»   » 23న ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ పెళ్లి.. సినీ ఫక్కీలో కుదిరిన సంబంధం..

23న ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ పెళ్లి.. సినీ ఫక్కీలో కుదిరిన సంబంధం..

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాలీవుడ్‌లో ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు అంకిత్ తివారీ ఓ ఇంటివాడు కోబోతున్నాడు. మెకానికల్ ఇంజినీర్ అయిన పల్లవి శుక్లాతో ఫిబ్రవరి 23 తేదీన అంకిత్ వివాహం జరుగనున్నది. హిందీ చిత్ర పరిశ్రమలో చాలా క్రేజ్ ఉన్న ఈ గాయకుడి పెళ్లికి గురించి వార్త మీడియాలో హల్‌చల్ రేపుతున్నది. అదేమిటంటే..

ఆషికీ2తో బాలీవుడ్‌లోకి దూసుకొచ్చిన

ఆషికీ2తో బాలీవుడ్‌లోకి దూసుకొచ్చిన

ఆషికీ2 చిత్రంతో అంకిత్ తివారీ బాలీవుడ్ సంగీత సామ్రాజ్యంలోకి దూసుకొచ్చాడు. ఏక్ విలన్ చిత్రంలోని తెరి గలియా, ఆషికీ2లోని సున్ రహా నా తు లాంటి పాటలతో సంగీత ప్రేక్షకుల హ‌ృదయాల్లో చోటు సంపాదించుకొన్నాడు. పలు హిట్స్ సాంగ్స్‌ను అందించి స్టార్ సింగర్‌గా పేరుతెచ్చుకొన్నారు. ప్రస్తుతం బిజీగా మారిన సంగీత దర్శకుల్లో ఒకరిగా మారారు.

 గమ్మత్తుగా అంకిత్ పెళ్లి సంబంధం

గమ్మత్తుగా అంకిత్ పెళ్లి సంబంధం

అంకిత్ తివారీ పెళ్లి చాలా గమ్మత్తుగా కుదిరిందట. అంకిత్ నానమ్మ ఓ రోజు ఢిల్లీ నుంచి కాన్పూర్‌కు రైల్లో వెలుతుండగా ఆమెకు పల్లవి అనే అమ్మాయి పరిచయమైంది. తన మనవడికి పల్లవి పర్‌ఫెక్ట్ మ్యాచ్ అని భావించిందట. దాంతో మాటలు కలిపి తన మనవడి గురించి వివరించిందట. ఆ తర్వాత వారి మధ్య పరిచయం అతిసన్నిహితమైన బంధంగా మారడంతో అంకిత్ పెళ్లికి పల్లవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట.

 23న కాన్పూర్‌లో పెళ్లి, 26న రిసెప్షన్

23న కాన్పూర్‌లో పెళ్లి, 26న రిసెప్షన్

అంకిత్ పెళ్లికి సంబంధించిన పనులు జోరందుకున్నాయి. ఫిబ్రవరి 23న కాన్పూర్‌లో జరుగనున్నది. అంకిత్, పల్లవి పెళ్లి రిసెప్షన్ 26 తేదీన ముంబైలో నిర్వహించనున్నారు. గత పదేళ్లుగా బెంగళూరులో పల్లవి మెకానికల్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నట్టు సమాచారం.

బిజీ షెడ్యూల్ కారణంగా పెళ్లి..

బిజీ షెడ్యూల్ కారణంగా పెళ్లి..

పెళ్లి గురించి అంకిత్ మాట్లాడుతూ.. పల్లవి నాకు సరైన జోడు అని మా నాన్నమ్మ నిర్ణయం తీసుకొన్నది. ఆమె నిర్ణయాన్ని నాతోపాటు కుటుంబ సభ్యులు అంగీకరించారు. సాధారణంగా మా కుటుంబంలో పెళ్లి అంటే సుమారు 12 రోజులు జరుగుతుంది. కానీ బిజీ షెడ్యూల్ కారణంగా పెళ్లి కార్యక్రమాలను తొందరగా ముగించాలని అనుకొంటున్నాం. పెళ్లి తర్వాత పల్లవి ముంబైకి షిఫ్ట్ అవుతుంది అని తెలిపారు.

 అంకిత్ ఐయారీ రిలీజ్

అంకిత్ ఐయారీ రిలీజ్

అకింత్ పెళ్లికి వారం రోజుల ముందు తాను సంగీత దర్శకత్వం వహించిన ఐయారీ చిత్రం రిలీజ్ అవుతున్నది. రకుల్ ప్రీత్, సుశాంత్ సింగ్ తదితరులు నటించిన ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు నీరజ్ పాండే డైరెక్షన్ చేశాడు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన పాటలు ఆకట్టుకొంటున్నాయి.

English summary
Music composer and singer Ankit Tiwari, known for chartbusters like Teri Galliyan (Ek Villain) and Sunn Raha Hai Na Tu (Aashiqui 2), has found someone to say "Dil Cheez Tujhe De Di" to. The musician is tying the knot on February 23 this year, and his fiancee is Pallavi Shukla, a mechanical engineer.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X