»   » ప్రధాని మెడీపై ట్వీట్ చేసినపుడు ... నా తల్లిండ్రులను బెదిరించారు!

ప్రధాని మెడీపై ట్వీట్ చేసినపుడు ... నా తల్లిండ్రులను బెదిరించారు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

తన అభిప్రాయాలను నిర్మొహమాటంగా చెప్పడంలో ముందుండే ప్రముఖ బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ అనురాగ్ కశ్యప్.... 2016లో భారత్‌లో పాకిస్థాన్ యాక్టర్లపై బ్యాన్ విధించడాన్ని విమర్శిస్తూ ట్వీట్ చేసినపుడు కొందరు వ్యక్తుల నుండి బెదిరింపులు ఎదుర్కొన్నారట. అపుడు నా ఫ్యామిలీని, తల్లిదండ్రులను కూడా బెదిరించారని పిటీఐ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

మనం అధిక జనాభా గల దేశంలో ఉన్నాము. ఇక్కడి ప్రజలకు ఆగ్రహం ఎక్కువ, ఆకలి ఎక్కువ, పని కోసం చాలా మంది ఎదురు చూస్తున్నారు. ఒక్కోసారి వారు ఫ్రస్టేషన్‌కు గురవుతారు. కొన్ని సార్లు వారు ఇతరులను తిడుతూ కామెంట్స్ చేసినపుడు బెటర్‌గా ఫీలవుతారు. అందుకే ఏదైనా ట్వీట్ చేస్తూ దానికి వచ్చే రెస్పాన్స్ ట్వీట్లను నేను పట్టించుకోను... అని అనురాగ్ కశ్యప్ వెల్లడించారు.

Anurag Kashyap: My Parents Were Threatened When I Tweeted To The Prime Minister!

'యే దిల్ హై ముష్కిల్' సినిమా సమయంలో పాకిస్థాన్ నటులను తీసుకోవడంపై వివాదం నెలకొంది. ఆ సమయంలో నేను ప్రధాన మంత్రికి ఓ ట్వీట్ చేశాను. దీంతో కొందరు నా పర్సనల్ లైఫ్ మీద టార్గెట్ చేయడం మొదలు పెట్టారు. నా తల్లిదండ్రులను బెదిరించారు. అపుడు నా ఫ్యామిలీ చాలా భయ పడింది. దాదాపు 8 నెలల వరకు వారు నన్ను తమ కామెంట్లతో వెంటాడారు అని అనురాగ్ తెలిపారు.

అప్పట్లో భారత జవాన్లపై పాకిస్థాన్ దాడి చేయడం, అదే సమయంలో యే దిల్ హై ముష్కిల్ సినిమాలో పాకిస్థాన్ నటుడు ఫవాద్ ఖాన్‌ నటిస్తుండటంపై పెద్ద ఎత్తున ఆందోళన జరిగింది. ఆ సమయంలో‌ పాకిస్థాన్ నటులను ఇండియన్ సినిమాల్లో తీసుకోవద్దని డిమాండ్ తెరపైకి వచ్చింది. దీనిపై అనురాగ్ స్పందిస్తూ కేవలం ఫిల్మ్ మేకర్స్ ను మాత్రమే ఎందుకు టార్గెట్ చేస్తారు... ప్రధాని మోడీ కూడా లాహోర్ విజిట్ చేశారు కాదా అని ట్వీట్ చేశారు. దీంతో ఆయన్ను టార్గెట్ చేస్తూ కొందరు నెగిజన్లు బెదిరింపులకు పాల్పడ్డారు.

English summary
Filmmaker Anurag Kashyap, who rarely shies away from voicing his opinions, has said he was "scared" when his family received threats for his tweets criticising the ban on Pakistani artistes from working in Bollywood in 2016. He added that he has stopped reading responses to his posts.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X