twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    భారతీయ సినీ దిగ్గజం అమితాబ్‌కు అరుదైన గౌరవం.. బీగ్‌బీకి దాదా సాహెబ్ ఫాల్కే

    |

    Recommended Video

    Amitabh Bachchan Gets Dadasaheb Phalke Award || బిగ్ బీకి వెల్లువెత్తుతున్న అభినందనలు!!

    భారతీయ సినీ దిగ్గజం అమితాబ్ బచ్చన్‌కు అరుదైన గౌరవం దక్కింది. ఐదు దశాబ్దాలపాటు సినీ పరిశ్రమకు ఎనలేని సేవలందించిన ఆయనకు కేంద్ర ప్రభుత్వం దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుతో సత్కరించింది. ఈ విషయాన్ని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి ప్రకాశ్ జవదేవకర్ ట్విట్టర్‌ ద్వారా తెలియజేశారు. ట్విట్టర్‌లో ఆయన ఏమన్నారంటే..

    రెండు తరాలను తన నటనతో సినీ ప్రేక్షకులను ఆకట్టుకొన్న లెజెండ్ అమితాబ్ బచ్చన్‌ ఏకగ్రీవంగా దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుకు ఎంపికైనట్టు ప్రకటించడం ఆనందంగా ఉంది. ఈ వార్తతో యావత్ ప్రపంచం, అంతర్జాతీయ సమాజం సంతోషంలో మునిగిపోయింది. ఆయనకు నా హృదయపూర్వక ధన్యవాదలు అని ప్రకాశ్ జవదేకర్ ట్వీట్ చేశారు.

    1969లో తొలిసారి సినీ రంగానికి

    1969లో తొలిసారి సినీ రంగానికి

    భారతీయ సినిమా పరిశ్రమకు గత 50 ఏళ్లుగా విశిష్టమైన సేవలు అందిస్తున్నారు. 1969లో మృణాల్ సేన్ రూపొందించిన భువన్ షోమ్ అనే సినిమాకు డబ్బింగ్ చెప్పడం ద్వారా సినీ రంగంలోకి ప్రవేశించారు. ఆయన సాత్ హిందూస్థాన్ చిత్రం ద్వారా నటుడిగా హిందీ చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యారు. అప్పటి ఆయన తన కెరీర్‌లో ఎన్నడూ ఎదురుచూసుకోలేదు.

    అమితాబ్ కెరీర్‌లో ఆణిముత్యాలు

    అమితాబ్ కెరీర్‌లో ఆణిముత్యాలు

    అమితాబ్ కెరీర్‌లో ఆనంద్, జంజీర్, షోలే, దీవార్, డాన్, కూలీ, షరాబీ, హమ్, మెహబ్బతే, అగ్నిపథ్ చిత్రాలు మైలురాయిగా నిలిచాయి. ఇటీవల విడుదలైన బ్లాక్, పా, పీకూ, పింక్ చిత్రాల్లో ఆయన నటనా ప్రతిభకు అద్దంగా నిలిచాయి. అంతేకాకుండా ఏబీసీఎల్ అనే కంపెనీ స్థాపించి పలు చిత్రాలను నిర్మించారు. ఆర్థిక చితికిపోయారు.

    కేబీసీ హోస్ట్‌గా

    కేబీసీ హోస్ట్‌గా

    ఇక సినిమా రంగానికే అమితాబ్ పరిమితం కాలేదు. టెలివిజన్‌ రంగంలో కౌన్ బనేగా కరోడ్ పతి అనే గేమ్ రియాలిటీ షోకు హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. దాదాపు రెండు దశాబ్దాలుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం విశేషం. 1942 అక్టోబర్ 11న ప్రముఖ కవి హరివంశరాయ్ బచ్చన్, తేజ్ బచ్చన్ దంపతులకు జన్మించారు. ప్రముఖ నటి జయబాధురిని వివాహం చేసుకొన్నారు. ఆయనకు అభిషేక్, శ్వేత బచ్చన్ సంతానం ఉన్నారు. ఐశ్వర్యరాయ్ ఆయన కోడలు అనే విషయం తెలిసిందే.

     సైరాతో టాలీవుడ్‌కు

    సైరాతో టాలీవుడ్‌కు

    ఇక 50 ఏళ్ల సినీ జీవితంలో మొదటిసారి అమితాబ్ బచ్చన్ దక్షిణాది చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టారు. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సైరా చిత్రంలో ఆయన కీలక పాత్ర పోషిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రం విడుదల కానున్నది.

    English summary
    Amitabh Bachchan honoured with Dada Saheb Phalke award. Prakash Javadekar tweets that The legend Amitabh Bachchan who entertained and inspired for 2 generations has been selected unanimously for #DadaSahabPhalke award. The entire country and international community is happy. My heartiest Congratulations to him. narendramodi, SrBachchan
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X