twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    గుండె మీద చేయి వేసుకుని.. సుశాంత్, డ్రగ్స్ కేసులపై నోరు విప్పిన అక్షయ్ కుమార్

    |

    బాలీవుడ్ ప్రస్తుత పరిస్థితి గురించి ఎవ్వరికీ చెప్పనక్కర్లేదు. సుశాంత్ మరణం, డ్రగ్స్ కేసు ఇలా ఒక్కొక్కటిగా బాలీవుడ్‌ స్థాయిని దిగజార్చాయి. మరీ ముఖ్యంగా డ్రగ్స్ కేసు బాలీవుడ్ పరువును తీస్తోంది. ఈ క్రమంలో బాలీవుడ్‌కు ఓ విషయంలో ఊరట లభించింది. సుశాంత్‌ది ఆత్మహత్యే.. ఉరి వేసుకోవడం వల్లే మరణించాడని ఏయిమ్స్ అధికారులు స్పష్టం చేశారు. ఈ ఒక్క విషయంలో బాలీవుడ్ ఊపిరి పీల్చుకుంది. అయితే సుశాంత్ విషయంలో రిపోర్ట్ ఏదైనా తేడాగా వచ్చి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేది.

    ఎన్నో రోజుల నుంచి..

    ఎన్నో రోజుల నుంచి..

    ఇక సుశాంత్‌ది ఆత్మహత్యే అని నిర్దారించిన తరువాత అక్షయ్ కుమార్ ఓ వీడియోను రిలీజ్ చేశాడు. మనస్ఫూర్తిగా మాట్లాడుతున్నా.. గుండెల మీద చేయి వేసుకుని చెబుతున్నా అంటూ అందర్నీ ఎమోషనల్‌గా టచ్ చేశాడు. నేను ఈ రోజు మీతో మనస్పూర్తిగా మాట్లాడతాను. గత కొన్ని వారాలుగా మీతో కొన్ని మాట్లాడదామని ప్రయత్నిస్తున్నా.. కానీ ఎక్కువగా నెగెటివిటీయే ఉంది. అందుకే ఏం మాట్లాడాలో అర్థం కాలేదు.. ఎంత మాట్లాడాలో తెలియడం లేదు అని అక్షయ్ కుమార్ తెలిపాడు.

    మీ కోపాన్ని..

    మీ కోపాన్ని..

    మేము స్టార్స్ అయినా సరే అది మీ వల్లే. బాలీవుడ్ ఈ స్థాయిలో ఉందంటే.. అది కేవలం మీ ప్రేమ వల్లే. మేము కేవలం ఈ ఇండస్ట్రీకే చెందిన వాళ్లం కాదు.. ఈ మీడియం వల్ల మేము భారతీయ సంప్రదాయాలు, కల్చర్‌ను ప్రపంచానికి పరిచయం చేశాం. దేశ ప్రజల మనోభావాలను తెరపై చూపించే ప్రయత్నం చేస్తుంటాం. అందులో ఓ యాంగ్రీయంగ్ మెన్ ఉండొచ్చు.. నిరుద్యోగి ఉండొచ్చు.. సమాజంలోని బాధలను తెరపై చూపిస్తూ వచ్చాం.. ఒక వేళ ఈ రోజు మీరంతా కోపంగా ఉన్నారంటే.. ఆ ఆగ్రహాన్ని కూడా మేం ఒప్పుకుంటాం.. అని అక్షయ్ కుమార్ పేర్కొన్నాడు.

    నేను అబద్దం చెప్పను..

    నేను అబద్దం చెప్పను..

    సుశాంత్ చనిపోయాక చాలా జరిగాయి.. మీకు అవి ఎంత బాధ కలిగించాయో ఆ విషయాలన్నీ మాక్కూడా బాధను కలిగించాయి. ఈ ఘటనల వల్ల అసలు మాదాంట్లో ఏం జరుగుతుందో చూసుకోవాల్సి వచ్చింది. నార్కోటిక్, డ్రగ్స్ అంటూ అందరూ మాట్లాడుతున్నారు.. నేను మీతో అబద్దం చెప్పాలని అనుకోవడం లేదు.. ఈ సమస్య కేవలం ఇక్కడ మాత్రమే కాదు.. ప్రతీ ఇండస్ట్రీలో ఉంటుంది... ప్రతీ వ్యక్తి అందులో ఉన్నాడని ఎలా చెబుతాం.. అంటూ అక్షయ్ కుమార్ ప్రశ్నించాడు.

    ఒకే గాడిన కట్టేసి..

    ఒకే గాడిన కట్టేసి..

    డ్రగ్స్ వాడకమనేది లీగల్ ఇష్యూ. మన చట్టాలు వారిని ఎలా శిక్షించాలి, శిక్షిస్తాయో తెలుసు అది కరెక్ట్. మా వాళ్లంతా విచారణకు సహకరిస్తారని నాకు తెలుసు. కానీ మీ అందరినీ చేతులెత్తి మొక్కుతున్నా.. అందరినీ ఒకే గాడిన కట్టేసి చూడకండి.. అది చాలా తప్పు.. వ్యక్తిగతంగా నాకు మీడియా శక్తి మీద నమ్మకం ఉంది. ఒకవేళ మన మీడియా సరైన సమయంలో సరైన పాయింట్‌ను లేవనెత్తకపోతే.. న్యాయం జరగదు.. అన్యాయానికి గురైన వారు చెప్పుకునేందుకు వారి వాయిస్ లభించదు.. అని అక్షయ్ కుమార్ ఆవేదన చెందాడు.

    Recommended Video

    Director Natti Kumar Filed Complaint Against Chanti Addala Over Keerthi Suresh's Movie
    మీ ప్రేమ, నమ్మకం

    మీ ప్రేమ, నమ్మకం

    మీడియాను వారి గళాన్ని విప్పి మాట్లాడాలని కోరుతున్నాను.. కానీ సున్నితత్వాన్ని మరిచిపోకూడదు. ఒక నెగెటివ్ వార్త వల్ల ఒకరి పరువు మొత్తం పోతుంది.. ఎన్నో యేళ్లుగా నిర్మించుకుంటూ వచ్చిన గౌరవం, కాపాడుకుంటున్న పేరు మొత్తం పోతుంది. మా అభిమానులే మమ్మల్ని ఇంత వాళ్లను చేశారు.. మీరు ఒకవేళ బాధపడుతుంటే.. మిమ్మల్ని అలా కానివ్వం.. మా కష్టాలను అధిగమించి మీ కోసం కష్టపడుతాం.. మీ నమ్మకాన్ని ప్రేమను గెలుస్తాం.. మేమున్నదే మీ వల్ల. మాకు అండగా నిలబడండి.. థ్యాంక్యూ అంటూ అక్షయ్ కుమార్ ఎమోషనల్ అయ్యాడు.

    English summary
    Akshay Kumar About Sushant Singh And Drugs Case, My message to my fans is, you are the ones who have made us. We will not let you down. If you are upset, we will work harder on our flaws.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X