ఆర్యన్ కార్తీక్‌కు అల్లు అర్జున్ షాక్.. షెహజాదాకు పోటీగా హిందీ అలవైకుంఠపురంలో.. బరాబర్ రిలీజ్ చేస్తామంటూ

తెలుగులో భారీ విజయం అందుకొన్న అల వైకుంఠపురం చిత్రాన్ని హిందీలో బాలీవుడ్ యువ హీరో కార్తీక్ ఆర్యన్ రీమేక్‌ చేస్తూ.. షెహ్‌జాదా టైటిల్‌తో రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. పఠాన్ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయం వైపు దూసుకెళ్తున్న నేపథ్యంలో షెహ్‌జాదే సినిమా రిలీజ్‌ను అనుకొన్న తేదీ కంటే.. ఒక వారం ఆలస్యంగా రిలీజ్ చేయాలని యూనిట్ నిర్ణయం తీసుకొన్నది. అయితే ఆర్యన్ కార్తీక్‌కు అల్లు అర్జున్ భారీ షాక్ ఇవ్వబోతుండటం నిర్మాతలు కంగారు పడుతున్నారు. షెహ్‌జాదే సినిమా కలెక్షన్లకు వచ్చిన ముప్పు ఏమిటంటే?

పఠాన్ కారణంగా షెహజాదా రిలీజ్ వాయిదా

పఠాన్ కారణంగా షెహజాదా రిలీజ్ వాయిదా

పఠాన్ సినిమా థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శిస్తున్నందున్న షెహజాదా చిత్రం రిలీజ్‌ను వాయిదా వేశారు. అనుకొన్న తేదీ ఫిబ్రవరి 10వ తేదీ కాకుండా ఫిబ్రవరి 17వ తేదీన రిలీజ్ చేయాలని నిర్ణయించారు. అయితే షెహ్‌జాదా రిలీజ్ కంటే ముందుగానే అల వైకుంఠపురంలో సినిమా హిందీ డబ్బింగ్‌ను రిలీజ్ చేయాలని నిర్ణయం తీసుకోవడం ఇప్పుడు నిర్మాతలను ఓ భయం వెంటాడుతున్నది.

ఫిబ్రవరి 2న అల వైకుంఠపురంలో హిందీ రిలీజ్

ఫిబ్రవరి 2న అల వైకుంఠపురంలో హిందీ రిలీజ్


అల వైకుంఠపురంలో సినిమా హిందీ డబ్బింగ్ హక్కులను గోల్డ్ మైన్ టెలిఫిల్మ్స్ సొంతం చేసుకొన్నది. ఈ సినిమా హిందీ డబ్బింగ్ వెర్షన్‌‌ను ఫిబ్రవరి 2వ తేదీన యూట్యూబ్‌లో రిలీజ్ చేయాలని గోల్డ్ మైన్ ప్రకటన చేసింది. అల వైకుంఠపురంలో హిందీ వెర్షన్‌ను యూట్యూబ్‌లో చూడవచ్చు అంటూ టీజర్‌ను రిలీజ్ చేసింది.

షెహజాదాకు ముందు రిలీజ్ ఎలా?

షెహజాదాకు ముందు రిలీజ్ ఎలా?


అలవైకుంఠపురంలో హిందీ రీమేక్స్ రైట్స్ తీసుకొని రూపొందించిన షెహ్‌జాదా సినిమా కంటే ముందే అలవైకుంఠపురం హిందీ డబ్బింగ్ చిత్రాన్ని యూట్యూబ్‌లో ఎలా రిలీజ్ చేస్తారనే విషయంపై వివాదం కొనసాగుతున్నది. మా చిత్రాని కంటే ముందుగా హిందీ డబ్బింగ్‌ను గోల్డ్ మైన్ ఫిలింస్ రిలీజ్ చేయడం తప్పు అంటూ అభిప్రాయపడుతున్నారు. హిందీ డబ్బింగ్ యూట్యూబ్ రిలీజ్‌ను ఆపేందుకు చర్చలు జరుపుతున్నారనేది సమాచారం.

వివాదంపై కార్తీక్ ఆర్యన్ బెదిరింపులు

అయితే షెహజాదా సినిమాకు అలవైకుంఠపురంలో హిందీ డబ్బింగ్ సినిమాకు ఎప్పటి నుంచో వివాదం కొనసాగుతున్నది. హిందీ డబ్బింగ్ రైట్స్‌ను గోల్డ్ మైన్ కొనుగోలు చేసిన సమయంలో షెహ్ జాదే సినిమా నుంచి తాను తప్పుకొంటానని హీరో కార్తీక్ ఆర్యన్ బెదిరించాడు. అయితే ఆ సమయంలో గోల్డ్ మైన్ నిర్వాహకులకు నచ్చ జెప్పి.. షెహ్ జాదా సినిమా షూటింగును కొనసాగించారు. అయితే ప్రస్తుతం అదే వివాదం మళ్లీ తెరపైకి రావడంతో కార్తీక్ ఆర్యన్ ఆందోళన చెందుతున్నట్టు సమాచారం.

ఉచితంగా ఫ్రదర్శిస్తే.. కలెక్షన్లపై ప్రభావం అంటూ

ఉచితంగా ఫ్రదర్శిస్తే.. కలెక్షన్లపై ప్రభావం అంటూ

ఒకవేళ అల వైకుంఠపురంలో హిందీ డబ్బింగ్ సినిమా యూట్యూబ్‌లో ఉచితంగా ప్రదర్శిస్తే.. షెహజాదే సినిమా కలెక్షన్లపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంటుంది. అందుచేత యూట్యూబ్‌లో రిలీజ్ కాకుండా చర్యలు తీసుకోవాలని షెహ్‌జాదే నిర్మాతలకు ఆర్యన్ కార్తీక్ సూచించినట్టు సమాచారం.

మాకు హక్కు ఉంది.. రిలీజ్ చేస్తాం

అయితే అలా వైకుంఠపురంలో హిందీ డబ్బింగ్ వెర్షన్ సినిమాను యూట్యూబ్‌ రిలీజ్ చేయడంలో ఎలాంటి సందేహాలు, అనుమానాలు లేవు. శాటిలైట్‌తోపాటు హిందీ డబ్బింగ్, డిజిటల్ రైట్స్ హక్కులు ఉన్నాయి. అయితే ఎప్పుడు దానిని రిలీజ్ చేయాలనేది మా ఇష్టం అని గోల్డ్ మైన్ సీఈవో షా మీడియాతో అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X