Just In
- 36 min ago
అది కంట్రోల్ చేయడమే నా పేరుకు అర్థం.. ఎద అందాలతో చిచ్చుపెట్టిన ఊర్వశీ
- 1 hr ago
ఇదెక్కడి వింతరా బాబు.. సుత్తితో కొట్టేసుకుంటోన్న హీరో.. వీడియో వైరల్
- 1 hr ago
నాగ చైతన్య, సాయి పల్లవి లవ్ స్టోరీ: ముహూర్తం ఫిక్స్ చేసిన చిత్ర యూనిట్
- 1 hr ago
సమంత ఖాతాలో ఊహించని రికార్డు: ఇండియాలో ఏ హీరోయిన్‌కూ దక్కని ఘనత సొంతం
Don't Miss!
- News
ఎన్నికలకు ముందు మోడీ తాయిలం .. అస్సాంలో ఇళ్ళ పట్టాల పంపిణీ చేసిన ప్రధాని
- Sports
శాంసన్ కెప్టెన్సీలో ఆడడానికి ఎదురుచూస్తున్నా: దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మన్
- Lifestyle
సెక్స్ సమయంలో మీరు ఈ పని చేస్తే ఏమి జరుగుతుంది?
- Automobiles
భారత్‌లో స్ట్రీట్ 750, స్ట్రీట్ రాడ్ డిస్కంటిన్యూ; హ్యార్లీ కథ ముగిసినట్లేనా?
- Finance
Union Budget 2021: ఈ సారి బడ్జెట్ ఎలా ఉండాలి.. ఎలాంటి సవాళ్లున్నాయి..?
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
నాలుగుసార్లు ఆత్మహత్యకు ప్రయత్నించా.. బాలీవుడ్ నటుడి నోట సంచలన విషయాలు
బాలీవుడ్‌లో ఇటీవల కాలంలో అత్యంత ప్రేక్షకాదరణ పొందిన నటుడు ఎవరైనా ఉన్నారంటే అది అమిత్ సద్. బిగ్‌బాస్ కంటెస్టెంట్‌గా గుర్తింపు పొందిన అమిత్ ఓటీటీలో పలు వెబ్ సిరీస్‌లో నటిస్తూ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొంటున్నారు. తాజాగా బాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జీవితంలోని విషయాలను, ప్రొఫెషన్‌లోని సంగతులను బయటపెట్టారు. ఈ సందర్భంగా సంచలన విజయాలు వెల్లడిస్తూ..

సుశాంత్ సింగ్‌తో కలిసి కాయి పో చేలో
అమిత్ సద్ విషయానికి వస్తే.. ఫూంక్ 2 చిత్రంతో బాలీవుడ్‌లో ప్రవేశించాడు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌తో కలిసి కాయి పో చే అనే చిత్రంలో నటించారు. ఆ తర్వాత అవకాశాలు రాకపోవడంతో మానసిక క్షోభను అనుభవించాను. అయితే నా టీనేజ్‌లో నేను నాలుగు సార్లు ఆత్మహత్యకు ప్రయత్నించాను. అయితే ఎందుకు అలాంటి తీవ్రమైన ప్రయత్నాలు చేసానో ఇప్పటికి అర్ధం కాదు అని అమిత్ సద్ తెలిపారు.

టీనేజ్‌లో నాలుగు సార్లు ఆత్మహత్యాయత్నం
నాకు 16 నుంచి 18 ఏళ్ల మధ్యలో నాలుగు సార్లు సూసైడ్‌కు ప్రయత్నించాను. అయితే ఆత్మహత్యాయత్నానికి ముందు ఎలాంటి ఆలోచనలు లేవు. ఏదో తెలియకుండానే ఆత్మహత్యకు ప్రయత్నించాను. దేవుడి దయ వల్ల బతికి బయటపడ్డాను అని అమిత్ సద్ పేర్కొన్నారు.

నా మైండ్ సెట్ మార్చుకొన్నా
ఒక దశలో నా జీవితంపై ఆశలు పెరిగాయి. నా మైండ్ సెట్ మార్చుకొన్నాను. నా జీవితాన్ని చాలించడం సరికాదు. జీవితాన్ని అర్ధాంతరంగా ముగించడం పద్దతి కాదు. జీవితంలో సమస్యలు వస్తే ఎదురించడమే సరి అని అనుకొన్నాను. అంతటితో ఆత్మహత్య ప్రయత్నాలను మానుకొన్నాను అని అమిత్ సద్ తెలిపాడు.

అమిత్ సంద్ కెరీర్ ఇలా..
ఇక అమిత్ సద్ కెరీర్ విషయానికి వస్తే.. సుల్తాన్, అఖిరా, సర్కార్ 3, సూపర్ 30, యారా, శకుంతాల దేవి చిత్రాల్లో నటించారు. ఆ తతర్వాత బిగ్‌బాస్1 సీజన్‌లో పాల్గొన్నాడు. ఇటీవల బ్రీత్, బ్రీత్: ఇంటూ ది షాడో, అవరోధ్ అనే వెబ్ సిరీస్‌లో నటించాడు.