కెజిఎఫ్ 2 అధీరా పాత్ర అవెంజర్స్‌లో థానోస్‌లా ఉంటుంది: సంజయ్ దత్

Recommended Video

Sanjay Dutt Says Adheera From KGF Chapter 2 Is Like Thanos From Avengers || Filmibeat Telugu

కన్నడ స్టార్ యష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన 'కెజిఎఫ్-చాప్టర్ 1' సంచలన విజయం అందుకుంది. ఈ నేపథ్యంలో 'కెజిఎఫ్-చాప్టర్ 2'ను గ్రాండ్‌గా ప్లాన్ చేస్తున్నారు. బాలీవుడ్ మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకుని ఈ సినిమాలో విలన్ పాత్రకు సంజయ్ దత్‌ను ఎంపిక చేశారు.

కెజిఎఫ్-చాప్టర్ 2లో సంజయ్ దత్ అధీరా పాత్రలో కనిపించబోతున్నారు. ఇటీవలే ఆయన లుక్ పరిచయం చేస్తూ పోస్టర్ విడుదల చేశారు. ఈ పోస్టర్ రిలీజ్ తర్వాత సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. సంజయ్ దత్ నటించిన మరో బాలీవుడ్ మూవీ 'ప్రస్తానం' టీజర్ రిలీజ్ సందర్భంగా కొందరు మీడియా ప్రతినిధులు 'కెజిఎఫ్-2' సినిమా గురించి ప్రశ్నించగా ఆయన స్పందించారు.

కెజిఎఫ్ 2లో పవర్‌ఫుల్ పాత్రలో కనిపించబోతున్నాను

కెజిఎఫ్ 2లో పవర్‌ఫుల్ పాత్రలో కనిపించబోతున్నాను

‘కెజిఎఫ్ 2' గురించి మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు సంజయ్ దత్ స్పందిస్తూ... ఇందులో తన పాత్ర పవర్ ఫుల్‌గా ఉంటుందని తెలిపారు. అధీరా లుక్ కూడా డిఫరెంటుగా ఉంటుందన్నారు. ఈ పాత్ర డిజైన్ చేసిన తీరు ఎంతో నచ్చిందని, అందుకే సినిమాలో విలన్ పాత్ర చేయడానికి ఒప్పుకున్నట్లు వెల్లడించారు.

అవెంజర్స్‌లో థానోస్‌లా అధీరా పాత్ర

అవెంజర్స్‌లో థానోస్‌లా అధీరా పాత్ర

ఒక రకంగా చెప్పాలంటే అధీరా పాత్ర అవెంజర్స్ మూవీలో థానోస్‌ పాత్రలా ఉంటుంది. ఇలాంటి ఒక వైవిధ్యమైన పాత్ర చేయాలని ఎప్పటి నుంచో కోరిక ఉంది. ‘కెజిఎఫ్ 2' రూపంలో అలాంటి పాత్ర చేసే అవకాశం దక్కింది, సినిమాలో అధీరా పాత్ర చాలా కీలకంగా ఉంటుదని సంజయ్ దత్ తెలిపారు.

తొలిసారిగా కన్నడ చిత్రంలో

తొలిసారిగా కన్నడ చిత్రంలో

'కెజిఎఫ్ 2' ద్వారా బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ కన్నడ సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టబోతున్నారు. 'అధీరా' పాత్ర సినిమాలో హైలెట్ అయ్యేలా ఉంటుందని, హీరో పాత్రను మించిపోతుందని టాక్. ఈ మూవీలో సంజయ్‌తో పాటు రవీనా టండన్ కూడా కీలక పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది.

2020లో రిలీజ్

2020లో రిలీజ్

'కెజిఎఫ్-చాప్టర్ 1' 2018లో కన్నడతో పాటు తెలుగు, తమిళం, హిందీలో విడుదలైన ప్రపంచ వ్యాప్తంగా రూ. 200 కోట్లకుపైగా వసూలు చేసిన చరిత్ర సృష్టించింది. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి విజయ్ కిరంగదూర్ నిర్మాత. 'కెజిఎఫ్-చాప్టర్ 2' చిత్రాన్ని 2020లో ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. హోంబళే ఫిలింస్‌, వారాహి చలన చిత్రం బేనర్లో ఈ మూవీ రూపొందుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X