసని పేర్కొంది. గర్భవతి కావడం పట్ల స్పెషల్ రూల్స్ ఏవీ పెట్టుకోలేదని చెప్పిన ఆమె.. గోవాలో పురుడు పోసుకోవాలని అనుకుంటున్నానని తెలిపింది. చెప్పినట్లుగానే అక్కడే ఆడబిడ్డకు జన్మనిచ్చింది.